నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

పీఎం-కుసుమ్ పథకం ద్వారా దాదాపు 2.46 లక్షల మంది రైతులు లబ్ది పొందారు: కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి

Posted On: 01 AUG 2023 5:54PM by PIB Hyderabad

ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం-కుసుమ్) ప్రధాన లక్ష్యాలు వ్యవసాయ రంగాన్నీ డీ-డీజీలైజేషన్ చేయడం, రైతులకు నీరు ఇంధన భద్రతను అందించడం, వీటిని పెంచడం వంటివి అని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ శాఖ మంత్రి తెలియజేశారు. రైతుల ఆదాయం పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడం. పథకం క్రింది లక్ష్యాలను కలిగి ఉంది:

 

(i) కాంపోనెంట్ 'ఏ': రైతుల బంజరు/పోడు భూమిలో 2 మెగావాట్ వరకు సామర్థ్యం ఉన్న చిన్న సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా 10 గిగావాట్  సామర్థ్యం;

(ii) కాంపోనెంట్ 'బి': 20 లక్షల స్వతంత్ర ఆఫ్-గ్రిడ్ సోలార్ వాటర్ పంపుల ఇన్‌స్టాలేషన్; 

(iii) కాంపోనెంట్ ‘సి’: ఫీడర్ లెవల్ సోలరైజేషన్ (ఎఫ్ఎల్ఎస్) ద్వారా ఇప్పటికే ఉన్న 15 లక్షల గ్రిడ్-కనెక్ట్ అగ్రికల్చర్ పంపుల సోలరైజేషన్, 

 


పీఎం-కుసుమ్  అనేది డిమాండ్ ఆధారిత పథకం కాబట్టి రాష్ట్రాలు/యుటిల నుండి స్వీకరించిన డిమాండ్ ఆధారంగా పథకం మూడు భాగాల క్రింద పరిమాణాలు/సామర్థ్యాలు కేటాయిస్తారు. అయితే, రాష్ట్రాల్లో ఈ పథకం అమలు ఏజెన్సీలు నివేదించిన విధానం ప్రకారం పనుల పురోగతి ఆధారంగా నిధులు కేటాయిస్తారు. .
 

 

పిఎం-కుసుమ్ పథకం 30.06.2023 వరకు... 

క్రమ సంఖ్య 

రాష్ట్రం/యుటీ 

లబ్ధిపొందిన రైతులు (సంఖ్య)

విడుదలైన నిధులు (రూ.కోట్లలో)

1

అరుణాచల్ ప్రదేశ్ 

179

0.82

2

గుజరాత్ 

2459

11.78

3

హర్యానా 

55751

375.55

4

హిమాచల్ ప్రదేశ్ 

546

8.65

5

జమ్మూ కాశ్మీర్ 

632

15.69

6

ఝార్ఖండ్ 

12844

36.08

7

కర్ణాటక 

314

3.64

8

కేరళ 

74

0

9

మధ్యప్రదేశ్ 

7332

71.07

10

మహారాష్ట్ర 

61514

350.67

11

మణిపూర్ 

78

0.89

12

మేఘాలయ 

35

0.28

13

నాగాలాండ్ 

0

0.20

14

ఒడిశా 

1393

0.77

15

పంజాబ్ 

12864

63.09

16

రాజస్థాన్ 

60670

522.16

17

తమిళనాడు 

3187

31.51

18

త్రిపుర 

1946

11.43

19

ఉత్తరప్రదేశ్ 

23843

111.37

20

ఉత్తరాఖండ్ 

318

4.00

21

పశ్చమ బెంగాల్ 

4

0

22

ఇతరులు (సిపిఎస్యుల ద్వారా నిధుల విడుదల)

-

16.75

 

మొత్తం 

245983

1636.40



(Release ID: 1944889) Visitor Counter : 139


Read this release in: English , Urdu , Punjabi