పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వాయు కాలుష్య పరిష్కార సాంకేతిక పరిజ్ఞానాలు

Posted On: 07 AUG 2023 4:04PM by PIB Hyderabad

   ఢిల్లీ రాజధాని నగర ప్రాంతంలో పర్యావరణం నుంచి ప్రయోగాత్మకంగా దుమ్ము సేకరణ కోసం 30 బస్సుల పైభాగంలో దుమ్ము సంగ్రహణ-వడపోత పరికరాలు (పరియాయంత్ర ఫిల్ట్రేషన్) అమర్చి అధ్యయనం నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించింది. కాగా, రాజధాని నగర ప్రాంతంలో వాయు కాలుష్య పరిష్కారానికి అనేక కొత్త సాంకేతికతల వినియోగం కోసం పలు పథకాలు చేపట్టబడ్డాయి. వీటికి సంబంధించిన వివరాలను అనుబంధం-Iలో చూడవచ్చు.

అనుబంధం-I

వాయు కాలుష్య నిరోధంలో కొత్త సాంకేతికతల అనుసరణకు చేపట్టిన అధ్యయనాల వివరాలు:

  1. ‘వా-యు’ (డబ్ల్యుఎవైయు) ప్రయోగాత్మక అధ్యయనం కింద ఢిల్లీలోని ట్రాఫిక్ కూడళ్లలో 54 వాయుశుద్ధి యూనిట్ల ఏర్పాటు.
  2. ‘దుమ్మును అణచివేసే ఉపకరణాలతో దుమ్ము ఉద్గారాల నియంత్రణ’పై ప్రయోగాత్మక అధ్యయనం.
  3. ‘పరిసర వాయు కాలుష్యం తగ్గింపు దిశగా అయనీకరణ సాంకేతికత’పై ప్రయోగాత్మక అధ్యయనం.
  4. రేణువుల వాయు కాలుష్యం తగ్గించడానికి మధ్యస్థ/భారీ-స్థాయి వాయు శుద్ధి ఉపకరణాలుగా 2 స్మాగ్‌ టవర్ల ఏర్పాటు.
  5. ‘వినియోగంలోగల డీజిల్ జనరేటర్ సెట్‌ల (డిజి సెట్‌లు) కోసం ఉద్గారాల కొలతపై ప్రయోగాత్మక ప్రాజెక్ట్. అలాగే ఉద్గారాల తగ్గింపు కోసం శుద్ధి, పరిష్కారాల తర్వాత ఎగ్జాస్ట్‌ తిరిగి అమర్చడంలోని సామర్థ్యంపై అంచనా వేయడం.
  6. ‘వినియోగంలోగల గుర్తించిన వాహన కేటగిరీలలో ఉద్గార నియంత్రణ పరికరాలను అమర్చడం, పాత/ఉపయోగంలోగల వాహనాల ఉద్గార తగ్గింపు దిశగా సిఫారసుల కోసం (బిఎస్‌-III)' ప్రయోగాత్మక ప్రాజెక్ట్
  • VII. గాలి నాణ్యత పారామితుల ప్రత్యక్ష సుదూర పర్యవేక్షణ కోసం స్వదేశీ ఫోటోనిక్ సిస్టమ్ అభివృద్ధికి డిఎస్‌టి పరిధిలో పరిశోధన-అభివృద్ధి ప్రాజెక్ట్.
  1. డిఎస్‌టి నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ (ఎన్‌ఎం-ఐసిపిఎస్‌), ‘ఎలక్ట్రిక్ వెహికల్ (ఇవి) ఆధారిత స్వయంప్రతిపత్తిగల వాహనాల అభివృద్ధి’పై స్వతంత్ర నావిగేషన్ ఫౌండేషన్‌పై టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్. ‘ఇవి’ల స్వయంప్రతిపత్త సాంకేతికతకు డ్రైవింగ్ పద్ధతుల గరిష్టీకరణ, ట్రాఫిక్ రద్దీ తగ్గింపు ద్వారా హరిత వాయు ఉద్గారాలను తగ్గించగల సామర్థ్యం ఉంది.

   లోక్‌సభలో ఇవాళ ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వనీకుమార్‌ చౌబే ఈ సమాచారం వెల్లడించారు.

*****


(Release ID: 1946552) Visitor Counter : 128


Read this release in: English , Urdu , Hindi