ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పెండింగ్‌లో ఉన్న ఒప్పంద వివాదాలను(కాంట్రాక్ట్ వివాదాలు) సమర్థవంతంగా పరిష్కరించేందుకు 2023-–24 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా ప్రభుత్వం వన్-టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్ ‘వివాద్ సే విశ్వాస్ – II’ )ను ప్రారంభించింది.


ఈ పథకం కింద క్లెయిమ్‌లను సమర్పించడానికి చివరి తేదీ 31.10.2023

Posted On: 02 AUG 2023 4:52PM by PIB Hyderabad

 పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల కాంట్రాక్టు వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం   “వివాద్ సే విశ్వాస్ II – (కాంట్రాక్ట్ వివాదాలు) అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి 2023–-24 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు.

కేంద్ర బడ్జెట్ ప్రసంగంలోని, పారా 67లో, కేంద్ర ఆర్థిక మంత్రి మరియు కార్పొరేట్ వ్యవహారాల శ్రీమతి  నిర్మలా సీతారామన్ ప్రకటించారు

"కోర్టులో మధ్యవర్తిత్వ తీర్పు సవాలులో ఉన్న ప్రభుత్వ మరియు ప్రభుత్వ సంస్థల ఒప్పంద వివాదాలను పరిష్కరించడానికి, ప్రామాణిక నిబంధనలతో స్వచ్ఛంద పరిష్కార పథకం ప్రవేశపెట్టబడుతుంది. ఇది వివాదాల పెండెన్సీ స్థాయిని బట్టి గ్రేడెడ్ సెటిల్మెంట్ నిబంధనలను అందించడం జరుగుతుంది”

ఆర్థిక మంత్రిత్వ శాఖ, వ్యయ శాఖ, పథకం యొక్క వివరణాత్మక మార్గదర్శకాలను సూచిస్తూ 29.05.2023న ఒక ఉత్తర్వును జారీ చేసింది. క్లెయిమ్‌ల సమర్పణకు చివరి తేదీ 31.10.2023.

కింది ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న కేసులు ఈ పథకం కింద పరిష్కారానికి అర్హులు:

వివాదం యొక్క స్థితి అవార్డు క్రింది తేదీ వరకు జారీ చేయబడుతుంది

మధ్యవర్తిత్వ అవార్డు ఆమోదించబడిన తేదీ 31.01.2023

కోర్టు అవార్డు ఆమోదించిన తేదీ 30.04.2023

ఈ పథకం అన్ని దేశీయ ఒప్పంద వివాదాలకు వర్తిస్తుంది. అయితే అందులో ఒకటి  భారత ప్రభుత్వం లేదా దాని నియంత్రణలో పనిచేస్తున్న సంస్థ అయి ఉండాలి.

పథకం కింద, 30.04.2023న లేదా అంతకు ముందు ఆమోదించబడిన కోర్ట్ అవార్డ్‌ల కోసం కాంట్రాక్టర్‌కు అందించబడిన సెటిల్‌మెంట్ మొత్తం కోర్టు ద్వారా అందించబడిన/ఆధారించబడిన నికర మొత్తంలో 85% వరకు ఉంటుంది.

31.01.2023న లేదా అంతకు ముందు ఆమోదించబడిన మధ్యవర్తిత్వ అవార్డుల కోసం, అందించబడిన నికర మొత్తంలో 65% వరకు సెటిల్‌మెంట్ మొత్తం అందించబడుతుంది.

ప్రభుత్వ ఇ-–మార్కెట్‌ప్లేస్ (గవర్నమెంట్ ఇ–మార్కెట్) ఈ పథకం అమలు కోసం ప్రత్యేక వెబ్ పేజీని అభివృద్ధి చేసింది. అర్హత గల క్లెయిమ్‌లు ప్రభుత్వ ఇ-–మార్కెట్‌ప్లేస్ (గవర్నమెంట్ ఇ–మార్కెట్) ద్వారా మాత్రమే ప్రాసెస్ చేయబడతాయి. రైల్వే మంత్రిత్వ శాఖ యొక్క నాన్-ప్రభుత్వ ఇ-–మార్కెట్‌ప్లేస్ (గవర్నమెంట్ ఇ–మార్కెట్) కాంట్రాక్టుల కోసం, కాంట్రాక్టర్లు తమ క్లెయిమ్‌లను ఐఆర్ఈపీఎస్ (www.ireps.gov.in)లో నమోదు చేసుకోవచ్చు.

ఈ పథకం వివరాలు ఆర్థిక మంత్రిత్వ శాఖ, వ్యయ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

 

***

 


(Release ID: 1945213) Visitor Counter : 171


Read this release in: Tamil , English , Hindi