నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఓడరేవులు

Posted On: 04 AUG 2023 3:57PM by PIB Hyderabad

సాగర్‌మాల అనేది ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ యొక్క ఒక ప్రధాన కార్యక్రమం. భారతదేశం యొక్క 7,500 కి.మీ పొడవైన తీరప్రాంతాన్ని మరియు 14,500 కి.మీ. ప్రయాణానికి ఉపయోగపడే జలమార్గాలను ఉపయోగించడం ద్వారా దేశంలో ఓడరేవు ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించటం దీని లక్ష్యం. సాగరమాల కార్యక్రమంలో భాగంగా, దాదాపు 5.54 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 800 కంటే ఎక్కువ ప్రాజెక్టులు అమలు కోసం గుర్తించబడ్డాయి. ఈ ప్రాజెక్టులు సాగరమాల యొక్క ఐదు స్తంభాలుగా వర్గీకరించబడ్డాయి. సాగరమాల కింద ప్రాజెక్ట్‌ల అమలును కేంద్ర లైన్ మినిస్ట్రీస్, రాష్ట్ర మెరిటైమ్ బోర్డులు, భారీ పోర్ట్‌లు మరియు ఎస్‌పివి ద్వారా సాధ్యమైన చోట పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) ద్వారా నిర్వహించాలి. ఓడరేవులు మరియు నౌకాశ్రయాల అభివృద్ధి సాగరమాల కార్యక్రమం యొక్క పోర్ట్ ఆధునీకరణ లో భాగం. సాగరమాల ప్రోగ్రాం యొక్క పోర్ట్ ఆధునీకరణ స్తంభం యొక్క వివరాలు రాష్ట్రాల వారీగా జతచేయబడ్డాయి.

 

 

 

 
       

Sr No

State

No. of Projects

Project Cost (Rs. Cr)

1

Andaman & Nicobar Islands

6

6089

2

Andhra Pradesh

29

35795

3

Daman & Diu  

2

92

4

Goa

7

1141

5

Gujarat

36

40540

6

Karnataka

18

5129

7

Kerala

16

11299

8

Maharashtra

31

89042

9

Odisha

16

11752

10

Puducherry

3

509

11

Tamil Nadu

42

48342

12

West Bengal

32

5219

కేంద్ర ఓడరేవులు, నౌక మరియు జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(Release ID: 1945962)
Read this release in: English , Urdu