ఉక్కు మంత్రిత్వ శాఖ
స్టీలు రంగం డీకార్బనీకరణకు టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేసిన స్టీలు మంత్రిత్వ శాఖ
స్క్రాప్డ్/ పునరుపయోగిత స్టీలు ద్వారా ఉత్తమ నాణ్యత కలిగిన స్టీలును ప్రోత్సహించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం
Posted On:
08 AUG 2023 1:45PM by PIB Hyderabad
స్టీలు రంగం డీకార్బనీకరణ పై చర్చించి, పర్యాలోచించి, సూచనలు చేసేందుకు పరిశ్రమలు,విద్యావేత్తలు, థింక్ ట్యాంక్‌లు, శాస్త్ర సాంకేతిక సంస్థలు, వివిధ మంత్రిత్వ శాఖలు, ఇతర భాగస్వాములతో నిశ్చయించి 13 టాస్క్ ఫోర్స్‌లను స్టీలు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. పర్యావరణ అనుకూల స్టీలు ఉత్పత్తి చేయడం ద్వారా స్టీలు రంగం పరివర్తన చెందేలా నిర్ధారించేందుకు కార్మిక శక్తికి నైపుణ్యాలు పెంచడం, ఆధునిక నైపుణ్యాలను, నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు నైపుణ్యాల అభివృద్ధి పై టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.
తక్కు/ పునరుపయోగిత స్టీల్ ద్వారా ఉత్తమ నాణ్యత కలిగిన స్టీల్‌ను ప్రోత్సహించడం
భారత ప్రభుత్వం తక్కు/ పునరుపయోగిత స్టీల్ ద్వారా ఉత్తమ నాణ్యత కలిగిన స్టీల్‌ను ప్రోత్సహించేందుకు, అందుకు స్టీలు ఉత్పత్తిదారులు కట్టుబడి ఉండేందుకు పలు చర్యలను తీసుకుంది.
(1) ఇన్‌పుట్ సామాగ్రితో సంబంధం లేకుండా ప్రజా బాహుళ్యానికి నాణ్యత కలిగిన ఉత్పత్తిని అందించేందుకు స్టీల్ మంత్రిత్వ శాఖ 145 స్టీల్, స్టీల్ ఉత్పత్తుల భారతీయ ప్రమాణాలను క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (క్యూసిఒ- నాణ్యతా నియంత్రణ క్రమం) పరిధి కింద ఉంచింది.
(2) స్టీలు తయారీలో బొగ్గు వినియోగాన్ని తగ్గించేందుకు దేశీయంగా ఉత్పత్తి చేసిన స్క్రాప్ అందుబాటును స్టీల్ స్క్రాప్ రీసైక్లింగ్ పాలసీ, 2019 పెంచుతుంది.
(3) 23 సెప్టెంబర్ 2021వ తేదీన జారీ చేసిన మోటార్ వాహనాలు (వాహనాల స్క్రాపింగ్ సౌకర్యం విధులు & నమోదు) నిబంధనలు స్టీల్ రంగంలో స్క్రాప్ అందుబాటును పెంచుతాయి.
(4) ప్రాజెక్టుల విస్తరణ & ఆధునీకరణలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాంకేతికతలు (బిఎటి)ని స్టీలు రంగం స్వీకరించింది.
***
(Release ID: 1946864)
Visitor Counter : 96