గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద గ్రామాలు
Posted On:
09 AUG 2023 3:26PM by PIB Hyderabad
గత ఐదేళ్లలో సన్సద్ ఆదర్శ్ గ్రామ యోజన (ఎస్ఎజివై) కింద 1782 గ్రామ పంచాయతీలను దత్తత తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఏడాది వారీగా, రాష్ట్రాల వారీగా ఇలా ఉన్నాయి.
ఎస్ఎజివై కింద గ్రామపంచాయతీలను దత్తత తీసుకున్న పార్లమెంటు సభ్యుల సంఖ్య, సంవత్సరాల వారీగా, రాష్ట్రాల వారీగా ఈ క్రింది విధంగా ఉంది.
ఎస్ఎజివై ఫేజ్-1 (2014-16) కింద గుర్తించిన గ్రామ పంచాయతీల (జీపీ)ల ప్రాజెక్టు అనంతర మూల్యాంకనం దేశవ్యాప్తంగా తొమ్మిది విశ్వవిద్యాలయాల ద్వారా జరిగింది. జిల్లా అధికారుల చురుకైన జోక్యం, పార్లమెంట్ సభ్యుల సమర్థ నాయకత్వం ద్వారా ఎస్.ఎ.జి.వై గ్రామ పంచాయతీలు ప్రశంసనీయమైన పురోగతి సాధించినట్టు మూల్యాంకన నివేదికలు పేర్కొన్నాయి. ఎస్ఏజీవై కింద ఆమోదించిన గ్రామ పంచాయతీలలో పిల్లలకు టీకాలు వేయడం, ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బలోపేతం, సామాజిక భద్రతా పథకాలలో నమోదు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా వంటి అంశాలలో గణనీయమైన పురోగతి నమోదైంది.
ఈ కార్యక్రమం అమలులో తమ బాధ్యతల గురించి పార్లమెంటు సభ్యులతో సహా ఎస్ఎజివై భాగస్వాములందరికీ గుర్తు చేయడానికి మంత్రిత్వ శాఖ క్రమానుగత బల్క్ ఎస్ఎంఎస్ సేవను ప్రారంభించింది.
అంతేకాకుండా ఆయా ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామ పంచాయతీల పురోగతిని పర్యవేక్షించేందుకు వీలుగా 'ఎంపీ డ్యాష్ బోర్డు'ను రూపొందించారు. వివరాలు వెబ్ పేజీ https://saanjhi.gov.in/ChoosenReportNew.aspx లో అందుబాటులో ఉంటాయి. తాను తీసుకున్న గ్రామ పంచాయతీ పురోగతిని ఎం పి చెక్ చేయవచ్చు. దానిని సమీక్షించవచ్చు. ఎంపీలకు మిషన్ అంత్యోదయ స్కోరును యాక్సెస్ చేసి పురోగతిని అంచనా వేయగలుగుతారు. గ్రామ పంచాయతీ నుండి స్థానిక వినియోగదారులు కామెంట్స్ సెక్షన్ లో నమోదు చేసిన ఆందోళనలు, అభిప్రాయాలు కూడా ఎంపి, జిల్లా కలెక్టర్, ఛార్జ్ ఆఫీసర్ సహా రాష్ట్ర అధికారులకు కనిపిస్తాయి. అంతేకాకుండా, ఎస్ఏజీవై అమలును వేగవంతం చేయడంలో ఎంపీలకు సహాయపడటానికి మంత్రిత్వ శాఖ ఎంపీల ప్రతినిధులకు వర్క్ షాప్ లను నిర్వహించింది.
ఎస్ఏజీవై పోర్టల్ (saanjhi.gov.in)లో ఆయా రాష్ట్రాలు అప్లోడ్ చేసిన సమాచారం ఆధారంగా 2023 ఆగస్టు 3 నాటికి గత ఐదేళ్లలో సంవత్సరాల వారీగా, రాష్ట్రాల వారీగా సన్సద్ ఆదర్శ్ గ్రామ యోజన (ఎస్ఏజీవై) కింద దత్తత తీసుకున్న గ్రామ పంచాయతీలు
***
(Release ID: 1947277)
Visitor Counter : 180