పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఎటిసిఒల ఖాళీ భర్తీలో బ్యాక్‌లాగ్‌లు లేవు
2020 నుంచి అదనంగా 796 ఎటిసిఒ స్థానాల సృష్టి
400 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎటిసి) పోస్టులకు పూర్తి అయిన నియామకం
మరో 356 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎటిసి) పోస్టుల ప్రత్యక్ష నియామకం కోసం చర్యలు చేపట్టిన ఎఎఐ
Posted On:
07 AUG 2023 2:33PM by PIB Hyderabad
ప్రస్తుతం 870 ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఎటిసిఒలు) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎటిసిఒ ఖాళీల భర్తీలో ఎటువంటి బ్యాక్‌లాగ్ (మిగిలి ఉన్న ఖాళీలు) లూ లేవు. ఎటిసిఒల మానవ వనరుల అవసరాలను తీర్చేందుకు 2022 నుంచి అదనంగా 796 ఎటిసిఒ స్థానాలను సృష్టించడం జరిగింది. ఖాళీగా ఉన్న ఎటిసిఒ పోస్టులను ప్రత్యక్ష నియామక పరీక్ష, దానితో పాటుగా డిపార్ట్‌మెంటల్ పరీక్షతో పాటు అంతర్గతంగా భర్తీ చేస్తున్నారు. దాదాపు 400 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎటిసి) పోస్టులను భర్తీ చేసేందుకు ప్రత్యక్ష నియామక ప్రక్రియ పూర్తి అయింది. ఎంపిక చేసిన అభ్యర్ధులు ప్రస్తుతం మూడు శిక్షణా కేంద్రాలలో శిక్షణ పొందుతున్నారు. ఇది కాకుండా, 356 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎటిసి) పోస్టుల ప్రత్యక్ష నియామకానికి ఎఎఐ ప్రక్రియను ప్రారంభించింది.
ఈ సమాచారాన్ని పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జనరల్(డాక్టర్) వికె సింగ్ (రిటైర్డ్) సోమవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక జవాబు ద్వారా తెలిపారు.
***
(Release ID: 1946607)
Visitor Counter : 120