నౌకారవాణా మంత్రిత్వ శాఖ
ఎం.వి. గంగా విలాస్ రివర్ క్రూయిజ్ విశేషాలు
Posted On:
08 AUG 2023 2:54PM by PIB Hyderabad
గంగా విలాస్ రివర్ క్రూయిజ్ తన ప్రయాణంలో భారతదేశం, బంగ్లాదేశ్లోని క్రింది ప్రదేశాలను కవర్ చేసింది; - భారతదేశం: వారణాసి, ఘాజీపూర్, బక్సర్, దోరిగంజ్, పాట్నా, ముంగేర్, సుల్తంగంజ్, విక్రమశిల (కహల్గావ్), బటేశ్వరస్థాన్, సాహిబ్‌గంజ్, బారానగర్, అజిమ్‌గంజ్, హజర్ద్వారీ, మతియారీ, కల్నా, చందన్నగర్, హౌరా, కోల్‌కతా, బాలిస్దర్ సుర్బాన్, బాలిస్ధర్ , గోల్పారా, సల్కుచి, గౌహతి, తేజ్‌పూర్, సిల్ఘాట్, బిస్వనాథ్ ఘాట్, కెట్కేరిఘాట్, సిబ్సాగర్, మజులి ద్వీపం మరియు బోగీబీల్ (దిబ్రూగర్).
బంగ్లాదేశ్: మోంగ్లా, జమ్టోలా, హర్బరియా, మోరెల్గంజ్, బరిసల్, ఢాకా, తంగైల్, సిరాజ్గంజ్ మరియు చిల్మారి.
'ఎం.వి. గంగా విలాస్' తన ప్రయాణాన్ని 2023 జనవరి 13న వారణాసి నుండి భారతదేశం మరియు బంగ్లాదేశ్లోని 27 నదీ వ్యవస్థల ద్వారా 3,200 కి.మీల దూరాన్ని కవర్ చేసింది. 28 ఫిబ్రవరి, 2023న దిబ్రూఘర్కు చేరుకుంది. ఈ ప్రయాణం మొత్తం దక్షిణాసియా ప్రాంతంలో నది పర్యాటక అవకాశాలలో కొత్త అవకాశాలను తెరిచింది. షిప్పింగ్ & నావిగేషన్ కోసం జాతీయ జలమార్గాలను (ఎన్.డబ్ల్యుఎస్) అభివృద్ధి చేయడం మరియు నియంత్రించడం అనేది ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐ.డబ్ల్యు.ఎ.ఐ) యొక్క ఆదేశం. అయినప్పటికీ, ఫెయిర్‌వే, టెర్మినల్స్, జెట్టీలు, నావిగేషన్ ఎయిడ్స్ మొదలైనవాటితో సహా ఐవై ద్వారా ఎన్.డబ్ల్యులలో రవాణా కోసం అభివృద్ధి చేయబడిన మౌలిక సదుపాయాలను రివర్ టూరిజం ఆపరేటర్లు కూడా ఉపయోగిస్తున్నారు. ఐ.డబ్ల్యు.ఎ.ఐ కేవలం ఎన్.డబ్ల్యు.లలో క్రూయిజ్/రివర్ టూరిజం కోసం టెక్నికల్ ఫెసిలిటేటర్ పాత్రను మాత్రమే పోషిస్తుంది. ఇంకా, భారతదేశంలో ఉన్న రివర్ క్రూయిజ్ టూరిజం యొక్క విస్తారమైన సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి మరియు నది క్రూయిజ్లలో సందర్శకుల భాగస్వామ్యాన్ని పెంచడానికి, భారతదేశంలో రివర్ క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక & వివరణాత్మక రోడ్ మ్యాప్ తయారీపై ఐ.డబ్ల్యు.ఎ.ఐ నవంబర్ 2022లో ఒక అధ్యయనాన్ని పూర్తి చేసింది. భారతదేశంలోని జాతీయ జలమార్గాలపై కార్గో, ప్రయాణీకులు మరియు పర్యాటకులను పెంచడానికి పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఐ.డబ్ల్యు.ఎ.ఐ అనేక చర్యలు తీసుకుంది. ఐ.డబ్ల్యు.ఎ.ఐ క్రూయిజ్ వెసెల్ ఆపరేటర్లు మరియు ఇతర వాటాదారులతో సంప్రదించి రివర్ క్రూయిజ్ టూరిజంను పెంచడానికి తగిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది. దీనికి సంబంధించి తీసుకున్న చర్యలు అనుబంధం-Iలో వివరించబడ్డాయి.
అనుబంధం -1
దేశంలో నదీ క్రూయిజ్ టూరిజంను ప్రోత్సహించడానికి తీసుకున్న చర్యలు:
1. ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ, (ఎం.ఒ.పి.ఎస్.డబ్ల్యు) 1వ ఇన్క్రెడిబుల్ ఇండియా ఇంటర్నేషనల్ క్రూయిజ్ కాన్ఫరెన్స్-2022ని ముంబయిలో 14-15 మే, 2022న నిర్వహించింది.
2. "పోటెన్షియల్ ఆఫ్ రివర్ క్రూజ్" అనే సెషన్ను ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐ.డబ్ల్యు.ఎ.ఐ.) ప్రోత్సహించింది, ఇందులో ప్రపంచంలోని ప్రముఖ క్రూయిజ్ ఆపరేటర్లు పాల్గొన్నారు.
3. జలమార్గాలు మరియు క్రూయిజ్ కాన్ఫరెన్స్పై చేసిన పని ఫలితంగా జలమార్గాలలో డ్రాఫ్ట్ మరియు నావిగేషనల్ సహాయాలు మరియు నిర్మించబడిన మరియు ప్రణాళిక చేయబడిన జెట్టీలను నిర్ధారించడంలో ఐ.డబ్ల్యు.ఎ.ఐ. చేసిన పని భాగస్వామ్యం చేయబడింది. మెస్సర్స్ హెరిటేజ్ రివర్ జర్నీస్ ప్రై.లి., కంపెనీతో మెస్సర్స్ అంటారా రివర్ క్రూయిజ్ సంస్థతోను మరియు రివర్ క్రూయిజ్‌ల ప్రచారం కోసం మెస్సర్స్ జె.ఎం. బక్సీ & కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
i. గౌరవనీయులైన ప్రధాన మంత్రి 2023 జనవరి 13వ తేదీన i. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ సేవలను ప్రారంభించారు. వారణాసి నుండి జలమార్గం-1 (గంగా నది) నుండి బంగ్లాదేశ్ మీదుగా డిబ్రూఘర్ జలమార్గం-2 (బ్రహ్మపుత్ర నది) వరకు దాదాపు 3200 కి.మీ జలమార్గ దూరాన్ని విజయవంతంగా అధిగమించారు.
ii. గంగా, బ్రహ్మపుత్ర, కేరళ బ్యాక్ వాటర్స్, ఒడిశా మొదలైన మార్గాలలో అనేక నదీ విహారయాత్రల సంఖ్య పెరిగింది.
జాతీయ జలమార్గాలపై నది క్రూయిజ్‌లు సజావుగా సాగేందుకు ఐ.డబ్ల్యు.ఎ.ఐ. కింది మౌలిక సదుపాయాలను కల్పించింది.: -
ఎ. బెర్తింగ్ సౌకర్యాలు: నౌకను బెర్త్ చేయడానికి మరియు పర్యాటకులు ఎక్కేందుకు/ దిగడానికి వివిధ ప్రదేశాలలో ఫ్లోటింగ్ పాంటూన్‌లు ఉంచబడ్డాయి. రివర్ క్రూయిజ్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి, ఎన్.డబ్ల్యు-1 మరియు ఎన్.డబ్ల్యు-2లో 9 టూరిస్ట్ జెట్టీల నిర్మాణానికి ఐ.డబ్ల్యు.ఎ.ఐ. మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం కలిగి ఉంది.
బి. ఫెయిర్‌వే: నావిగేషనల్ ఫెయిర్‌వేతో పాటు నావిగేషనల్ ఎయిడ్స్‌తో ఛానెల్‌ను గుర్తించడం మరియు క్రూయిజ్ నౌకలను సురక్షితంగా నడిపేందుకు ఎలక్ట్రానిక్ నావిగేషన్ చార్ట్.
సి. పైలటేజీ: పైలట్‌లకు డిమాండ్ ఉన్నప్ప్టికీ చాలా నామమాత్రపు ఛార్జీ రోజుకు రూ. 750/- నీటి మార్గంలో నౌకను నావిగేట్ చేసేలా చర్యలు చేపట్టడమైంది.
డి. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం: ప్రయాణాన్ని సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహిత సమన్వయంతో క్రూయిజ్ ఆపరేటర్లకు సహాయం అందించబడుతుంది.
ఇ. ఆపదలో ఉన్న ఓడకు సహాయం: జాతీయ జలమార్గంలో యాంత్రిక వైఫల్యం లేదా ఇతరత్రా కష్టాల్లో ఉన్నప్పుడు క్రూయిజ్ ఓడను సురక్షిత ప్రదేశానికి తీసుకువచ్చేందుకు ఐవై అధిక శక్తితో కూడిన టగ్‌ను అందిస్తుంది.
ఈ విషయాన్ని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
*****
(Release ID: 1946849)
Visitor Counter : 95