జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పైప్ ల ద్వారా నీటి సరఫరా

Posted On: 03 AUG 2023 3:38PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట సహా వివిధ రాష్ర్టప్రభుత్వాల భాగస్వామ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ఒక్క ఇంటికీ టాప్  ల ద్వారా మంచినీటి సరఫరా కోసం 2019 ఆగస్టు నుంచి భారత ప్రభుత్వం జల్  జీవన్ మిషన్ -  హర్ ఘర్ జల్  కార్యక్రమం అమలు పరుస్తోంది. జెజెఎం ప్రారంభం నుంచి అదనంగా 19.45 కోట్ల గ్రామీణ గృహాలకు టాప్  కనెక్షన్లు అందించారు. ఆ రకంగా 2023 జూలై 31వ తేదీ నాటికి దేశంలోని మొత్తం 19.42 కోట్ల గ్రామీణ గృహాల్లో 12.69 కోట్ల గృహాలకు (65.33%) పైప్  నీటి కనెక్షన్ వసతి ఏర్పడింది.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట ప్రభుత్వాలు అందించిన సమాచారం ప్రకారం జెజెఎం కింద 2023 జూలై 31 నాటికి  టాప్  నీటి కనెక్షన్ల పురోగతి ఇలా ఉంది.

క్రమసంఖ్య

రాష్ర్టం

31.07.2023 నాటికి మొత్తం రూరల్  హెచ్ హెచ్ఎస్ లు

15.08.2019 నాటికి టాప్  నీటి కనెక్షన్లున్న రూరల్  హెచ్ హెచ్ఎస్  లు

31.07.2023 నాటికి జెజెఎం కింద టాప్  నీటి కనెక్షన్లు అందించిన రూరల్  హెచ్ హెచ్ఎస్  లు

1

ఉత్తరప్రదేశ్

262.40

5.16

139.04

2

మధ్యప్రదేశ్

119.63

13.53

47.86

3

మహారాష్ర్ట

146.73

48.44

65.72

దేశం మొత్తం మీద జెజెఎం అమలుపరచడానికి రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వార్షిక కార్యాచరణ ప్రణాళికపై (ఎఎపి) ఉమ్మడి చర్చలకు, అమలుపై క్రమం తప్పకుండా సమీక్షించడానికి, సామర్థ్యాల నిర్మాణంపై వర్క్ షాప్  లు/సమావేశాలు/వెబినార్ల నిర్వహణకు,  ప‌రిజ్ఞానం పంచుకోవడానికి, టెక్నికల్  మద్దతుకు బహుళ రంగాల క్షేత్రస్థాయి సందర్శనలకు పలు చర్యలు తీసుకుంటున్నారు. జెజెఎం-ఇంటిగ్రేటెడ్ మేనేజ్ మెంట్  సమాచార వ్యవస్థ (ఐఎంఐఎస్), జెజెఎం డాష్  బోర్డులను కూడా ఆన్  లైన్  పర్యవేక్షణకు రూపొందించారు. ప్రభుత్వ ఫైనాన్షియల్  మేనేజ్  మెంట్  సిస్టమ్ (పిఎఫ్ఎంఎస్) ద్వారా పారదర్శకంగా ఆన్ లైన్ ఫైనాన్షియల్  మేనేజ్  మెంట్  కు కూడా తగు చర్యలు తీసుకున్నారు.

అన్ని నీటి సరఫరా పనులను పర్యవేక్షించడంలో థర్డ్  పార్టీ ఇన్ స్పెక్షన్ ఏజెన్సీలను (టిపిఐఏ) చేర్చుకోవడానికి మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రణాళిక, పర్యవేక్షణ, నీటి సరఫరా వ్యవస్థకు చెందిన ఒ అండ్ ఎం ఎంలో కమ్యూనిటీ భాగస్వామ్యం కోసం తగు ఏర్పాట్లు కూడా చేశారు. ఏదైనా గ్రామాన్ని ‘‘హర్  ఘర్ జల్’’గా ధ్రువీకరించడానికి గ్రామంలోని ప్రతీ ఇల్లు, పాఠశాల, అంగన్  వాడీకి మంచినీటి పైప్  లైన్ ఉందని ధ్రువీకరించి గ్రామసభ ‘ఘర్ ఘర్ జల్’’ తీర్మానం ఆమోదించడానికి ముందస్తు ఏర్పాటు చేయడానికి పనులు పూర్తయినట్టు సర్టిఫై చేసే పారదర్శక బోర్డును కూడా ఏర్పాటు చేశారు.

దీనికి తోడు గ్రామాల్లో స్వతంత్ర మదింపు నిర్వహించి క్షేత్రస్థాయిలో రాష్ర్టప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సాంకేతిక సహాయం అందించడానికి నేషనల్  వాష్ (నీటి పారిశుధ్యం, స్వచ్ఛత) నిపుణులను ఏర్పాటు చేశారు. నేషనల్  వాష్  నిపుణుల నివేదికలు ప్రజల పరిశీలనకు కూడా ఉంచుతారు.

క్రమం తప్పకుండా కెమికల్, ఫిజికల్ కొలమానాల్లో ఏడాదికి ఒక సారి, బాక్టీరియలాజికల్  కొలమానాల్లో ఏడాదికి రెండు సార్లు నీటి పరీక్షలు నిర్వహించి తగు దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు, ఇళ్లకు  సరఫరా చేసే మంచినీరు నిర్దేశిత నాణ్యతలోనే ఉన్నట్టు ధ్రువీకరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని  రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించారు.

31.07.2023 నాటికి రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాలందించిన నివేదిక ప్రకారం దేశంలోని రాష్ర్టాలు, జిల్లాలు, సబ్-డివిజన్, బ్లాక్  స్థాయిలో 2087 మంచినీటి నాణ్యతా లాబ్ లు ఏర్పాటు చేశారు.  మంచినీటి సరఫరా అందరికీ అందుబాటులో ఉండేలా చూసేందుకు రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నీటి నాణ్యతా పరీక్ష లేబరేటరీలు ఏర్పాటు చేశాయి.

కాగా రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నీటి పరీక్షకు, శాంపిల్  సేకరణ, పర్యవేక్షణ, తనిఖీకి ఆన్ లైన్ జెజెఎం -  నీటి నాణ్యత మేనేజ్  మెంట్  ఇన్ఫర్మేషన్  సిస్టమ్ (డబ్ల్యుక్యుఎంఐఎస్) పోర్టల్  ను సిద్ధం చేశారు. 2023 సంవత్సరంలో ఇప్పటివరకు 107.92 లక్షల నీటి శాంపిల్స్  ను సేకరించి 62.81 లక్షల నీటి శాంపిల్స్  ను డబ్ల్యుక్యుఎంఐఎస్ ద్వారా పరీక్షించాయి. జెజెఎం డాష్  బోర్డుపై డబ్ల్యుక్యుఎంఐఎస్ ద్వారా రాష్ర్టస్థాయి నీటి నాణ్యతా పరీక్షల వివరాలు అందుబాటులో ఉంచారు.

https://ejalshakti.gov.in/WQMIS/Main/report

 

ఇంటర్నెట్  ఆఫ్ థింగ్స్ (ఐఓటి) వంటి  స్మార్ట్  టెక్నాలజీలను జెజెఎం నిర్వహణా మార్గదర్శకాల్లో చేర్చేందుకు కూడా చర్యలు తీసుకున్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరాను పరిశీలించేందుకు ఐఓటి ఆధారిత సొల్యూషన్లు అమలుపరచాలని అన్ని రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అలాంటి కార్యకలాపాలన్నింటికీ జెజెఎంకు కేటాయించిన నిధులు ఉపయోగించుకునేందుకు రాష్ర్టాలను అనుమతించారు.

ఐఓటి  సెన్సర్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఎలక్ర్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఇఐటివై) సహకారంతో మంచినీరు, పారిశుధ్య శాఖ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి) గ్రాండ్  చాలెంజ్ ను  ప్రారంభించింది. దీని కింద దేశంలోని 100 ప్రాంతాల్లో ఐఓటి సెన్సర్లు ఏర్పాటు చేశారు. ఈ సెన్సర్లను జెజెఎం డాష్  బోర్డుకు అనుసంధానం చేయడమే కాకుండా వాస్తవ ప్రాతిపదికన నీటి సరఫరాపై డేటా అందుబాటులో ఉంచారు. ఐఓటి సెన్సర్ల ఆధారిత మంచినీటి సరఫరా మౌలిక వసతుల ఏర్పాటు విషయంలో గోవా, గుజరాత్, బిహార్  ముందు వరుసలో ఉన్నాయి.

కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి శ్రీ ప్రహ్లాద్  సింగ్  పటేల్  లోక్ సభకు అందించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందచేశారు. 

 

***


(Release ID: 1947030) Visitor Counter : 90
Read this release in: English , Urdu , Tamil