ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పరిశ్రమ; పరిశోధన, విద్యారంగాలకు చెందిన వ్యక్తుల నుంచి నేషనల్ మెటలర్జీస్ట్ అవార్డులు-2023 కోసం దరఖాస్తులు ఆహ్వానించిన ఉక్కు మంత్రిత్వ శాఖ

Posted On: 02 AUG 2023 12:41PM by PIB Hyderabad

మెటలర్జికల్  విభాగంలో కార్యకలాపాలు; పరిశోధన, అభివృద్ధి, వ్యర్థాల నిర్వహణ, ఇంధన పరిరక్షణకు చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నేషల్  మెటలర్జిస్ట్  అవార్డులు అందిస్తుంది.  మెటలర్జిస్ట్  అవార్డులు (ఎన్ఎంఏ)-2023కి పరిశ్రమ; పరిశోధన, అభివృద్ధి రంగాలకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది.

నేషనల్  మెటలర్జిస్ట్  అవార్డుల పథకం లక్ష్యం

ఆత్మనిర్భర్ భారత్ పథకం లక్ష్యాలకు అనుగుణంగా ఇనుము, ఉక్కు  రంగంలో తయారీ, పరిశోధన, డిజైన్, విద్య, వ్యర్థాల నిర్వహణ, ఇంధన పరిరక్షణ విభాగాల్లో వ్యక్తిగతంగా చేసిన విశేషమైన సేవలను ఎన్ఎంఏ స్కీమ్ గుర్తిస్తుంది.

ఈ దిగువ విభాగాల్లో అవార్డులు అందిస్తారు.

1.      జీవితకాల సాఫల్య అవార్డు

2.     నేషనల్  మెటలర్జిస్ట్  అవార్డు

3.     యంగ్ మెటలర్జిస్ట్ అవార్డు

a.     పర్యావరణం

b.     మెటల్  సైన్స్

4.     ఇనుము, ఉక్కు రంగంలో పరిశోధన, అభివృద్ధి అవార్డు

నామినేషన్ల విధానం  

https://awards.steel.gov.in  వెబ్  పోర్టల్  ద్వారా 07/08/2023 నుంచి ఆన్  లైన్ లో మాత్రమే దరఖాస్తులు  స్వీకరిస్తారు. దరఖాస్తుల గడువు 06/09/2023 సాయంత్రం 5 గంటలు.

నేషనల్  మెటలర్జిస్ట్  అవార్డ్  అర్హత ప్రమాణాలు; నిబంధనలు, షరతులకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా పైన సూచించిన వెబ్  సైట్  లింక్  లో ఉన్నాయి.    

మెటలర్జీ విభాగంలో పరిశ్రమ, ఆర్&డి, విద్య విభాగాల్లో విశేష కృషికి గుర్తింపుగా భారత జాతీయులకు మాత్రమే అవార్డులు అందించేందుకు ఈ  పథకం ప్రారంభించారు. 01/01/2023 నాటికి అభ్యర్థుల అర్హతలను పరిగణనలోకి తీసుకుంటారు.

 

***


(Release ID: 1945315) Visitor Counter : 117