విద్యుత్తు మంత్రిత్వ శాఖ
బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలను మూసివేయడం, బొగ్గు విద్యుత్ కేంద్రాల్లో కీలక సాంకేతికతలు అమలు చేయడం
Posted On:
10 AUG 2023 3:01PM by PIB Hyderabad
దేశంలోని పాత బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలను దశలవారీగా మూసివేసే ఎలాంటి ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం రూపొందించలేదని కేంద్ర విద్యుత్, నూతన & పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి రాజ్యసభకు తెలిపారు. 20.01.2023 నాటి సలహా ప్రకారం, భవిష్యత్‌లో విద్యుత్ డిమాండ్, లభ్యతను పరిగణనలోకి తీసుకుని, 2030 కంటే ముందు బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలను మూసివేయవద్దని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సూచించింది. 2030 వరకు, ఆ తర్వాత కూడా పని చేసేలా యూనిట్లను పునర్నిర్మించుకోవాలని & ఆధునీకరించాలని, ఫ్లాంట్ల జీవిత కాలాన్ని పెంచుకోవాలని, లేదా, వీలయితే గ్రిడ్‌లో సౌర & పవన విద్యుత్ ఏకీకరణను సులభంగా మార్చేలా రెండు షిఫ్టుల్లో పని చేయాలని కూడా బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలకు సూచించడం జరిగింది. విద్యుత్తు చట్టం-2003లోని సెక్షన్ 7 ప్రకారం, విద్యుత్ ఉత్పత్తి ఒక డీలైసెన్స్‌డ్ ప్రక్రియ. యూనిట్లను దశలవారీగా మూసివేసే నిర్ణయాన్ని విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు వాటి పరిస్థితుల ఆధారంగా తీసుకుంటాయి.
సామర్థ్యాలు పెంచుకోవడానికి, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి భారతదేశంలోని చాలా బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఇప్పటికే అత్యుత్తమ సాంకేతికతలను అవలంబించాయి. ఇప్పటి వరకు, 65,150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొత్తం 94 బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు సూపర్ క్రిటికల్/అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతికతలతో పని చేస్తున్నాయి.
కేంద్ర విద్యుత్, నూతన & పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి శ్రీ ఆర్ కె సింగ్ ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని తెలిపారు.
***
(Release ID: 1947425)
Visitor Counter : 155