హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పౌర కేంద్రిత పోలీసు సేవలకు వెబ్‌ పోర్టల్‌

प्रविष्टि तिथि: 02 AUG 2023 4:28PM by PIB Hyderabad

కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిపాలనా పరిధిలోని  నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌.సి.ఆర్‌.బి), 2017 ఆగస్టు 21న  డిజిటల్‌ పోలీసు పోర్టల్‌........ను పఆరంభించింది. ఇందులో కేంద్ర స్థాయిలో కింది పౌర సేవలు అందుబాటులో ఉంటాయి.
అవి
1. కనిపించకుండా పోయిన వ్యక్తుల కోసం గాలింపు
2. వాహనాలకు ఎన్‌.ఒ.సి
3 నేరస్థులుగా ప్రకటించబడిన వారి సమాచారం.
4. సమీప పోలీసుస్టేషన్‌ సమాచారం
దీనికి తోడు, రాష్ట్రాల పోలీసు సిటిజన్‌ పోర్టళ్లు, 9 తప్పనిసరి పౌర సేవలను డిజిటల్‌ పోలీస్‌ పోర్టల్‌ ద్వారా అందిస్తాయి.
అవి,
1. సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుల దాఖలు
2. ఫిర్యాదుల స్థాయిని తెలుసుకోవడం
3. ఎఫ్‌.ఐ.ఆర్‌ కాపీ పొందడం
4. అరెస్టయిన వ్యక్తులు, వివిధ కేసులలో పోలీసులు వెతుకుతున్న నేరస్థులు
5.కనిపించకుండా పోయిన, కిడ్నాప్‌ అయిన వారి వివరాలు
6. దొంగతనానికి గురైన, స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఆయుధాలు, ఇతర ఆస్తులు
7. వివిధ ఎన్‌.ఒ.సిలకు దరఖాస్తులు, అనుమతులు( ప్రదర్శనలు. ఈవెంట్‌లు, నిరసనలు, సమ్మెలు,)
8.పనివారు, ఉద్యోగులు, పాస్‌పోర్టు, సీనియర్‌ సిటిజన్‌ రిజిస్ట్రేషన్లకు సంబంధించి వెరిఫికేషన్‌ అభ్యర్థనలు
9. వివిధ నమూనాలా ఫారాలను డౌన్‌లోడ్‌ చేసుకునే ఏర్పాటు

కంద్ర హోంమంత్రిత్వశాఖ నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్‌.సి.ఆర్‌.పి)....ని 2019 ఆగస్టు 30న తీసుకువచ్చింది. ఇందులో పౌరులు అన్ని రకాల సైబర్‌ నేరాలను ఫిర్యాదు చేయవచ్చు. మహిళలు, పిల్లలపై జరిగే సైబర్‌ నేరాలను కూడా ఇందులో నమోదు చేయవచ్చు.  ఈ పౌర ఆధారిత సేవలను దేశవ్యాప్తంగా పైన పేర్కొన్న పోర్టళ్ల ద్వారా అందుకోవచ్చు. అధీకృత చట్ట అమలు సంస్థలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నేరాలు, నేర గణాంకాలను , సమాచారాన్ని భద్రమైన నెట్‌వర్క్‌ద్వారా తెలుసుకోవడానికి దీనివల్ల వీలుకలుగుతుంది.
  ఈవిషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీ అజయ్‌ కుమార్‌ మిశ్రా, రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.

 

***


(रिलीज़ आईडी: 1945222) आगंतुक पटल : 140
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Tamil , Malayalam