హోం మంత్రిత్వ శాఖ
ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ లకు కేటాయింపు
Posted On:
01 AUG 2023 5:03PM by PIB Hyderabad
రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి(ఎస్డీఆర్ఎఫ్),జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి(ఎన్డీఆర్ఎఫ్) లకు నిధులు కేటాయించే అంశాన్ని ఆర్థిక సంఘం (రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం ఎప్పటికప్పుడు ఏర్పాటు అయ్యే సంఘం) సిఫార్సు చేస్తుంది. అని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తం అవార్డు వ్యవధి కోసం ప్రతి ఆర్థిక సంవత్సరానికి నిధుల కేటాయింపు జరుగుతుంది. 14 వ ఆర్థిక సంఘం ( 2015-16 నుంచి 2019-2020 వరకు)61,220 కోట్ల రూపాయలు కేటాయించాలని సిఫార్సు చేసింది. 15 వ ఆర్థిక సంఘం(2021-22 నుంచి 2025-2026) 1,28,122.40 కోట్ల రూపాయలు కేటాయించాలని సిఫార్సు చేసింది. దీనిలో కేంద్ర వాటా 98,080.80 కోట్లు, రాష్ట్రాల వాటా 30,041.60 కోట్ల రూపాయలుగా ఉంది.
దీంతోపాటు . స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ (SDMF) కింద 2021-22 నుంచి 2025-2026 వరకు అవార్డు వ్యవధి కోసం 32,030.60 కోట్ల రూపాయలు కేటాయించారు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) కింద మొత్తం కార్పస్ గా రూ.54,770 కోట్లు15 వ ఆర్థిక సంఘం కేటాయించింది. కేటాయించింది. అవార్డు వ్యవధి (2021-22 నుంచి 2025-26) కోసం నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ (NDMF) కింద 13,693 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి.
లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ ఈ వివరాలు తెలిపారు.
*****
(Release ID: 1944859)