రైల్వే మంత్రిత్వ శాఖ

ర‌ద్దు చేసిన టిక్కెట్ల‌కు రిఫండ్‌

Posted On: 02 AUG 2023 5:04PM by PIB Hyderabad

భార‌తీయ రైల్వేల‌లో రైళ్ళ‌లో ఏడాది పొడ‌వునా ఆక్యుపెన్సీ స‌ర‌ళి ఏక‌రీతిగా ఉండ‌దు. అది పీక్‌, లీన్ (పెళ్ళిళ్ళు, సెల‌వుల‌కాలం, అవి లేని కాలం) భిన్నంగా ఉంటుంది. అత్యంత ర‌ష్ ఉన్న కాలాల‌లో ముఖ్యంగా ప్రాచుర్యం ఉన్న మార్గాల‌లో రైళ్ళ‌లో ఆక్యుపెన్సీ పూర్తిగా భ‌ర్తీ అయి ఉంటుంది, కానీ లీన్ కాలంలోను, అంత ప్రాచుర్యం లేని మార్గాల‌లో అభిల‌షణీయ వినియోగం క‌న్నా త‌క్కువ ఉంటోంది. ధృవీక‌రించిన రిజ‌ర్వేష‌న్‌ ర‌ద్దుకు వ్య‌తిరేకంగా రిజ‌ర్వ్ చేసిన వ‌స‌తిని చూసుకోవ‌డానికి, రిజ‌ర్వేష‌న్లు అయిపోయాయ‌ని బుకింగ్ క్ల‌ర్క్‌లు చెప్ప‌డంతో ప్ర‌యాణీకులు తిరిగివెళ్ళిపోయే అవ‌కాశాన్ని నివారించ‌డం కోసం, రైల్వేలు డిమాండ్ స‌ర‌ళిని అంచ‌నా వేసేందుకు తోడ్ప‌డ‌డం కోసం వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు జారీ చేస్తారు. భార‌తీయ రైల్వేల‌లో న‌డుస్తున్న రైళ్ళ‌కు సంబంధించిన వెయిటింగ్ లిస్ట్ ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూ, అద‌న‌పు డిమాండ్‌ను నెర‌వేర్చేందుకు న‌డుస్తున్న రైళ్ళ‌లో బోగీల‌ను పెంచ‌డం, ప్ర‌త్యేక రైళ్ళ‌ను న‌డ‌ప‌డం, కొత్త రైళ్ళ‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం, న‌డిచే రైళ్ళ త‌ర‌చుద‌నాన్ని పెంచ‌డం త‌దిత‌రాల‌ను కార్యాచ‌ర‌ణ సాధ్య‌త‌కు లోబ‌డి చేస్తారు. 
మొద‌టి రిజ‌ర్వేష‌న్ చార్ట్‌ల త‌యారీ స‌మ‌యంలో వెయింటింగ్ లిస్ట్ స్థితిలో ఉన్న ప్ర‌యాణీకుల టికెట్ల‌ను యాంత్రికంగా ర‌ద్దు చేసి, ఆటో రీఫండ్‌ను ప్రారంభించింది, సూచించిన బ్యాంకులో మ‌రురోజు జ‌మ చేస్తారు. 
ఒక‌వేళ డ‌బ్బు డెబిట్ అయ్యి టికెట్ బుక్ కాక‌పోతే, భార‌తీయ రైల్వే కేట‌రింగ్ & టూరిజం కార్పొరేష‌న్ (ఐఆర్‌సిటిసి) మ‌రురోజు యాంత్రిక రీఫండ్ ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తుంది.  రీఫండ్ మొత్తాన్ని సొమ్ము అందుకున్న‌ పేమెంట్ గేట్‌వే /  బ్యాంకు కు జ‌మ చేస్తారు. సాధార‌ణంగా, దిగువ‌న పేర్కొన్న ప‌ద్ధ‌తిలో జ‌రిగిన  చెల్లింపుల ప‌ద్ధ‌తిలో రీఫెండ్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయ‌డానికి స‌మ‌యం తీసుకుంటుంది -
నెట్ బ్యాంకింగ్ /  వాలెట్‌/  క్యాష్ కార్డ్ లావాదేవీల‌కు 3-4 వ్యాపార దినాలు.
క్రెడిట్ కార్డ్ /  డెబిట్ కార్డ్ లావాదేవీకి 6-7 వ్యాపార దినాలు
ప్ర‌యాణీకులు మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉన్న బుక్ నౌ పే లేట‌ర్ ప్ర‌త్యామ్నాయాన్ని, చెల్లింపు ఎంపిక‌గా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఇఎంఐ ఎంపిక‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.
 రైళ్ళ‌కు అద‌న‌పు కోచ్ /  కోచ్‌ల‌ను జోడించ‌డం ద్వారా లేదా రైలు సర్వీస్ సెకెండ్ క్లాస్ కోచ్‌లను కేటాయించ‌డం ద్వారా పోలీసు, పారామిల‌ట‌రీ, సాయుధ బ‌ల‌గాలకు వారు చెల్లుబాటు అయ్యే ప్ర‌యాణ ప్ర‌మాణాల‌ను క‌లిగి ఉంటే సాధ్య‌త‌ను బ‌ట్టి త్వ‌రిత‌గ‌తిన క్లియ‌రెన్స్‌ని నిర్ధారించాలని ఈ విష‌య‌మై ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న సూచ‌న‌లను అన్ని జోన‌ల్ రైల్వేల‌కు పున‌రుద్ఘ‌టించ‌డం జ‌రిగింది.
ఈ స‌మాచారాన్ని రైల్వేలు, క‌మ్యూనికేష‌న్లు, ఎల‌క్ట్రానిక్ & ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణ‌వ్ బుధ‌వారం లోక్‌స‌భకు లిఖిత‌పూర్వ‌కంగా ఇచ్చిన జ‌వాబులో పేర్కొన్నారు. 

 

***
 



(Release ID: 1945271) Visitor Counter : 107


Read this release in: English , Urdu , Tamil