ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

సరసమైన మానసిక ఆరోగ్య సేవలపై అప్డేట్


738 జిల్లాల్లో జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం

మెంటల్ హెల్త్ స్పెషాలిటీస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిపార్ట్‌మెంట్లలో మరింతమంది విద్యార్థులను చేర్చుకోవడానికి 25 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మంజూరు చేయబడ్డాయి.

Posted On: 04 AUG 2023 3:20PM by PIB Hyderabad

దేశంలో సరసమైన మరియు అందుబాటులో ఉండేలా మానసిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించడం కోసం భారత ప్రభుత్వం దేశంలో జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని (నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్)ను అమలు చేస్తోంది. జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని (నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్)లో భాగంగా జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని (డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్)  738 జిల్లాల్లో అమలు కోసం మంజూరు చేయబడింది.  దీని కోసం జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు అవసరమైన సహకారం అందించబడుతుంది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) మరియు ప్రైమరీ హెల్త్ సెంటర్ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) స్థాయిలలో  జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం కింద అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఔట్ పేషెంట్ సేవలు, మూల్యాంకనం, కౌన్సెలింగ్/ మానసిక -సామాజిక జోక్యాలు, తీవ్రమైన మానసిక రుగ్మతలు, మందులు, ఔట్ రీచ్ సేవలు ఉన్న వ్యక్తులకు నిరంతర సంరక్షణ,  అంబులెన్స్ మొదలైన  సేవలు అందుబాటులో ఉన్నాయి. పైన పేర్కొన్న సేవలకు అదనంగా జిల్లా స్థాయిలో 10 పడకల ఇన్-పేషెంట్ సౌకర్యం ఉంది. జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం యొక్క తృతీయ సంరక్షణ భాగం కింద..  మానసిక ఆరోగ్య స్పెషాలిటీలలో పోస్ట్ గ్రాడ్యేయేషన్ విభాగాలలో విద్యార్థుల చేరికను పెంచడానికి అలాగే తృతీయ స్థాయి చికిత్స సౌకర్యాలను అందించడానికి 25 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు మంజూరు చేయబడ్డాయి. ఇంకా, మెంటల్ హెల్త్ స్పెషాలిటీలలో 47పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిపార్ట్‌మెంట్లను బలోపేతం చేయడానికి ప్రభుత్వం 19 ప్రభుత్వ వైద్య కళాశాలలు/సంస్థలకు కూడా సహకారం అందించింది. 22 ఎయిమ్స్‌కు మానసిక ఆరోగ్య సేవలు కూడా అందించబడ్డాయి. ఈ సేవలు ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద కూడా అందుబాటులో ఉన్నాయి.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, బెంగళూరు, లోకోప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, తేజ్‌పూర్, అస్సాం మరియు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ, రాంచీ.. ఈ మూడు  కేంద్రాలలో స్థాపించబడిన డిజిటల్ అకాడమీల ద్వారా 2018 నుండి  వివిధ వర్గాల జనరల్ హెల్త్‌కేర్ మెడికల్ మరియు పారా మెడికల్ నిపుణులకు ఆన్‌లైన్ శిక్షణా కోర్సులను అందిస్తున్నారు. దీని ద్వారా దేశంలోని వెనుకబడిన ప్రాంతాలలో మానసిక ఆరోగ్య సేవలను అందించడానికి ప్రభుత్వం మానవ వనరుల లభ్యతను కూడా పెంపొందిస్తోంది.

పైన పేర్కొన్న వాటికి అదనంగా, ఆయుష్మాన్ భారత్ - హెచ్డబ్ల్యూసీ పథకం కింద సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవల ప్యాకేజీలో మానసిక ఆరోగ్య సేవలు జోడించబడ్డాయి. ఆరోగ్యం మరియు ఆరోగ్య కేంద్రాలలో (హెల్త్వెల్ నెస్ సెంటర్స్) మానసిక, నాడీ సంబంధిత మరియు మత్తుమందుల వినియోగ రుగ్మతల (ఎంఎన్ఎస్)పై కార్యాచరణ మార్గదర్శకాలు ఆయుష్మాన్ భారత్ పరిధిలో విడుదల చేయబడ్డాయి.

పైన పేర్కొన్న వాటితో పాటు, దేశంలో నాణ్యమైన మానసిక ఆరోగ్య సలహాలు మరియు సంరక్షణ సేవలకు ప్రాప్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం 10 అక్టోబర్ 2022న “నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్”ను ప్రారంభించింది. 18.07.2023 నాటికి, 31 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 42 టెలి మానస్ సెల్‌లను ఏర్పాటు చేశాయి. అంతేకాకుండా  టెలి మెంటల్ హెల్త్ సర్వీస్‌లను కూడా  ప్రారంభించారు. హెల్ప్‌లైన్ నంబర్‌ ద్వారా 1,94,000 కంటే ఎక్కువ కాల్‌లు నిర్వహించబడ్డాయి.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***



(Release ID: 1945969) Visitor Counter : 76


Read this release in: English , Urdu , Hindi