నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ మారిటైమ్ వారసత్వ భవనం కోసం సహకారం

Posted On: 04 AUG 2023 3:56PM by PIB Hyderabad

భారతదేశం యొక్క ఘనమైన మరియు వైవిధ్యమైన సముద్ర వారసత్వాన్ని ప్రదర్శించడానికి, ఓడరేవులు, నౌక మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ అహ్మదాబాద్ సమీపంలోని లోథాల్ వద్ద నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్ హెచ్ ఎమ్ సి)ని అభివృద్ధి చేయాలని భావించింది. ఎన్ హెచ్ ఎమ్ సి పద్నాలుగు గ్యాలరీలను కలిగి ఉంటుంది, ఇందులో హరప్పా కాలం నుండి నేటి వరకు భారతదేశం యొక్క సముద్ర వారసత్వాన్ని ప్రదర్శించే నావికా గ్యాలరీ ఉంటుంది. భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క వైవిధ్య సముద్ర వారసత్వాన్ని ప్రదర్శించే తీర రాష్ట్రాల పెవిలియన్లు కూడా ఈ సముదాయంలో కనిపిస్తాయి. ఎన్ హెచ్ ఎమ్ సి అభివృద్ధికి సాంస్కృతిక సహకారం కోసం పోర్చుగల్ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశానికి సముద్ర సంబంధాల చరిత్ర ఉన్న అనేక ఇతర దేశాలతో కూడా ఇలాంటి అవగాహన ఒప్పందాలు ప్రతిపాదించబడ్డాయి. ఫేజ్ I ఎ కి సంబంధించి ఇప్పటి వరకు 35% నిర్మాణం పూర్తయింది.

 

ఎన్ హెచ్ ఎమ్ సి వద్ద భారతదేశం యొక్క సముద్ర వారసత్వంపై అవగాహన పెంచడానికి విద్యా మరియు వినోదాత్మక  రూపంలోదృశ్య ప్రదర్శన కోసం అత్యాధునికసాంకేతికతను ఉపయోగించడానికి ప్రాముఖ్యత ఇస్తారు.  లీనమయ్యే ప్రదర్శన, రివీలింగ్ స్పేస్‌లు మరియు ఇంటరాక్టివ్ టెక్నాలజీ ద్వారా భారతదేశ భవిష్యత్ సముద్ర ప్రగతి పథం పై సందర్శకులకు స్ఫూర్తి నిస్తుంది. ఈ కాంప్లెక్స్ ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని పెంచుతుందని మరియు ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

 

కేంద్ర ఓడరేవులు, నౌక మరియు జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

 

*****


(Release ID: 1945963)
Read this release in: English , Urdu