వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో భారత్-వియత్నాం సంయుక్త వాణిజ్య ఉపసంఘం 5వ సమావేశం
వసతి, రవాణా (లాజిస్టిక్స్) సవాళ్లను అధిగమించడానికి నేరుగా ఓడల రవాణా సేవలు, సరుకు రవాణాలో సహకారం, విమాన సంధాయకత మెరుగుపరచాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.
Posted On:
08 AUG 2023 5:00PM by PIB Hyderabad
భారత-వియత్నాం సంయుక్త వాణిజ్య ఉపసంఘం 5వ సమావేశం మంగళవారం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి ఇండియా తరపున వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ , వియత్నాం వైపు నుంచి పరిశ్రమ మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ డిప్యూటీ మంత్రి శ్రీమతి ఫాన్ థీ థాంగ్ సహాధ్యక్షత వహించారు. విశ్వ మహమ్మారి కోవిడ్ -19 తదితర కారణాల దృష్ట్యా ఈ సమావేశం నాలుగు సంవత్సరాలకు పైగా విరామం తరువాత జరిగింది. నాల్గవ సంయుక్త సమావేశం 2019 జనవరిలో జరిగింది.
ప్రపంచంలో భారత్ తో వాణిజ్య సంబంధాలు ఉన్న అతిపెద్ద భాగస్వామ్య దేశాలలో వియత్నాం 23వది మరియు 2022-23లో
14.70 బిలియన్ల అమెరికా డాలర్ల వాణిజ్యం జరపడం ద్వారా ఆగ్నేయాసియా (ASEAN) దేశాలలో 5వ అతిపెద్దది. ASEANతో భారత్ జరిపే మొత్తం వాణిజ్యంలో వియత్నాం వాటా 11.2%. భారత్ నుంచి వియత్నాం ఇనుము & ఉక్కు, వ్యవసాయ మరియు జంతు ఉత్పత్తులు ప్రధానంగా మాంసం ఉత్పత్తులు , ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది.
ఇరుపక్షాలు ద్వైపాక్షిక వాణిజ్యం మరియు ఆర్థిక సహకారంపై పురోగతిని సమీక్షించాయి మరియు రెండు ఆర్థిక వ్యవస్థల భాగస్వామ్యం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రెండు దేశాలకు చెందిన వ్యాపార సంఘాలు ప్రయోజనం పొందేందుకు వీలుగా ద్వైపాక్షిక వాణిజ్యంలో ఇప్పటివరకు వినియోగంలోకి రాని విస్తృత సామర్థ్యాన్ని ఉపయోగంలోకి తేవడానికి గల మార్గాలను చర్చించారు.
రెండు దేశాల మధ్య వాణిజ్యం పెంపొందడానికి అవకాశమున్న వ్యవసాయం, మత్స్య, వస్త్రాలు, పాదరక్షలు, ఫార్మాస్యూటికల్స్, రసాయనాలు, ఎరువులు, యంత్రాలు మరియు పరికరాలు, వినియోగదారు ఉత్పత్తులు, ఇంధనం మరియు ఆటోమొబైల్ పరిశ్రమ వంటి సంభావ్య రంగాలను ఇరుపక్షాలు గుర్తించాయి వాణిజ్య సహకారాన్ని విస్తరించడానికి మరియు మార్కెట్ ప్రవేశ సౌలభ్యం పెంచడంలో ఎదురవుతున్న సమస్యలు మరియు ఎగుమతిదారులు ఎదుర్కొనే సాంకేతిక అడ్డంకులను పరిష్కరించడానికి కలిసి పనిచేయాలని, క్రమమైన మరియు నిరంతర ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.
భారతీయ మత్స్య మరియు మాంసం సంస్థల ద్వారా ఎగుమతులకు వీలు కల్పించే రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో ఉండటం, భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఔషధాలను బహిరంగంగా సేకరించకుండా మార్కెట్ ప్రవేశాన్ని పరిమితం చేయడం, భారతీయ పాలిస్టర్ ఫిలమెంట్ నూలు ఉత్పత్తులు మరియు సార్బిటాల్‌పై అధిక మొత్తంలో డంపింగ్ వ్యతిరేక సుంకాల విధింపు వంటి సమస్యలను భారతదేశం లేవనెత్తింది.
సేవారంగ సహకారంలో సంభావ్యతను గురించి భారత పక్షం విశేషంగా పేర్కొంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్థిక సేవలు, విద్యా రంగం, పర్యాటకం, ఆరోగ్య సంరక్షణ, టెలి-మెడిసిన్, మెడికల్ టూరిజం మరియు అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థలో సహకారాన్ని సూచించింది. వృత్తిపరమైన సేవలు, రూపే కార్డు అంతర్జాతీయీకరణ, QR ఆధారిత చెల్లింపు వ్యవస్థ మరియు దేశీయ కరెన్సీ ట్రేడ్ సెటిల్‌మెంట్‌పై పరస్పర గుర్తింపు ఒప్పందాల (MRAలు)ను కూడా భారతదేశం సూచించింది.
ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రభావితం చేసే లాజిస్టిక్స్ సవాళ్లను గురించి ఇరుపక్షాలు చర్చించాయి. వసతి, రవాణా (లాజిస్టిక్స్) సవాళ్లను అధిగమించడానికి నేరుగా ఓడల రవాణా సేవల అన్వేషణ, సరుకు రవాణాలో సహకారం, విమాన సంధాయకత మెరుగుపరిచే ప్రయత్నాలను కొనసాగించాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.
***
(Release ID: 1947145)
Visitor Counter : 116