మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
14500 'పీఎం శ్రీ' పాఠశాలలు ఆదర్శ పాఠశాలలుగా ఉద్బవిస్తాయి, ఇతర పాఠశాలలకు నాయకత్వం వహిస్తాయి
Posted On:
02 AUG 2023 4:37PM by PIB Hyderabad
'ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా' (పీఎం శ్రీ) పేరుతో కొత్త కేంద్ర ప్రాయోజిత పథకానికి 7 సెప్టెంబర్ 2022న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జాతీయ విద్య విధానం (ఎన్‌ఈపీ) 2020 అమలు కోసం, నిర్దిష్ట కాలంలో ఆదర్శవంతమైన పాఠశాలలుగా ఉద్బవించడానికి, పరిసరాల్లోని ఇతర పాఠశాలలకు నాయకత్వం వహించడానికి ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది.
కేంద్ర/రాష్ట్ర/యూటీ ప్రభుత్వం/స్థానిక సంస్థల ఆధ్వర్యంలో ఇప్పటికే నడుస్తున్న పాఠశాలల్లో కొన్నింటిని బలోపేతం చేయడం ద్వారా దేశవ్యాప్తంగా 14500కు పైగా పీఎం శ్రీ పాఠశాలలను ఏర్పాటు చేయాలని ఈ పథకంలో నిబంధన ఉంది. పీఎం శ్రీ పాఠశాలల మొదటి దశలో, కేపీఎస్/ఎన్‌వీఎస్‌లతో పాటు 27 రాష్ట్రాలు/యూటీల నుంచి మొత్తం 6,207 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటి ద్వారా 35 లక్షలకు పైగా విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు.
కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీమతి అన్నపూర్ణ దేవి ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం అందించారు.
*****
(Release ID: 1945282)
Visitor Counter : 173