సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'సహారా-సెబి నిధి' నుంచి పెట్టుబడిదార్లకు చెల్లింపులు

Posted On: 02 AUG 2023 4:30PM by PIB Hyderabad

'సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్' ఎదుట 2019 నవంబర్ నుంచి 2020 డిసెంబర్ వరకు జరిగిన విచారణల సందర్భంగా, సహారా గ్రూపునకు చెందిన 4 సంస్థలు సహారా క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, లక్నో; సహారాయన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్, భోపాల్; హమారా ఇండియా క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, కోల్‌కతా; స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, హైదరాబాద్‌ సమర్పించిన నివేదికల ప్రకారం, ఆంబీ వ్యాలీ లిమిటెడ్‌లో రూ.62,643 కోట్ల పెట్టుబడి పెట్టారు. మరో రూ.2,253 కోట్లు సహారా క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నుంచి తీసుకుని సెబీ వద్ద జమ చేశారు.

గౌరవనీయ సుప్రీంకోర్టు 29.03.2023 నాడు జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం:

i. మొత్తం రూ.24,979.67 కోట్లు "సహారా-సెబి రిఫండ్ ఖాతా"లో ఉన్నాయి, రూ.5000 కోట్లు 'సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్'కు బదిలీ చేయడం జరిగింది. సహారా గ్రూపు కోపరేటివ్ సొసైటీల పెట్టుబడిదార్ల చట్టబద్ధమైన బకాయిల చెల్లింపు కోసం ఆ డబ్బును ఉపయోగిస్తారు. అసలైన డిపాజిట్‌దార్లకు అత్యంత పారదర్శక పద్ధతిలో & సరైన గుర్తింపును చూసి చెల్లించడం జరుగుతుంది. ఆ డబ్బును నేరుగా వారి సంబంధిత బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

  1. ఈ చెల్లింపును విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి పర్యవేక్షిస్తారు. అమికస్ క్యూరీగా నియమితులైన న్యాయవాది శ్రీ గౌరవ్ అగర్వాల్, సహారా గ్రూపు సహకార సంఘాల నిజమైన పెట్టుబడిదార్లకు బకాయిల మొత్తాన్ని పంపిణీ చేయడంలో జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డికి, 'సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్'కు సాయం చేస్తారు. చెల్లింపుల విధివిధానాలను ఖరారు చేయడానికి 'సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్', జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డితో పాటు న్యాయవాది శ్రీ గౌరవ్ అగర్వాల్‌ను సంప్రదిస్తుంది.
  1. సహారా గ్రూపు సహకార సంఘాల నిజమైన పెట్టుబడిదార్లకు పైన పేర్కొన్న మొత్తం రూ.5,000 కోట్ల నుంచి వీలైనంత త్వరగా చెల్లింపులు చేయలని మేం నిర్దేశించాం, నేటి నుంచి తొమ్మిది నెలల తర్వాత చెల్లింపులు చేయమనలేదు. చెల్లింపుల తర్వాత మిగిలిన మొత్తం తిరిగి "సహారా-సెబి రిఫండ్ ఖాతా"కు బదిలీ అవుతుంది.

పై ఆదేశానికి అనుగుణంగా, సహారా-సెబి రిఫండ్ ఖాతా నుంచి 'సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్'కు రూ.5000 కోట్లు బదిలీ అయ్యాయి. సహారా గ్రూపునకు చెందిన నాలుగు సహకార సంఘాల నిజమైన పెట్టుబడిదార్లు తమ దరఖాస్తులను సమర్పించడానికి “సహారా-CRCS రిఫండ్ పోర్టల్”ను రూపొందించారు. ఈ పోర్టల్ 18.07.2023న ప్రారంభమైంది. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ https://cooperation.gov.inhttps://mocrefund.crcs.gov.in ద్వారా ఆ పోర్టల్‌ను వినియోగించుకోవచ్చు.

సహకార సంఘాల నిజమైన పెట్టుబడిదార్లు పోర్టల్‌లోకి లాగిన్ అయి, ఆన్‌లైన్ దరఖాస్తును & అవసరమైన రుజువు పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా చేసిన దరఖాస్తులను మాత్రమే పరిశీలనకు తీసుకుంటారు. నిధుల లభ్యతకు లోబడి, ఆన్‌లైన్ దరఖాస్తు చేసిన 45 రోజుల లోపు, నిజమైన పెట్టుబడిదార్లకు వారి ఆధార్-అనుసంధానిత బ్యాంక్ ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని వారికి ఎస్‌ఎంఎస్‌/పోర్టల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. 

కేంద్ర సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం అందించారు.

 

*****


(Release ID: 1945224) Visitor Counter : 207


Read this release in: Urdu , English , Marathi