రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జాతీయ రహదారులపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు
నాడు పోస్టు చేయడమైనది:
02 AUG 2023 4:04PM by PIB Hyderabad
ప్రభుత్వానికి అందుతున్న సమాచారం ప్రకారం ,రోడ్డు ప్రమాదాలు పలు కారణాలతో జరుగుతున్నాయి. పరిమితికి మించిన వేగంతో వెళ్ళడం, వాహనాలు నడిపే సమయంలో మొబైల్ ఫోన్లు వాడడం, మద్యం సేవించి వాహనాలు నడపడం,
మాదక ద్రవ్యాల వినియోగం, నడపకూడని వైపు నడపడం, రోడ్డుపై చూపిన లైనును పాటిస్తూ నడపకపోవడం, ఎర్రరంగులైటు వేసి ఉన్నప్పటికీ సిగ్నల్ వద్ద ఆగకుండా వెళ్లడం, వాహనాలు నడిపేసమయంలో పాటించవలసిన భద్రతా పరికరాలు, హెల్మెట్లు, సీటు బెల్టులు, వాడకపోవడం,
వాతావరణ పరిస్థితులు సక్రమంగా లేకపోవడం, డ్రైవర్ తప్పిదాలు, సైకిల్పై వెళ్లేవారు, పాదచారులు ఇలా రకరాల కారణాల వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి పోలీసు శాఖకు అందిన సమాచారం ప్రకారం, 2019–2021 కాలెండర్ సంవత్సరాల మధ్య జాతీయ రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు,మరణాల సంఖ్య కింద పేర్కొన్న టేబుల్ లో ఇవ్వడం జరిగింది.
|
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన
|
ప్రమాదాల సంఖ్య
|
మరణాల సంఖ్య
|
|
2019
|
2020
|
2021
|
2019
|
2020
|
2021
|
|
మితిమీరిన వేగం
|
98294
|
85616
|
95785
|
36566
|
32873
|
40450
|
|
మద్యం సేవించడం, మాదక ద్రవ్యాలు సేవించడం
|
5122
|
3416
|
2949
|
2376
|
1862
|
1352
|
|
సరైనవైపు ప్రయాణించకపోవడం, లైను క్రమశిక్షణ పాటించకపోవడం
|
7076
|
6050
|
5568
|
2726
|
3099
|
2823
|
|
రెడ్ లైట్ వేసినా వాహనాలు ఆపకపోవడం
|
984
|
919
|
555
|
266
|
476
|
222
|
|
మొబైల్వాడడం
|
3660
|
2697
|
1997
|
1585
|
1389
|
1040
|
|
ఇతరాలు
|
22055
|
16753
|
21971
|
10353
|
7971
|
10120
|
మోటారు వాహనాల చట్టం 1988 లో ప్రమాదకర డ్రైవింగ్కు పాల్పడిన వారికి జరిమానాలు విధించడానికి నిబంధనలు ఉన్నాయి. మోటారు వాహనాల సవరణ చట్టం 2019 కింద దీనిని చాలా వరకు సవరించి,కొత్త నేరాలకు పెనాల్టీలను ప్రవేశపెట్టారు. ఇప్పటికే నిర్దేశించిన నేరాలకు పెనాల్టీలు పెంచారు.
ఈ సమాచారాన్ని కేంద్ర రోడ్డురవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరి ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు..
***
(రిలీజ్ ఐడి: 1945280)
సందర్శకుల సూచీ సంఖ్య : : 92