ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కృత్రిమ స్వీట్నర్ల వినియోగానికి మార్గదర్శకాలు
Posted On:
08 AUG 2023 5:08PM by PIB Hyderabad
నాన్షుగర్ స్వీట్నర్ ‘ఆస్పర్టేమ్’ మానవులలో కార్సినోజెనిసిటీకి కారకమవుతుందని చెప్పేందుకు పరిమిత ఆధారాలు మాత్రమే ఉన్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలియజేసింది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్సీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ–-ప్రపంచ ఆహార సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ - ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్) ఆహార సంకలనాలపై జాయింట్ ఎక్స్ పర్ట్ కమిటీ(జేఈసీఎఫ్ఏ) మేరకు ఈ విషయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. అయినప్పటికీ ‘ఆస్పర్టేమ్’ను ‘బహుశా క్యాన్సర్ కారకమైనది’గా వర్గీకరించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్).. ఆహార సంకలనాలపై జాయింట్ ఎక్స్ పర్ట్ కమిటీ(జేఈసీఎఫ్ఏ) సూచనమేరకు కిలో శరీర బరువుకు 40 మిల్లీ గ్రాముల మోతాదుకు మించకూడదని స్పష్టం చేసింది.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఫుడ్ ప్రొడక్ట్స్ స్టాండర్డ్స్ అండ్ ఫుడ్ అడిటివ్స్) రెగ్యులేషన్–2011లో వివిధ కృత్రిమ స్వీటెనర్ల ప్రమాణాలను నిర్దేశించింది. ఆహార సంకలనాలపై జాయింట్ ఎక్స్ పర్ట్ కమిటీ(జేఈసీఎఫ్ఏ), ప్రపంచ ఆరోగ్య సంస్థ–-ప్రపంచ ఆహార సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ - ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్) పరిమితుల మేరకు నాన్ క్యాలరీ స్వీటెనర్స్ మరియు వినియోగ ప్రమాణాలు ఉండాలని నిర్దేశించింది. అంతేకాకుండా ఈ పరిమితులు కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్‌కు అనుగుణంగా ఉన్నాయి. .
ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి.బాఘెల్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపారు.
***
(Release ID: 1946902)
Visitor Counter : 113