రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ప్రత్యామ్నాయ ఎరువులను ప్రోత్సహించేందుకు చేపట్టిన చర్యలు
Posted On:
04 AUG 2023 3:28PM by PIB Hyderabad
వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి, సేంద్రియ ఎరువులు & జీవ ఎరువులను కలిపి వినియోగించడాన్ని భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. భూసార పరీక్ష ఆధారిత సిఫార్సుల ఆధారంగా వీటిని సమతుల్య స్థాయిలో వినియోగించేలా ప్రోత్సహిస్తోంది. పరంపరగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై), నమామి గంగే, భారతీయ ప్రకృతిక్ కృషి పథతి (బీపీకేపీ), మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్-ఈస్ట్ రీజియన్ (ఎంవోవీసీడీఎన్‌ఈఆర్), నేషనల్ ప్రాజెక్ట్ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్ (ఎన్‌పీవోఎఫ్) వంటి సేంద్రియ పథకాల కింద, సేంద్రియ, జీవ ఎరువుల వాడకం కోసం రైతులకు సాయం అందుతోంది. నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అవగాహన కల్పన & శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం, ఈ ఏడాది జూన్ 28న జరిగిన సమావేశంలో, “పీఎం ప్రోగ్రామ్ ఫర్ రెస్టోరేషన్, అవేర్‌నెస్ జనరేషన్, నరిష్‌మెంట్ అండ్ అమెలియోరేషన్ (పీఎం-ప్రణామ్)”ను ఆమోదించింది. ఎరువులను స్థిరంగా, సమతుల్యంగా వినియోగించేలా ప్రోత్సహించడం, ప్రత్యామ్నాయ ఎరువులను ఉపయోగించడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, వనరుల పరిరక్షణ సాంకేతికతలను అమలు ద్వారా భూమాత ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్రాలు/యూటీలు చేపట్టిన ప్రజా ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ పథకం కింద, రసాయన ఎరువుల వినియోగాన్ని (యూరియా, డీఏపీ, ఎన్‌పీకే, ఎంవోపీ) గత మూడేళ్ల సగటుతో పోలిస్తే, ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో 50% ఎరువుల సబ్సిడీని ఆదా చేసిన రాష్ట్రం/యూటీ గ్రాంట్ పొందడానికి అర్హత సాధిస్తుంది.
ఈ ఏడాది జూన్ 28వ తేదీన జరిగిన సమావేశంలో, సీసీఈఏ, ఉత్పత్తి కేంద్రాల్లో పేడతో అభివృద్ధి చేసిన సేంద్రియ ఎరువులను ప్రోత్సహించడానికి మార్కెట్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ (ఎండీఏ) రూ.1500/ఎంటీ చొప్పున ఆమోదించింది. గోబర్ధన్ కార్యక్రమం కింద వివిధ బయోగ్యాస్/సీబీజీ మద్దతున్న పథకాలు/సంబంధిత మంత్రిత్వ శాఖలు/విభాగాల కార్యక్రమలు, ఎంవోపీఎన్‌జీ తీసుకొచ్చిన 'సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫర్డబుల్ ట్రాన్స్‌పోర్టేషన్' (సతత్) పథకం, ఎంఎన్‌ఆర్‌ఈకి చెందిన 'వేస్ట్ టు ఎనర్జీ' కార్యక్రమం, డీడీడబ్ల్యూఎస్ స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ) పథకాల ద్వారా ఈ సాయం అందుతుంది. ఇందుకోసం మొత్తం రూ.1451.84 కోట్లను (ఎఫ్‌వై 2023-24 నుంచి 2025-26 వరకు) కేటాయించింది, పరిశోధన నిధుల కోసం రూ.360 కోట్ల కార్పస్ ఇందులో కలిసి ఉంది.
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబా ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ విషయాన్ని తెలిపారు.
******
(Release ID: 1945955)
Visitor Counter : 156