నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అనేక ముఖ్యమైన చర్యలు తీసుకుంది

Posted On: 02 AUG 2023 3:50PM by PIB Hyderabad

సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) తగినంత ఆర్థిక సౌలభ్యం మరియు ఇబ్బందులు లేని రుణాన్ని అందించడానికి  కొనసాగుతున్న పథకాలతో సహా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. వీటిలో కొన్ని:

 ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ).  ఇది స్వయం ఉపాధిని సృష్టించేందుకు ఉద్దేశించిన ప్రధాన రుణ సంబంధిత రాయితీ(క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ) కార్యక్రమం;
 క్రెడిట్ డెలివరీ వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్ఈలు) రంగానికి రుణ ప్రవాహాన్ని సులభతరం చేయడానికి పూచీకత్తులేని మరియు థర్డ్ పార్టీ గ్యారెంటీ యొక్క అవాంతరాలు లేకుండా గరిష్టంగా రూ. 5 కోట్లను క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కింద అందజేస్తారు.


సెల్ఫ్ రిలయన్ట్ ఇండియా (ఎస్ఆర్ఐ) ఫండ్ ద్వారారూ. 50,000 కోట్ల ఈక్విటీ ఇన్ఫ్యూషన్;

ప్రాధాన్యతా రంగ రుణాల కింద ప్రయోజనాలను పొందడం కోసం  సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు యొక్క అధికారిక పరిధిలోకి అనధికారిక మైక్రో ఎంటర్‌ప్రైజెస్ (ఐఎంఈ)లను తీసుకురావడానికి 11.01.2023న ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించడం; రిటైల్ మరియు హోల్‌సేల్ వ్యాపారులను సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లో  చేర్చడం, ప్రాధాన్యత రంగ రుణ ప్రయోజనాలను పొందడం కోసం, మరియు సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకుల హోదాలో పైకి మారిన పక్షంలో పన్నుయేతర ప్రయోజనాలు 3 సంవత్సరాల పాటు పొడిగించబడతాయి.
మంత్రిత్వ శాఖ యొక్క ఉద్యమ్ పోర్టల్‌లో అనేకమంది మహిళా పారిశ్రామికవేత్తలు సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకులను కలిగి ఉన్నారు. మొత్తం సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు రిజిస్ట్రేషన్‌లో, 19% సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకులు మహిళల యాజమాన్యంలో ఉన్నాయి. ఇంకా, క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (సీజీటీఎంఎస్ఈ) మరియు సెల్ఫ్ రిలయన్ట్ ఇండియా (ఎస్ఆర్ఐ) ఫండ్స్ కింద మహిళా పారిశ్రామికవేత్తల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:


క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్: భారత ప్రభుత్వంలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు మంత్రిత్వ శాఖ  క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (సీజీటీఎంఎస్ఈ) ద్వారా సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల కోసం క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని అమలు చేస్తోంది.  దీని కోసం పరిమితి మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ రూ. 500 లక్షలు ( 01.04.2023) మహిళలకు రుణాల కోసం 85% వరకు గ్యారెంటీ కవరేజీతో, సాధారణ రేటు 75%కి వ్యతిరేకంగా. ప్రారంభించినప్పటి నుండి, 30.06.2023 నాటికి, మొత్తం 72.59 లక్షల హామీలు రూ. 4.50 లక్షల కోట్లు ఆమోదించారు. ఇందులో రూ.65,209 కోట్ల 15.10 లక్షల గ్యారెంటీలను మహిళా యాజమాన్యంలోని ఎంఎస్‌ఈలకు వర్తింపజేయబడ్డాయి.
 

సెల్ఫ్ రిలయన్ట్ ఇండియా (ఎస్ఆర్ఐ) ఫండ్: భారత ప్రభుత్వం రూ. 50,000 కోట్లు సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)లో ఈక్విటీ ఫండింగ్‌గా ప్రకటించింది. ఈ పథకం కింద మొత్తం ఫండ్ పరిమాణం రూ. 50,000 కోట్లకు భారత ప్రభుత్వం నుండి రూ.10,000 కోట్లు మరియు ప్రైవేట్ ఈక్విటీ/వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ద్వారా రూ.40,000 కోట్లు ఉన్నాయి. ఈ చొరవ సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల రంగంలోని అర్హత కలిగిన యూనిట్లకు వృద్ధి మూలధనాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 30.06.2023 నాటికి, మరియు ప్రారంభం నుండి, మొత్తం 45 డాటర్ ఫండ్‌లు ఎన్వీసీఎఫ్ఎల్ (మదర్ ఫండ్)తో ఎంప్యానెల్ చేయబడ్డాయి. అంతేకాకుండా రూ. 4,885 కోట్లు కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా 342 సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు అర్థిక సాయం అందించబడింది. వీటిలో 60  మహిళల యాజమాన్యంలో ఉన్నాయి.
ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని ఇతర పథకాలు/కార్యక్రమాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం యొక్క ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) 08.04.2015న ప్రారంభించబడింది.  వ్యక్తులకు వారి వ్యాపార కార్యకలాపాలను ఏర్పాటు చేసుకోవడానికి లేదా విస్తరించేందుకు వీలుగా వారికి రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలను అందించడానికి 08.04.2015న ప్రధాన్ మంత్రి ముద్రా యోజన ప్రారంభించబడింది. ఈ పథకం శిశు (రూ. 50,000/- వరకు), కిషోర్ (రూ. 50,000/- పైన మరియు రూ. 5 లక్షల వరకు) మరియు తరుణ్ (రూ. 5 లక్షలకు పైగా మరియు రూ. 10 లక్షల వరకు) అనే మూడు విభాగాలలో రుణాలను అందిస్తుంది.  తయారీ, వర్తకం, సేవా రంగాలలో ఆదాయాన్ని పెంచే కార్యకలాపాలకు మరియు వ్యవసాయ అనుబంధిత కార్యకలాపాలకు కూడా ప్రధాన్ మంత్రి ముద్రా యోజన కింద రుణాలు అందజేస్తారు.  మెంబర్ లెండింగ్ సంస్థలు (ఎంఎల్ఐలు), అంటే బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీసీఎఫ్లు), మైక్రో ఫైనాన్స్ సంస్థలు (ఎంఎఫ్ఐలు) మరియు ఇతర ఆర్థిక మధ్యవర్తుల ద్వారా ప్రధాన్ మంత్రి  ముద్రా యోజన రుణాలు అందించబడతాయి. పూచీకత్తు లేని ఉచిత కవరేజీని విస్తరించడానికి, నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (ఎన్సీజీటీసీ) నుండి మైక్రో యూనిట్ల కోసం పూర్తిగా భారత ప్రభుత్వ యాజమాన్యంలో క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ (సీజీఎఫ్ఎంయూ) ఏర్పాటు చేయబడింది.
30.06.2023 నాటికి మరియు ప్రారంభం నుండి 42.20 కోట్లకు పైగా రూ. 24.34 లక్షల కోట్ల రుణాలు  పంపిణీ చేశారు. ఇందులో మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.10.96 లక్షల కోట్ల రుణాలు 29.00 కోట్లకు పైగా పంపిణీ చేయబడ్డాయి.

 
 
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క స్టాండ్-అప్ ఇండియా స్కీమ్ (ఎస్యూపీఐ) 05.04.2016న ప్రారంభించబడింది. కనీసం ఒక షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) లేదా షెడ్యూల్డ్ తెగ (ఎస్సీ) మరియు ఒక మహిళా రుణగ్రహీతకు రూ.10 లక్షల నుండి రూ. 1 కోట్ల మధ్య విలువైన రుణాలను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల (ఎస్సీబీ) నుండి  సులభతరం చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం.  తయారీ, సేవలు లేదా వ్యాపార రంగంలో గ్రీన్ ఫీల్డ్ ఎంటర్‌ప్రైజ్‌ను ఏర్పాటు చేయడానికి మరియు వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న కార్యకలాపాల కోసం బ్యాంక్ శాఖ ఈ రుణాలను అందజేస్తుంది.

స్టాండ్-అప్ ఇండియా స్కీమ్, నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (ఎన్సీజీటీసీ) నుండి స్టాండ్-అప్ ఇండియా కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ స్కీమ్ (సీజీఎఫ్ఎస్ఐ) ద్వారా ఎటువంటి పూచీకత్తు భద్రత లేనప్పుడు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇది పూర్తిగా భారత ప్రభుత్వ కంపెనీ. అంతేకాకుండా  రూ43,000 కోట్లతో  1.90 లక్షల గ్రీన్‌ఫీల్డ్ సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలు ఎస్యూపీఐ రుణంతో ఏర్పాటయయ్యాయి. 30.06.2023 నాటికి 1.60 లక్షలకు పైగామహిళా పారిశ్రామికవేత్తలకు రూ.  36,000 కోట్లకుపైగా రుణాలు మంజూరు చేయబడ్డాయి.
ఈ సమాచారాన్ని స్కిల్ డెవలప్ మెంట్ మరియు ఎంటర్ ప్రెన్యూర్షిప్ శాఖల సహాయ మంత్రి  శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***



(Release ID: 1945269) Visitor Counter : 99


Read this release in: English , Urdu , Hindi