సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యాంత్రిక పారిశుద్ధ్య వ్యవస్థ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక

Posted On: 02 AUG 2023 4:43PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా మురుగు, మరుగుదొడ్ల శుభ్రత కార్మికులను గుర్తించి, వారికి తగిన రక్షణ పరికరాలు, మురుగు & మరుగుదొడ్లను శుభ్రపరిచే యాంత్ర పనిముట్లను అందించడానికి ప్రభుత్వం 'నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్' (నమస్తే) అనే కొత్త పథకాన్ని రూపొందించింది.

ఎస్‌ఆర్‌ఎంఎస్‌ కింద, 641 సఫాయి కర్మచారీల ద్వారా, 286 పారిశుద్ధ్య సంబంధిత పరికరాలు/ప్రాజెక్టుల కోసం రూ.22.93 కోట్ల మూలధన రాయితీ భారత ప్రభుత్వం విడుదల చేయబడింది.

30.06.2023 నాటికి, స్వచ్ఛత ఉద్యమి యోజన (SUY) కింద 2,509 మంది లబ్ధిదారులకు యాంత్రిక శుభ్రత పరికరాలు/వాహనాల కొనుగోలు కోసం 'నేషనల్ సఫాయి కర్మచారీస్‌ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్' (ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ) రూ. 86.84 కోట్ల రుణాలను విడుదల చేసింది. రాష్ట్ర స్థాయి సంస్థలకు ఈ రుణాలను మంజూరు చేసింది.

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ రాందాస్ అథవాలే ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

*****


(Release ID: 1945286)
Read this release in: Urdu , English