వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రస్తుత సీజన్‌లో ఒక్క పంట వ్యర్థం కూడా దహనం చేయకుండా కృషి చేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం: శ్రీ నరేంద్ర సింగ్ తోమర్


వాయు కాలుష్యమే కాదు, నేర సారాన్ని, దిగుబడిని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తూ వ్యవసాయ భూములపైనా దుష్ప్రభావం చూపుతుంది: శ్రీ తోమర్

'పంట వ్యర్థాల దహనం నిర్వహణ' అంశాలపై మంత్రిత్వ శాఖల సమావేశం

Posted On: 04 AUG 2023 11:38AM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయం & రైతు సంక్షేమ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్‌ అధ్యక్షతన నిన్న ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రస్తుత సీజన్‌లో పంట వ్యర్థాలు దహనం చేయకుండా చేసే విషయంలో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, దిల్లీ ఎన్‌సీటీ చేస్తున్న ప్రయత్నాలను ఆ సమావేశంలో సమీక్షించారు.

 

యూపీ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సూర్య ప్రతాప్ షాహి, పంజాబ్ వ్యవసాయ మంత్రి శ్రీ గుర్మీత్ సింగ్ ఖుడియాన్, హరియాణా వ్యవసాయ మంత్రి శ్రీ జై ప్రకాష్ దలాల్, దిల్లీ ఎన్‌సీటీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ గోపాల్ రాయ్‌తో పాటు, కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ప్రస్తుత సీజన్‌లో పంట వ్యర్థాలను కాల్చకుండా నిరోధించేందుకు తమ కార్యాచరణ ప్రణాళిక, వ్యూహాలను రాష్ట్రాలు సమర్పించాయి. పంట వ్యర్థాల నిర్వహణ కోసం అందించిన నిధులను సమర్థంగా వినియోగించుకోవాలని, పంటలు పూర్తి కాకముందే ముందే పంట వ్యర్థాల నిర్వహణ (సీఎంఆర్‌) యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని కేంద్ర మంత్రులు రాష్ట్రాలకు సూచించారు. పంట వ్యర్థాలను తగులబెట్టకుండా రైతుల్లో అవగాహన పెంచడానికి ఇక్రా సహా సంబంధింత వర్గాల వాటాదారుల సహకారంతో సమాచారం, విద్య, ప్రసారాల (IEC) కార్యకలాపాలు చేపట్టాలని చెప్పారు.

వరి పంట వ్యర్థాలను దహనం చేయకుండా గత ఐదేళ్లుగా చేస్తున్న కృషి సత్ఫలితాలు ఇస్తోందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి చెప్పారు. 'కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్' వంటి సంస్థల సమష్టి ప్రయత్నాల వల్ల పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, దిల్లీ ఎన్‌సీటీ రాష్ట్రాల్లో మంటలు తగ్గాయన్నారు. విద్యుత్‌, బయోమాస్ వంటి పరిశ్రమలకు ముడి పదార్థాలుగా వరి గడ్డి వ్యర్థాలను అందించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

వరి వ్యర్థాల దహనం సమస్యను పరిష్కరించడంలో కృషి చేసిన అందరికీ కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అభినందనలు తెలిపారు. అందరి కృషి వల్ల, వరి కంకులను తగులబెట్టే సంఘటనలు కాలక్రమేణా తగ్గుముఖం పట్టాయని చెప్పారు. వరి పంట వ్యర్థాలను కాల్చడం కేవలం దిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యానికి సంబంధించినది అంశం మాత్రమే కాదన్నారు. అది నేల సారాన్ని, దిగుబడిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తూ, వ్యవసాయ భూమిపై హానికర ప్రభావాన్ని చూపుతుందని మంత్రి వివరించారు. అందువల్ల, తమ ప్రయత్నాలు దిల్లీలో వాయు కాలుష్యంపై పోరాటంతో పాటు నేల సారాన్ని రక్షించడం ద్వారా రైతుల ప్రయోజనాలను పరిరక్షించేలా కూడా ఉండాలని మంత్రి సూచించారు.

 

ప్రస్తుత సీజన్‌లో ఒక్క పంట వ్యర్థం కూడా దహనం చేయకుండా కృషి చేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. భారత ప్రభుత్వం నాలుగు రాష్ట్రాలకు సీఆర్‌ఎం పథకం కింద తగినన్ని నిధులు అందిస్తోంది. ఆయా రాష్ట్రాలు సకాలంలో రైతులకు యంత్రాలను అందించడం ద్వారా వాటి వినియోగం సరైన సమయంలో జరిగేలా చూసుకోవాలి. యంత్రాల సక్రమ వినియోగం, వ్యర్థాలు నేలలోనే కుళ్లిపోయేలా చూసేందుకు రాష్ట్ర స్థాయిలో సరైన పర్యవేక్షణ అవసరం. ఎక్స్-సిటు నిర్వహణ ద్వారా వరి గడ్డి వ్యర్థాలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించేలా చూడాలి. పంట వ్యర్థాలను తగులబెట్టకుండా వివిధ స్థాయుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 'అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ' (ఆత్మ) వంటి సంస్థలు తమ పూర్తి సామర్థ్యంతో పని చేయాలి.

*****



(Release ID: 1945794) Visitor Counter : 144