పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
స్వమిత్వ పథకం
Posted On:
02 AUG 2023 3:26PM by PIB Hyderabad
స్వమిత్వ (ఎస్‌విఎఎంఐటివిఎ) పథకం 2020-21లో అమలు చేయడం కోసం పైలెట్ దశను 24 ఏప్రిల్ 2020లో ప్రారంభించడం జరిగింది. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా 24 ఏప్రిల్ 2021న ప్రారంభించారు. స్వమిత్వ పథకాన్ని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర రెవిన్యూ విభాగం, రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం, సర్వే ఆఫ్ ఇండియా (ఎస్ఒఐ) భాగస్వామ్యంతో అమలు చేస్తున్నారు. ఈ పథకం అమలుకు రాష్ట్రాలు ఎస్ఒఐతో అవగాహనా పత్రంపై (ఎంఒయు) సంతకాలు చేయవలసి ఉంటుంది. ఇంతవరకూ 31 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు (యుటిలు) ఎస్ఒఐతో అవగాహనా పత్రంపై సంతకాలు చేశాయి.
26.07.2023 నాటికి స్వమిత్వ పథకం కంద డ్రోన్ లను దేశంలో 2,70,924 గ్రామాలపై పరిశీలన కోసం ఎగురవేయడం జరిగింది.
సర్వే ఆఫ్ ఇండియా ద్వారా స్వమిత్వ పథకం కింద రూపొందించిన మ్యాప్‌ల ఆధారంగా ఆస్తి కార్డులను తయారు చేసి, పంచడం అన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. కాగా, స్వమిత్వ కింద ఉత్పత్తి చేసిన ఆస్తికార్డులను డిజిలాకర్ ప్లాట్‌ఫార్మ్‌తో సమన్వయం చేయడానికి రాష్ట్రాలు/ యుటిలతో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ పని చేస్తోంది. 26.07. 2023 నాటికి 89,749 గ్రామాలలో ఆస్తి కార్డులను తయారు చేయడం జరిగింది.
స్వమిత్వ పథకం కింద రూపొందించిన మ్యాప్‌లు గ్రామీణ ప్రజలు ఉన్న ప్రాంతాలలోని ఆస్తుల డిజిటల్ ఇమేజ్‌లను సంగ్రహించిన జియో- రిఫరెన్స్‌డ్ (భూ ఉల్లేఖన) మ్యాప్‌లు. ఇందుకు అదనంగా,పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇ- పంచాయత్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ (ఎంఎంపి) ఎంయాక్షన్ సాఫ్ట్ (mActionSoft ) అనే మొబైల్ ఆధారిత పరిష్కారాన్ని ప్రారంభించింది. ఇది ఆస్తిలను ఉత్పత్తి చేయగల పనుల కోసం జియోట్యాగ్‌లతో (అంటే జిపిఎస్ కోఆర్డినేట్‌లు) ఫోటోలను తీసేందుకు తోడ్పడుతుంది. ఆస్తుల జియో- ట్యాగింగ్‌ను అన్ని మూడు దశలలో చేస్తారు (1) పని ప్రారంభం అయ్యే ముందు (2) పని జరుగుతున్న సందర్భంలో (3) పని పూర్తి అయిన తర్వాత చేస్తారు. ఇది సహజ వనరుల నిర్వహణ, నీటి అన్ని పనులు, జల సేకరణ, కరువు నివారణ, పారిశుద్ధ్యం, వ్యవసాయం, చెక్ డ్యామ్‌లు, నీటిపారుదల కాలువలు తదితరాల పనులు, ఆస్తులకు సంబంధించిన సమాచార కోశాగారాన్ని అందిస్తుంది. 15వ విత్త కమిషన్ నిధుల కింద సృష్టించిన ఆస్తులన్నింటికీ జియో- ట్యాగింగ్‌ను తప్పనిసరి చేశారు. అన్ని పంచాయతీ రాజ్ సంస్థలను ఎంయాక్షన్ సాఫ్ట్ అప్లికేషన్ పరిధిలోకి తెచ్చారు.
ఈ సమాచారాన్ని కేంద్ర పంచాయతీరాజ్ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ బుధవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1945270)
Visitor Counter : 182