వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గిరిజన గ్రామాల్లో చిరుధాన్యాల లభ్యత

నాడు పోస్టు చేయడమైనది: 01 AUG 2023 5:33PM by PIB Hyderabad

శ్రీ అన్న (చిరుధాన్యాలు) ఉత్పత్తి, ఉత్పాదకత పెంపునకు వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ ఆహార భద్రతా పథకం (ఎన్ఎఫ్ఎస్ఎం) కింద పోషక విలువలు గల చిరుధాన్యాల పెంపకం కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. 28 రాష్ర్టాలు, జమ్ము & కశ్మీర్, లదాఖ్  కేంద్రపాలిత ప్రాంతాల్లోను ఈ కార్యక్రమం అమలుపరుస్తోంది. దీని కింద రైతులకు రాష్ర్టప్రభుత్వాలు,  కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల ద్వారా పంటల ఉత్పత్తి, సంరక్షణ టెక్నాలజీలు; ప్రదర్శనల ఆధారిత పంట విధానాలపై ప్రోత్సాహకాలు అందించడంతో  పాటు కొత్తగా విడుదలైన వంగడాలు/హైబ్రిడ్ రకాలకు చెందిన సర్టిఫైడ్  విత్తనాలు, సమీకృత పోషకాలు, కీటకనాశని నిర్వహణ టెక్నిక్  లు;  మెరుగైన వ్యవసాయ ఉపకరణాలు/పనిముట్లు/వనరుల పరిరక్షణ యంత్రాలు;  నీటి పొదుపు డివైస్  లు అందిస్తారు. పంటల సీజన్  లో రైతుల సామర్థ్యాల నిర్మాణంతో పాటు కార్యక్రమాలు/వర్క్ షాప్ లు నిర్వహిస్తూ విత్తనాల మినీకిట్లు పంపిణీ చేస్తున్నారు. ప్రింట్, ఎలక్ర్టానిక్  మీడియా ద్వారా ప్రచారం సైతం చేస్తున్నారు. శ్రీ అన్న కోసం రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్  పిఓ), సెంటర్స్  ఆఫ్  ఎక్సలెన్స్  (సిఓఇ), శ్రీ అన్న సీడ్ హబ్  లు కూడా ఎన్ఎఫ్ఎస్ఎం కింద ఏర్పాటు చేస్తున్నారు. దీనికి తోడు అస్సాం, బిహార్, చత్తీస్  గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, ఒడిశా, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలు శ్రీ అన్న ప్రోత్సాహానికి రాష్ర్టాల స్థాయిలో మిలెట్  మిషన్లు నిర్వహిస్తున్నాయి. దేశాన్ని ‘‘శ్రీ అన్న’’ ప్రపంచ హబ్  గా తీర్చి దిద్దేందుకు హైదరాబాద్  కు చెందిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్  ఆఫ్ మిలెట్  రీసెర్చ్ (ఐఐఎంఆర్) కేంద్రాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అత్యుత్తమ విధానాలు,  పరిశోధన ఫలితాలు, టెక్నాలజీలను అందరికీ అందించడం కోసం సెంటర్  ఆఫ్ ఎక్సలెన్స్  గా ప్రకటించారు. ఎన్ఎఫ్ఎస్ఎం-న్యూట్రి సిరీల్స్ కార్యక్రమం కింద రాష్ర్టప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు 2021-22 నుంచి 2023-24 సంవత్సరాల మధ్య కాలంలో కేంద్ర వాటాగా చేసిన నిధుల కేటాయింపు, విడుదల వివరాలు అనుబంధంలో ఉన్నాయి.

మహిళా, శిశుసంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహణలోని పోషణ్  అభియాన్  లో శ్రీ అన్నను చేర్చారు.  లక్షిత ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ (టిపిడిఎస్), సమీకృత శిశు అభివృద్ధి పథకం (ఐసిడిఎస్), మధ్యాహ్న భోజన పథకాల కింద శ్రీ అన్న సేకరణకు సవరించిన మార్గదర్శకాలను ఆహారం, ప్రభుత్వ పంపిణీ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. శ్రీ అన్న సేకరణ పెంచాలని మంత్రిత్వ శాఖ రాష్ర్టప్రభుత్వాలు,  కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అంతర్జాతీయ మార్కెట్లలో శ్రీ అన్న ప్రోత్సాహం, మార్కెటింగ్, అభివృద్ధికి, దేశం నుంచి శ్రీ అన్న ఎగుమతుల వృద్ధి చర్యలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఎగుమతి ప్రోత్సహక ఫోరమ్  ను ఏర్పాటు చేసింది.  సరైనది తినండి అనే ప్రచారం కింద ఆరోగ్యవంతమైన, భిన్నమైన ఆహారం కోసం ప్రత్యేకంగా భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థను (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఏర్పాటు చేశారు.

2022-23 నుంచి 2026-27 సంవత్సరాల మధ్య కాలంలో రూ.800 కోట్ల పెట్టుబడితో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఓఎఫ్  పిఐ)  చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల ఫుడ్ ప్రాసెసింగ్  పరిశ్రమ కోసం (పిఎల్ఐఎస్ఎంబిపి) ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పథకం అమలుపరుస్తోంది. అలాగు 35 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో (యుటి) ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ (పిఎంఎఫ్ఎంఇ) పథకం అమలుపరుస్తోంది. శ్రీ అన్న కింద ప్రాథమిక ప్రాసెసింగ్  యూనిట్లు ఏర్పాటు చేయడానికి తీసుకునే రూ.2 కోట్ల వరకు రుణాలపై  రైతులు/ఎఫ్ పిఓలు/ఎంటర్  ప్రెన్యూర్లకు వడ్డీ రాయితీ ప్రయోజనం అందించేందుకు ప్రవేశపెట్టిన అగ్రి ఇన్ ఫ్రాస్ర్టక్చర్ ఫండ్ పథకాన్ని ప్రభుత్వం ప్రాచుర్యంలోకి తెస్తోంది. శ్రీ అన్నకు డిమాండును  పెంచడానికి ప్రభుత్వం శ్రీ అన్న ఆధారిత స్టార్టప్  లను ప్రోత్సహిస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ఒడిఒపి) పథకం కింద శ్రీ అన్న, అనుబంధ ఉత్పత్తులను ప్రోత్సహించడం కోసం 10 రాష్ర్టాలకు చెందిన 19 జిల్లాలను గుర్తించారు.

అనుబంధం

ఎన్ఎఫ్ఎస్ఎం-న్యూట్రి సిరీల్స్ పథకం కోసం 2021-22 నుంచి 2023-24 సంవత్సరాల కింద నిధుల కేటాయింపు, విడుదల (కేంద్ర వాటా) వివరాలు ఈ దిగువ పట్టికలో చూడవచ్చు.

 

క్రమ సంఖ్య

రాష్ర్టం / యుటి

2021-22

2022-23

2023-24*

 

 

కేటాయింపు

విడుదల

కేటాయింపు

విడుదల

కేటాయింపు

విడుదల

1

ఆంధ్రప్రదేశ్

5.800

1.450

8.700

-

9.063

-

2.

అరుణాచల్  ప్రదేశ్

0.999

0.250

1.500

0.380

1.642

0.410

3

అస్సాం

0.998

-

1.500

1.130

2.040

0.510

4

బిహార్

-

-

-

-

1.730

0.430

5

చత్తీస్ గఢ్

2.300

-

3.310

2.100

2.538

-

6

గోవా

-

-

-

-

0.073

-

7

గుజరాత్

3.040

0.760

7.470

5.600

12.688

-

8

హర్యానా

10.760

2.690

16.140

4.035

14.500

-

9

హిమాచలప్రదేశ్

0.840

0.410

0.965

0.370

1.450

-

10

జమ్ము, కశ్మీర్

0.410

0.100

0.615

0.154

0.725

-

11

జార్ఖండ్

-

-

-

-

0.725

-

12

కర్ణాటక

43.030

29.320

60.430

45.326

73.225

18.310

13

కేరళ

-

-

-

-

0.181

-

14

లదాఖ్

-

-

0.360

-

0.363

-

15

మధ్యప్రదేశ్

11.190

2.800

17.385

4.350

19.970

4.990

16

మహారాష్ర్ట

41.290

13.360

61.935

30.967

88.080

22.010

17

మణిపూర్

0.999

0.250

1.500

-

1.631

-

18

మేఘాలయ

0.999

0.034

1.500

0.370

1.631

-

19

మిజోరం

0.999

0.250

1.500

-

1.631

-

20

నాగాలాండ్

0.999

0.250

1.500

0.750

1.631

-

21

ఒడిశా

3.440

2.247

5.160

1.290

5.438

-

22

పంజాబ్

-

-

-

-

0.181

-

23

రాజస్తాన్

32.420

8.104

49.040

24.420

72.500

-

24

సిక్కిం

0.998

0.250

1.500

0.750

1.631

 

25

తమిళనాడు

8.120

5.876

25.920

19.440

18.125

4.530

26

తెలంగాణ

1.998

-

3.000

-

3.625

-

27

త్రిపుర

1.000

0.629

1.480

0.370

1.631

0.410

28

ఉత్తరప్రదేశ్

20.630

5.160

30.960

15.48

34.438

-

29

ఉత్తరాఖండ్

3.340

0.835

4.990

3.746

5.438

-

30

పశ్చిమబెంగాల్

0.190

0.050

0.310

0.220

0.330

0.080

మొత్తం

196.789

75.075

308.670

161.248

378.852

51.680

(27.07.2023 నాటికి)

కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి లోక్  సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందచేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 1945313) సందర్శకుల సూచీ సంఖ్య : : 125
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu