ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు
Posted On:
08 AUG 2023 5:07PM by PIB Hyderabad
మహిళలు, గ్రామీణ మరియు షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ)/షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ) జనాభాతో సహా దేశవ్యాప్తంగా అందరికీ ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి భారత ప్రభుత్వం వివిధ పథకాలు/కార్యక్రమాలను అమలు చేస్తుంది.
ఈ పథకాలు/కార్యక్రమాలు:
ఆయుష్మాన్ భారత్- ఆరోగ్య మరియు వెల్నెస్ కేంద్రాల (హెల్త్అండ్ వెల్నెస్ కేంద్రాల) ద్వారా సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ (సీపీహెచ్సీ):
డిసెంబరు 2022 నాటికి దేశవ్యాప్తంగా 1,50,000 ఆయుష్మాన్ భారత్- ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాలను (ఏబీహెచ్డబ్ల్యూసీ) ఏర్పాటు చేయనున్నట్లు ఫిబ్రవరి 2018లో భారత ప్రభుత్వం ప్రకటించింది. సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ (కాంపరెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్)ని అందించడానికి.. ప్రస్తుతం ఉన్న ఉప-ఆరోగ్య కేంద్రాలు (సబ్ హెల్త్ సెంటర్స్), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (ప్రైమరీ హెల్త్ సెంటర్స్) మరియు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్) ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య, వెల్నెస్ సెంటర్లుగా మారుస్తారు. ఇందులో ప్రివెంటివ్, ప్రొమోటివ్, క్యూరేటివ్, పల్లియేటివ్, రిహాబిలిటేటివ్ సేవలు సార్వత్రికమైనవే కాకుండా ఉచితంగా అందిస్తారు. అంతేకాకుండా ఈ సేవలు ప్రజలకు అందుబాటు దూరంలో ఉంటాయి. 31.07.2023 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 1,60,816 ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య, వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటై, సేవలు అందిస్తున్నాయి.
ఆరోగ్య సంరక్షణ సేవల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి మరియు అవగాహన కల్పించడానికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య, వెల్ నెస్ సెంటర్ల స్థాయిలో ఆరోగ్య మేళాలు నిర్వహిస్తారు. ఆయుష్మాన్ హెల్త్ మేళాలు సమగ్రమైన ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి 'వన్-స్టాప్' ప్లాట్‌ఫారమ్‌లు. ఇవి ప్రజలకు చేరుకోవడానికి మరియు ఆరోగ్య సంరక్షణ సేవల వినియోగాన్ని పెంచడానికి సమర్థవంతమైన వ్యూహంగా నిరూపించబడ్డాయి.
ఇ–సంజీవని ద్వారా టెలికన్సల్టేషన్ సేవలను ప్రజలకు చేరువయ్యేలా చేసేందుకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య, వెల్ నెస్ సెంటర్లలో సేవలు అందుబాటులో ఉన్నాయి. 31 జూలై 2023 నాటికి, ఇ–సంజీవని పోర్టల్ ద్వారా 14.35 కోట్ల కంటే ఎక్కువ టెలికన్సల్టేషన్ సేవలు అందించబడ్డాయి. రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్ మరియు గర్భాశయ క్యాన్సర్ కోసం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య, వెల్ నెస్ సెంటర్లలో మహిళల స్క్రీనింగ్ కూడా జరుగుతోంది.
జాతీయ ఉచిత డ్రగ్స్ ఇనిషియేటివ్: రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రజారోగ్య సౌకర్యాల స్థాయి ఆధారంగా అవసరమైన మందులను ఈ సౌకర్యాలను పొందే వారందరికీ ఉచితంగా అందించడానికి మద్దతు ఇస్తున్నాయి.
ఉచిత డయాగ్నోస్టిక్స్ ఇనిషియేటివ్స్. (ఎఫ్డీఐ): ఉచిత డయాగ్నోస్టిక్స్ ఇనిషియేటివ్స్ కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వైద్య పరీక్షల సెట్ను, సబ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సహకరిస్తుంది. సబ్ సెంటర్, వెల్నెస్ సెంటర్ స్థాయిలో 14 పరీక్షలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పీహెచ్సీహెస్డబ్ల్యూసీ స్థాయిలో 63 పరీక్షలు, సీహెచ్సీ స్థాయిలో 97 పరీక్షలు, ఎస్డీహెచ్ స్థాయిలో 111 వైద్య పరీక్షలు, డీహెచ్ స్థాయలో 134 వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారు.
నేషనల్ అంబులెన్స్ సర్వీసెస్ (ఎన్ఏఎస్) - ఎన్హెచ్ఎం కింద, కేంద్రీకృత టోల్-ఫ్రీ నంబర్ 108/102తో అనుసంధానించబడిన ఫంక్షనల్ నేషనల్ అంబులెన్స్ సర్వీస్ (ఎన్ఏఎస్) నెట్‌వర్క్ ద్వారా రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలలో అత్యవసర వైద్య సేవల కోసం సాంకేతిక మరియు ఆర్థిక సహాయం అందించబడుతుంది.
నేషనల్ మొబైల్ మెడికల్ యూనిట్లు (ఎన్ఎంఎంయూ) - ప్రాథమిక సంరక్షణ సేవలను అందించడానికి రిమోట్, కష్టతరమైన, తక్కువ సేవలందించే మరియు చేరుకోని ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఇంటి వద్దే ప్రజారోగ్య సంరక్షణను సులభతరం చేయడానికి మద్దతునిస్తుంది.
పైన పేర్కొన్న పథకాలే కాకుండా, ముఖ్యంగా గర్భిణీ స్త్రీల కోసం ప్రభుత్వం ఈ క్రింది పథకాలను కూడా అమలు చేస్తోంది:
సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ (సుమన్).. ఎటువంటి ఖర్చు లేకుండా భరోసా, గౌరవప్రదమైన, మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందజేస్తుంది. అంతేకాకుండా నివారించగల అన్ని మాతృ మరియు నవజాత మరణాలను నిర్మూలించడానికి ప్రతి స్త్రీ మరియు నవజాత శిశువు ప్రజారోగ్య సౌకర్యాలను సందర్శించే సేవలను అందిస్తుంది.
జననీ సురక్ష యోజన (జేఎస్వై), సంస్థాగత డెలివరీని ప్రోత్సహించడానికి డిమాండ్ ప్రమోషన్ మరియు షరతులతో కూడిన నగదు బదిలీ పథకం.
జననీ శిశు సురక్ష కార్యక్రమం (జేఎస్ఎస్కే) కింద, ప్రతి గర్భిణీ స్త్రీకి ఉచిత రవాణా, రోగనిర్ధారణ, మందులు, రక్తం, ఇతర తినుబండారాలు & ఆహారం అందించడంతో పాటు ప్రజారోగ్య సంస్థల్లో సిజేరియన్‌తో సహా ఉచిత ప్రసవానికి అర్హులు.
ప్రధాన్ మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ (పీఎంఎస్ఎంఏ) గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల 9వ తేదీన స్పెషలిస్ట్/మెడికల్ ఆఫీసర్ ద్వారా నిర్ణీత రోజు, ఉచితంగా మరియు నాణ్యమైన ప్రసవ పరీక్షను అందజేస్తుంది.
లక్ష్య.. లేబర్ రూమ్ మరియు ప్రసూతి ఆపరేషన్ థియేటర్లలో సంరక్షణ నాణ్యతను మెరుగుపరుస్తుంది. గర్భిణీ స్త్రీలు డెలివరీ సమయంలో మరియు ప్రసవానంతరం తక్షణమే గౌరవప్రదమైన మరియు నాణ్యమైన సంరక్షణను అందుకుంటారు.
గర్భిణీ స్త్రీల సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడానికి మానవశక్తి, రక్త నిల్వ యూనిట్లు, రెఫరల్ లింకేజీలను నిర్ధారించడం ద్వారా మొదటి రెఫరల్ యూనిట్ల (ఎఫ్ఆర్యూలు) నిర్వహణ కోసం.. ముఖ్యంగా గిరిజన మరియు చేరుకోలేని ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి ఔట్‌రీచ్ క్యాంపులు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రసూతి & శిశు ఆరోగ్య సేవలపై అవగాహన పెంచడానికి, కమ్యూనిటీ సమీకరణతో పాటు అధిక ప్రమాదకర గర్భాలను ట్రాక్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
ఏఈసీ/బీసీసీ ప్రచారాలు: ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ & కమ్యూనికేషన్ (ఐఈసీ), ఇంటర్-పర్సనల్ కమ్యూనికేషన్ (ఐపీసీ) మరియు బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ (బీసీసీ) యాక్టివిటీస్ ద్వారా మెటర్నల్ హెల్త్ సేవలపై అవగాహన కల్పించడం ఈ ముఖ్య ఫోకస్ విభాగాలలో ఒకటి.
ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొ.ఎస్.పి.బాఘెల్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపారు.
***
(Release ID: 1946905)
Visitor Counter : 245