పర్యటక మంత్రిత్వ శాఖ
మెడికల్ టూరిజం, మెడికల్ అండ్ వెల్నెస్ టూరిజం అభివృద్ధి కోసం జాతీయ వ్యూహం , కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన పర్యాటక మంత్రిత్వ శాఖ
Posted On:
07 AUG 2023 6:22PM by PIB Hyderabad
దేశంలో మెడికల్ టూరిజం, మెడికల్ అండ్ వెల్నెస్ టూరిజం అభివృద్ధి కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ జాతీయ వ్యూహం , కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. కింది అంశాలను దృష్టిలో ఉంచుకుని పర్యాటక శాఖ తన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది.
(i) ఒక వెల్‌నెస్ డెస్టినేషన్‌గా బ్రాండ్‌గా భారతదేశాన్ని అభివృద్ధి చేయడం
(ii) మెడికల్ అండ్ వెల్నెస్ టూరిజం కోసం పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం
(iii) ఆన్‌లైన్ మెడికల్ వాల్యూ ట్రావెల్ (MVT) పోర్టల్‌ని ప్రారంభించి డిజిటలైజేషన్ చేయడం
(iv) మెడికల్ వాల్యూ ట్రావెల్ కోసం అవకాశాలు ఎక్కువ చేయడం
(v) వెల్‌నెస్ టూరిజంను ప్రోత్సహించడం
(vi) పాలన ,సంస్థాగత వ్యవస్థను పటిష్టం చేయడం
పర్యాటక రంగం అభివృద్ధి కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగా 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా' కార్యక్రమం కింద దేశంలో ఉన్న వివిధ పర్యాటక కేంద్రాలు, ఉత్పత్తులను ప్రోత్సహించడానికి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. విదేశాలు, ముఖ్యమైన మార్కెట్‌లలో ప్రచారం నిర్వహించడానికి అంతర్జాతీయ ప్రింట్, ఎలక్ట్రానిక్,ఆన్‌లైన్ మీడియా ప్రచారాలను శాఖ నిర్వహిస్తోంది. మెడికల్ టూరిజం తో సహా వివిధ పర్యాటక రంగాలను సోషల్ మీడియా ఖాతాల ద్వారా డిజిటల్ ప్రమోషన్‌లు పర్యాటక శాఖ క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది.
30.11.2016 న కేంద్ర మంత్రివర్గం తెలిపినఆమోదం మేరకు భారత ప్రభుత్వం ఈ టూరిస్ట్ వీసా పథకాన్ని సరళీకృతం చేసింది. ఈ -టూరిస్ట్ వీసా (eTV) పథకం పేరును ఈ -వీసా పథకంగా మార్చింది. ప్రస్తుతం ఈ-వీసా కింద ఈ -మెడికల్ వీసా,ఈ-మెడికల్ అటెండెంట్ వీసా జారీ అవుతున్నాయి.
ఈ -మెడికల్ వీసా,ఈ -మెడికల్ అటెండెంట్ వీసా కింద ముగ్గురు వ్యక్తులు దేశంలోకి రావచ్చు. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ / ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విడివిడిగా పరిశీలించి వీసా మంజూరు చేస్తారు. మెరిట్ ఆధారంగా వీసాను 6 నెలల వరకు పాడిగిస్తారు.. మెడికల్ అటెండెంట్ వీసా ప్రధాన ఈ -వీసా చెల్లుబాటు అయ్యే వరకు చెల్లుబాటు అవుతుంది.
, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇతర మంత్రిత్వ శాఖలు సంబంధిత వర్గాలతో కలిసి పర్యాటక మంత్రిత్వ శాఖ పని చేస్తోంది. దేశంలో వైద్య విలువ ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ఆసుపత్రులు, మెడికల్ వాల్యూ ట్రావెల్ (MVT) సేవలు అందిస్తున్న సంస్థలు,బీమా సంస్థలతో సమన్వయం తో మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది.
ఈ రోజు లోక్‌సభలో ఈశాన్య ప్రాంత, సాంస్కృతిక, పర్యాటక మరియు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ వివరాలు అందించారు.
****
(Release ID: 1946613)
Visitor Counter : 105