వ్యవసాయ మంత్రిత్వ శాఖ

పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడ్‌లో కొత్త పథకం

Posted On: 08 AUG 2023 6:43PM by PIB Hyderabad

నిర్ణీత వ్యవధిలో క్షేత్రస్థాయి పరిశీలనలు, డేటా మరియు అనుమితుల ఆధారంగా వ్యవసాయ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి మరియు మెరుగుపరచడానికి ప్రైవేట్ కంపెనీలు/స్టార్టప్‌ల ద్వారా ఎంపిక చేయబడిన సాంకేతికతలు/జోక్యాలను పైలట్ స్కేల్‌లో సంయుక్తంగా అమలు చేయడం కోసం ప్రభుత్వం వ్యవసాయ ఆవిష్కరణలను ప్రభావితం చేయడం కోసం స్క్రీనింగ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

 

2023-24 బడ్జెట్ ప్రకటనల ప్రకారం వ్యవసాయం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఓపెన్ సోర్స్‌గా, ఇంటర్‌ఆపరబుల్ పబ్లిక్ గూడ్స్‌లో ఓపెన్ స్టాండర్డ్‌గా ప్రభుత్వం నిర్మించింది. దీనికి సంబంధించి, మూడు కోర్ రిజిస్ట్రీల ఆర్కిటెక్చర్ అంటే రైతు రిజిస్ట్రీ, గ్రామ మ్యాప్ రిజిస్ట్రీ యొక్క జియో రిఫరెన్సింగ్, క్రాప్ సోన్ రిజిస్ట్రీ ఖరారు చేయబడ్డాయి. ఈ రిజిస్ట్రీలను రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ రంగ సంస్థలు వివిధ రైతుల కేంద్రీకృత పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగించవచ్చు.

 

వ్యవసాయ ఉత్పత్తి విలువ గొలుసుకు సంబంధించిన వ్యవసాయం మరియు గ్రామీణ పరిశ్రమల కోసం స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం చేయడానికి మిశ్రమ మూలధన మద్దతు కోసం కేంద్ర రంగ పథకాన్ని వ్యయ ఆర్థిక కమిటీ ఆమోదించింది.

 

వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీల  ప్రభావవంతమైన సురక్షితమైన సేవలు ప్రత్యేక ప్రయోజనాలను పరిశీలిస్తూ  వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ   పురుగుమందులు మరియు పోషకాల వినియోగం లో  డ్రోన్‌ల వినియోగం కోసం ప్రామాణిక ఆపరేటింగ్ పద్దతులను డిసెంబర్ 2021లో పబ్లిక్ డొమైన్‌లో విడుదల చేసింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు మరియు ఈ రంగంలోని ఇతర వాటాదారులకు అందుబాటులో ఉండేలా చేయడానికి, రైతుల పొలాల్లో దాని ప్రదర్శన, వ్యవసాయ డ్రోన్‌ల కొనుగోలుకు మరియు అదనపు ఉపకరణాల(వాస్తవ వ్యయం మరియు అదనపు ఉపకరణాలు లేదా రూ. 10.00 లక్షలు, ఏది తక్కువైతే అది)కు ఆర్థిక సహాయం @ 100%ఆకస్మిక వ్యయం వ్యవసాయ యాంత్రీకరణపై ఉప-మిషన్ కింద  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, కృషి విజ్ఞాన కేంద్రం మరియు రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు  మరియు @ 75% ఎఫ్ పీ ఓ లకు వ్యవసాయ యంత్రాల శిక్షణ & పరీక్షా సంస్థలకు విస్తరించబడింది.  డ్రోన్ అప్లికేషన్ ద్వారా వ్యవసాయ సేవలను అందించడానికి, డ్రోన్ మరియు దాని అదనపు ఉపకరణాలు ప్రాథమిక వ్యయంలో @ 40% ఆర్థిక సహాయం లేదా రూ. 4 లక్షలు, ప్రస్తుతం ఉన్న మరియు కొత్త కస్టమ్ హైరింగ్ సెంటర్‌లు  మరియు సాధారణ కేటగిరీ రైతులు డ్రోన్ కొనుగోలు కోసం మరియు డ్రోన్ మరియు దాని అదనపు ఉపకరణాలు యొక్క ప్రాథమిక ధరలో @ 50% మరియు లేదా  ఎస్ సి/ ఎస్ టీ /మహిళలు/చిన్న మరియు సన్నకారు రైతులు మరియు వ్యవసాయ పట్టభద్రులకు రూ. 5 లక్షలు.

 

2018 -19లో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద "ఇన్నోవేషన్ అండ్ అగ్రి-ఎంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్" అనే కాంపోనెంట్ ప్రారంభించబడింది. ఇది ఆవిష్కరణ మరియు వ్యవసాయ వాణిజ్యవేత్తల ను ప్రోత్సహించటం , ఆర్థిక సహాయాన్ని అందించడం మరియు ఇంక్యుబేషన్ ఎకోసిస్ట్‌ను పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ కార్యక్రమం కింద, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించమని స్టార్టప్‌లను ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమం అమలు కోసం డిపార్ట్‌మెంట్ నియమించిన నాలెడ్జ్ పార్టనర్‌లు మరియు అగ్రి బిజినెస్ ఇంక్యుబేటర్ల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడానికి  వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలోని వివిధ రంగాలలో మొత్తం 1176 స్టార్టప్‌లు ఎంపిక చేయబడ్డాయి.

 

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ 2016-2017 సంవత్సరంలో ప్రారంభించిన నేషనల్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్ ఫండ్ అనే ప్రాజెక్ట్ కింద వ్యవసాయ ఆధారిత స్టార్టప్‌లకు మద్దతునిస్తోంది. ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. (I) ఇన్నోవేషన్ ఫండ్; (II) ఇంక్యుబేషన్ ఫండ్ మరియు నేషనల్ కోఆర్డినేటింగ్ యూనిట్:

 

భాగం I: 10 జోనల్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ యూనిట్లు మరియు 89 ఇన్‌స్టిట్యూట్‌లు

99 ఐకర్ ఇన్‌స్టిట్యూట్‌లలో స్థాపించబడిన టెక్నాలజీ మేనేజ్‌మెంట్ యూనిట్లు ఆవిష్కరణలను నిర్వహించడానికి, మేధో సంపత్తి (నిర్వహణ మరియు ఈ సంస్థల్లో సాంకేతికతలను బదిలీ/వాణిజ్యీకరణకు సంబంధించిన విషయాలను కొనసాగించడానికి ఒకే విండో యంత్రాంగాన్ని అందిస్తాయి.

 

కాంపోనెంట్ II: కొత్త సాంకేతికతలను వాటాదారులకు త్వరగా అందించడానికి అగ్రి బిజినెస్ ఇంక్యుబేటర్ సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి. వ్యవసాయ పరిశోధన  అభివృద్ధి ఇన్‌స్టిట్యూషన్‌లకు  సరైన సాంకేతికతలను ఇంక్యుబేషన్/వాణిజ్యీకరణ కోసం కావలసిన లింక్‌ను అందించడానికి ఏ బీ ఐ సీ లు నోడల్ పాయింట్. ఇప్పటివరకు, 50 అగ్రి-బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్లు స్థాపించబడ్డాయి మరియు ఎన్ ఎ ఐ ఎఫ్ పథకం కింద ఐకర్ నెట్‌వర్క్‌లో పనిచేస్తున్నాయి.

 

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.

 

***



(Release ID: 1946903) Visitor Counter : 118


Read this release in: English , Urdu