పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ కర్బన బడ్జెట్
Posted On:
07 AUG 2023 4:02PM by PIB Hyderabad
భారతదేశంసహా దక్షిణాసియా మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో 24 శాతంగా ఉన్నప్పటికీ 1850-2019 మధ్య చారిత్రక సంచిత నికర మానవజన్య ఉద్గారాలు కేవలం 4 శాతం మాత్రమే. వాతావరణ మార్పుపై అంతరప్రభుత్వం బృందం (ఐపిసిసి)[2022] ఆరో అంచనాల నివేదిక (ఎఆర్6) రూపకల్పన కోసం కార్యాచరణ బృందం-III సమర్పించిన విధాన రూపకర్తల సారాంశం (ఎస్‌పిఎం) ఈ మేరకు స్పష్టంగా పేర్కొంది. కాగా, ‘ఐపిసిసి’ పరిధిలోని ‘ఎఆర్6’ నివేదిక రూపకల్పన కో్సం కార్యాచరణ బృందం-I సమర్పించిన పత్రంలో ఉపయోగించిన ‘కర్బన బడ్జెట్’ అనే పదం అనేక విధాలుగా వాడకంలో ఉంది.
భూ తాపాన్ని నిర్దిష్ట స్థాయికి పరిమితం చేస్తూ మానవ కార్యకలాపాల ద్వారా విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ (సిఒ2) నికర ఉద్గారాలను సూచించడం కోసం ఈ పదాన్ని తరచూ వాడుతున్నారు. ఈ కోణంలో చూస్తే భారత ప్రస్తుత వార్షిక తలసరి ఉద్గారాలు దేశ ప్రగతి అవసరాలు-ఆకాంక్షలకు తగిన నిష్పత్తిలో పెరుగుతాయి. అంటే- సార్వత్రికమే అయినా, విభిన్న బాధ్యతలు-సంబంధిత సామర్థ్యాల సూత్రం (సిబిడిఆర్-ఆర్‌సి)తోపాటు జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి.
కాగా, భారత ప్రభుత్వం అనేక ‘ఐపిసిసి’ సమావేశాలు-చర్చాగోష్ఠులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తన ప్రతినిధి బృందాన్ని ప్రతిపాదిస్తుంది. ఈ నేపథ్యంలో 2023 జూలై 24-28 తేదీల మధ్య కెన్యాలోని నైరోబీలో నిర్వహించిన ‘ఐపిసిసి’ 59వ సదస్సుకు భారత ప్రభుత్వం తన ప్రతినిధి బృందాన్ని పంపింది.
లోక్‌సభలో ఇవాళ ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వనీకుమార్ చౌబే ఈ సమాచారం వెల్లడించారు.
*****
(Release ID: 1946550)