చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వ‌ర్చువ‌ల్ కోర్టుల పురోగ‌తి

Posted On: 04 AUG 2023 3:59PM by PIB Hyderabad

 న్యాయ స్థానంలో క‌క్షిదారు లేదా న్యాయ‌వాది ఉనికిని తొల‌గించ‌డానికి, వ‌ర్చువ‌ల్ ప్లాట్‌ఫార‌మ్‌లో (దృశ్య‌మాధ్య‌మ వేదిక‌) కేసుల ప‌రిష్కారం కోసం ఉద్దేశించిన భావ‌న వ‌ర్చువ‌ల్ కోర్టులు. న్యాయ‌స్థాన వ‌న‌రుల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఉప‌యోగించుకోవ‌డానికి, చిన్న‌పాటి వివాదాల‌ను ప‌రిష్క‌రించ‌డానికి న్యాయ‌వాదుల‌కు స‌మ‌ర్ధ‌వంత‌మైన మార్గాన్ని అందించేందుకు ఈ భావ‌న‌ను అభివృద్ధి చేశారు. వ‌ర్చువ‌ల్ కోర్టును న్యాయమూర్తి వ‌ర్చువ‌ల్ ఎల‌క్ట్రానిక్ ప్లాట్‌ఫార‌మ్ ద్వారా నిర్వ‌హించ‌వ‌చ్చు. దీని అధికార ప‌రిధి రాష్ట్రవ్యాప్తంగా ఉండ‌ట‌మే కాక 24X7 ఇది ప‌ని చేస్తుంది. ప్ర‌స్తుతం వ‌ర్చువ‌ల్ కోర్టుల‌ను ట్రాఫిక్ చ‌లాన్‌కు సంబంధించిన కేసుల‌ను మాత్ర‌మే నిర్వ‌హిస్తున్నాయి. ఇది లిటిగేష‌న్ ఖ‌ర్చుల‌ను త‌గ్గించ‌డ‌మే కాక ట్రాఫిక్ చ‌లాన్ కేసుల‌ ప‌రిహార ప్ర‌క్రియను స‌ర‌ళీకృతం చేసింది. దాదాపు 3.26 కోట్ల కేసులు (3,26,14,617)ను 22 వ‌ర్చువ‌ల్ కోర్టుల ద్వారా నిర్వ‌హించ‌గా, 39 ల‌క్ష‌ల (39,16,405)కు పైగా కేసుల‌లో, రూ. 419.89 కోట్లకు పైగా ఆన్‌లైన్ జ‌రిమానాను 30.06.2023వ‌ర‌కు వ‌సూలు చేశారు. జ‌భార‌త‌దేశ వ్యాప్తంగా వ‌ర్చువ‌ల్ కోర్టుల ద్వారా ప‌రిష్క‌రించిన కేసుల వివ‌రాల‌ను అనెక్చ‌ర్‌-1లో జోడించ‌డం జ‌రిగింది. 30.06.2023 నాటికి 18 రాష్ట్రాలు /  కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో, అంటే ఢిల్లీ (2) హ‌ర్యానా, గుజ‌జ‌రాత్‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ (2), మ‌హ‌రాష్ట్ర (2), అస్సాం, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, జ‌మ్ము & కాశ్మీర్ (2), ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌, ఒడిషా, మేఘాల‌య‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, మ‌ధ్య ప్ర‌దేశ్‌, త్రిపుర‌, ప‌శ్చిమ బెంగాల్‌, రాజ‌స్థాన్‌ల‌లో 22 అటువంటి కోర్టులు ఉన్నాయి. 
న్యాయ సంస్క‌ర‌ణ‌ల‌పై కార్యాచ‌ర‌ణ ప‌రిశోధ‌న & అధ్య‌య‌నాల ప‌థ‌కం కింద విభాగం కాలానుగుణంగా అర్హ‌త క‌లిగిన సంస్థ‌ల నుంచి న్యాయ బ‌ట్వాడా, న్యాయ సంస్క‌ర‌ణ‌ల క్షేత్రంలో వివిధ అంశాల‌పై ప‌రిశోధ‌న ప‌త్రాల‌ను ఆహ్వానిస్తుంది. ఇటీవ‌ల భార‌తీయ న్యాయ బ‌ట్వాడా వ్య‌వ‌స్థ కింద వ‌ర్చువ‌ల్ కోర్టుల విస్త‌ర‌ణకు సంబంధించి ప‌రిధిని అన్వేసించ‌డం పై ప్ర‌తిపాద‌న‌ల‌ను ఆహ్వానించారు. కార్యాచ‌ర‌ణ ప‌రిశోధ‌న‌ల కింద అన్ని ప్ర‌తిపాద‌న‌ల‌ను నిర్దేశించిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం మూల్యంక‌నం చేయ‌డ‌మే కాక పేర్కొన్న ప‌థ‌కం కోసం రూపొందించిన ప్రాద‌జెక్టు మంజూరు క‌మిటీ ఆమోదానికి లోబ‌డి ఉంటాయి.  
వ‌ర్చువ‌ల్ కోర్టుల స్థాప‌న అనేది న్యాయ‌వ్య‌వ‌స్థ ప‌రిధిలోకి, ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌రిధిలోకి ఖ‌చ్చితంగా వ‌స్తుంది. ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వానికి ప్ర‌త్య‌క్ష పాత్ర ఉండ‌దు. 

 

***




(Release ID: 1945975) Visitor Counter : 111


Read this release in: English , Urdu , Marathi