సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav g20-india-2023

ప్రతిపాదిత మహారాష్ట్ర గ్లోబల్ మెడ్ టెక్ జోన్ విషయమై చర్చలు జరిపిన శ్రీ నారాయణ్ రాణే


- ఇండియా హెల్త్ డైలాగ్ (ఐ.హెచ్.డి) చొరవ విషయమై కూడా మంత్రి చర్చలు

Posted On: 03 AUG 2023 2:14PM by PIB Hyderabad

ఇండియా ఛాంబర్ ఆఫ్ బిజినెస్ అండ్ కామర్స్ (ఇండియా ఛాంబర్) 2023 ఆగస్టు 2న న్యూఢిల్లీలోని ఉద్యోగ్ భవన్‌లో ప్రపంచ స్థాయి హెల్త్‌కేర్ ఇండస్ట్రీ లీడర్‌లతో కేంద్ర ఎం.ఎస్.ఎం.ఈ. శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ (ఎం.ఎస్.ఎం.ఈ) ఐ.సి.ఎం.ఆర్ మరియు ఐఎంఏ భాగస్వామ్యంతో ఈ సమావేశాన్ని నిర్వహించింది. త్వరలో జరుగనున్న ఇండియా హెల్త్ డైలాగ్ సమ్మిట్ (ఐ.హెచ్.డి) మరియు ప్రతిపాదిత- ప్రపంచ స్థాయి మహారాష్ట్ర గ్లోబల్ మెడికల్ డివైస్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్.. మహారాష్ట్ర గ్లోబల్ మెడ్ టెక్ జోన్ (ఎం.జీ.ఎం.టి.జెడ్) గురించి ఈ రౌండ్ టేబుల్‌ సమావేశంలో చర్చించారు. ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన పరిశ్రమ వర్గాలను ఉద్దేశించి శ్రీ నారాయణ్ రాణే మాట్లాడుతూ ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రిత్వ శాఖ భారతదేశాన్ని వైద్య పరికరాలకు కొత్త కేంద్రంగాను మరియు ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆత్మ నిర్భర్‌గా మార్చడానికి బలమైన తయారీ సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి సారిస్తోందని అన్నారు. ప్రతిపాదిత .జీ.ఎం.టి.జెడ్ కి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతిపాదిత పార్కులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ నాయకులను ఆహ్వానించారు. డిజిటల్ మరియు స్మార్ట్ హెల్త్‌కేర్ డెలివరీ, టెక్ ఎనేబుల్డ్ మరియు ఇన్నోవేషన్ ఆధారిత హై-క్వాలిటీ మాన్యుఫ్యాక్చరింగ్, వైవిధ్యభరితమైన ఆరోగ్య సంరక్షణ పరికరాలు, మెడికల్ డివైజ్‌లపై ఫ్యూచర్ హెల్త్‌కేర్ ఆధారపడి ఉంటుందని రౌండ్ టేబుల్‌లో ఇండస్ట్రీ సభ్యులను ఉద్దేశించి ఇండియా ఛాంబర్ ప్రెసిడెంట్ మరియు సీఈఓ నితిన్ పంగోత్రా అన్నారు. వైద్య పరికరాలు, సహాయక సాంకేతికతలు, డయాగ్నోస్టిక్స్, డ్రగ్ పార్కులు మొదలైనవి మరియు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో కొత్త ఆవిష్కరణలు మరియు సాంకేతికతలను ఉపయోగించాల్సి ఉంటుందని అన్నారు. ఆరోగ్య రంగంలో భారత్‌ను ఆత్మనిర్భర్‌గా మార్చేందుకు భారతీయ ఆరోగ్య సంరక్షణ తయారీ మరియు సేవల రంగంలో పెట్టుబడి అవకాశాలు, ప్రపంచ సహకారాలు, ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహించడం కోసం నవంబర్‌లో రాబోయే ఐ.హెచ్.డి సమావేశం జరగనుంది. ఎంజీఎంటీజెడ్ అనేది ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో భారతదేశ ఆరోగ్య చర్చల వేదిక యొక్క చొరవలో భాగం, ఎంజీఎంటీజెడ్ అనేది ఒకే చోట సాధారణ సౌకర్యాలతో పాటు (టెస్టింగ్, క్యూఏ/క్యూసీ, స్టెరిలైజేషన్, ప్యాకేజింగ్, అడ్వాన్స్‌డ్ వేర్‌హౌసింగ్, మొదలైనవి) మేటి భవనం, మెడ్‌టెక్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి ప్రతిపాదించబడింది. భారతదేశం నేతృత్వంలోని గ్లోబల్ సప్లై చైన్ నెట్‌వర్క్‌లను నిర్మించడానికి వైద్య పరికరాల విభాగంలో తయారీ సామర్థ్యాలను పెంపొందించడానికి ఎగుమతి ప్రమోషన్‌ల కోసం ప్రపంచ ప్రమాణాలను నిర్ధారిస్తూ అడ్వాన్స్ తయారీ సామర్థ్యాల పెంపు నిమిత్తం దీనిని ప్రతిపాదించడమైంది.

******



(Release ID: 1945596) Visitor Counter : 90


Read this release in: English , Urdu , Marathi , Hindi