హోం మంత్రిత్వ శాఖ

అగ్నిమాపక సేవల ఆధునీకరణ

Posted On: 01 AUG 2023 5:00PM by PIB Hyderabad

రాష్ట్రాల్లో అగ్నిమాపక సేవల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. దీనికోసం  ప్రభుత్వం 04.07.2023న రాష్ట్రాలకు 5,000 కోతల రూపాయలు విడుదల చేసింది.  2025-26 వరకు అమలు జరిగే పథకం కోసం  జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి  5,000 కోట్ల రూపాయలను సన్నద్ధత  సామర్థ్య నిర్మాణ  నిధిగా  విడుదల చేయడం జరిగింది. 

పథకంలో భాగంగా  కొత్త అగ్నిమాపక కేంద్రాలను  ఏర్పాటు చేయడం, రాష్ట్ర శిక్షణా కేంద్రాలను [పటిష్టం చేసి, సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆధునిక అగ్నిమాపక పరికరాల కోసం నిబంధనలు, రాష్ట్ర ప్రధాన కార్యాలయం , అర్బన్ అగ్నిమాపక కేంద్రాల పటిష్టత, సాంకేతిక అప్‌గ్రేడేషన్, ఆన్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం లాంటి చర్యలు అమలు జరుగుతాయి. పథకం పూర్తి వివరాలు   www.ndmindia.mha.gov.in. లో అందుబాటులో ఉన్నాయి. 
  ఈ పథకం కింద నిధుల కేటాయింపు రాష్ట్రాలకు  90:10 నిష్పత్తిలో ఉంటుంది.  ఈశాన్య కొండ రాష్ట్రాలకు నిధుల నిష్పత్తి  75:25 గా ఉంటుంది.  వ్యయ భాగస్వామ్య ప్రాతిపదికన నిధుల కేటాయింపు జరుగుతుంది. గుర్తించిన  కార్యకలాపాల కోసం రాష్ట్రాలకు కేంద్రం  5000 కోట్ల రూపాయలు అందిస్తుంది.  రాష్ట్రాల వాటా  1387.99 కోట్ల రూపాయలుగా ఉంటుంది. .
కేటాయించిన 5,000 కోట్ల రూపాయల్లో 500 కోట్ల రూపాయలను  చట్టపరమైన, మౌలిక సదుపాయాల ఆధారిత సంస్కరణలు అమలు చేసే  రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా అందుతుంది. 
  విపత్తు నిర్వహణ రాష్ట్రాల  ప్రాథమిక బాధ్యతగా ఉంటుంది. క్షేత్ర స్థాయిలో  బాధిత ప్రజలకు సహాయాన్ని అందించే బాధ్యత  రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే తమ వద్ద  రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) నుంచి  ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కేంద్ర  ప్రభుత్వం ఆమోదించిన అంశాలు, నిబంధనలకు అనుగుణంగా సహాయక చర్యలు అమలు చేస్తాయి. నిబంధనల ప్రకారం  జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF) నుంచి రాష్ట్రాలకు  అదనపు ఆర్థిక సహాయం అందుతుంది.  నిర్దేశించిన విధానం ప్రకారం, 'తీవ్ర స్వభావం' గా గుర్తించిన విపత్తు సంభవించినప్పుడు వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో కూడిన కేంద్ర బృందం రాష్ట్రాల్లో పర్యటించి అందించే నివేదిక ఆధారంగా అదనపు  నిధులు విడుదల అవుతాయి. 
రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి /  జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి  నిధుల విడుదల , వాటి ఖర్చులు  రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి   /  జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి మార్గదర్శకాలు ప్రకారం జరుగుతాయి.  దీనికి సంబంధించి కేంద్ర  హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు, సూచనలు విడుదల చేస్తుంది.   15 వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా సవరించిన మార్గదర్శకాలు 12.01.2022న జారీ అయ్యాయి.  రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి /  జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి   ఖర్చులకు సంబంధించిన సవరించిన  అంశాలు, నిబంధనలు కూడా 10.10.2022న విడుదల అయ్యాయి.  2025-26 వరకు కాలానికి వర్తించే మార్గదర్శకాలు, అంశాలు 11.07.2023న జారీ అయ్యాయి. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి /  జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి   కింద సవరించిన మార్గదర్శకాలు, అంశాలు www.ndmindia.mha.gov.in.లో అందుబాటులో ఉన్నాయి. 

నిరంతర ప్రయత్నాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం  విపత్తు నిర్వహణ విధానాన్ని సహాయ విధానంగా  కాకుండా     సంసిద్ధత, నివారణ, ప్రతిస్పందన, పునరుద్ధరణ, ఉపశమన మరియు సామర్థ్యాన్ని పెంపొందించే సమగ్ర విధానంగా  మెరుగు పరిచింది.  అభివృద్ధి ప్రణాళికలో విపత్తు ప్రమాద తగ్గింపు (DRR)ని ప్రధాన స్రవంతిలో చేర్చవలసిన అవసరాన్ని  డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్, 2005లో పొందుపరచడం జరిగింది.  విపత్తు నిర్వహణపై రూపొందిన జాతీయ విధానం, జాతీయ ప్రణాళిక దేశంలో విపత్తు ప్రమాద తగ్గింపును బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది.
   దేశంలో జాతీయ, రాష్ట్ర ,జిల్లా స్థాయిలో సంస్థాగత యంత్రాంగాలు పనిచేస్తున్నాయి..   ప్రకృతి వైపరీత్యాల సమర్థవంతమైన నిర్వహణ కోసం తగిన సంసిద్ధత, సమన్వయం, సత్వర ప్రతిస్పందన యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీలు, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీలు కృషి చేస్తున్నాయి. 

ప్రభుత్వం అమలు చేసిన, చేస్తున్న చర్యల వల్ల   విపత్తులలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. విపత్తు ప్రమాదాన్ని తగ్గించే వ్యవస్థను బలోపేతం చేయడం అనేది నిరంతర ప్రభుత్వ ప్రక్రియగా అమలు జరుగుతుంది. 

   విపత్తు ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన చర్యలు:-

i . నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) 2016లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ (NDMP)ని సిద్ధం చేసింది.  2019లో దానిని మరింత సవరించింది.  సెండాయ్ ఫ్రేమ్‌వర్క్ యొక్క ప్రాధాన్యతలు విపత్తు రిస్క్ తగ్గింపు (DRR) కోసం  థీమాటిక్ ఏరియాస్  ప్రణాళికా ఫ్రేమ్‌వర్క్‌లో విలీనం చేయబడ్డాయి.  
ii. వివిధ విపత్తుల కోసం విపత్తు ప్రమాదాల నిర్వహణ కోసం నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ మార్గదర్శకాలను విడుదల చేసింది.  విపత్తు తీవ్రత  తగ్గించడం, సంసిద్ధత, ప్రతిస్పందన కార్యకలాపాలు ఉన్నాయి.

iii. అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో విపత్తులు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉన్న  350 జిల్లాలను గుర్తించి,   జిల్లాల్లో సహాయ చర్యలు చేపట్టడానికి  1,00,000 మంది కమ్యూనిటీ వాలంటీర్లకు శిక్షణ ఇవ్వడానికి ఆపద మిత్ర పథకం  369.40 కోట్ల రూపాయల ఖర్చుతో అమలు జరుగుతోంది. .

iv. కామన్ అలర్ట్ ప్రోటోకాల్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ అలర్ట్ సిస్టమ్ (సాచెట్) ఫేజ్-I (CAP) కేంద్రీకృత వెబ్ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లో అన్ని హెచ్చరికల ఏజెన్సీల ఏకీకరణ కోసం రూపొందింది.  పథకం  354.83 కోట్ల రూపాయల వ్యయంతో అమలు జరుగుతుంది. 
v 16 బెటాలియన్‌లతో ఏర్పాటైన  నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్  విపత్తులు లేదా రాబోయే విపత్తు పరిస్థితుల్లో తక్షణ ప్రతిస్పందనను అందించడానికి విపత్తులు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బృందాలు ఏర్పాటు చేసింది. విపత్తులపై . ప్రజలకు అవగాహన కల్పించడానికి NDMA , NDRF ద్వారా మాక్ వ్యాయామాలు , కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాయి. 

vi.వరదలు, తుఫానులు, భూకంపం, కొండచరియలు విరిగిపడటం  విపత్తు నిర్వహణ / ప్రతిస్పందనకు సంబంధించిన వర్గాలు, ప్రజల సహకారంతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 
vii. స్కూల్  సేఫ్టీ ప్రోగ్రామ్ కింద మొత్తం 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో  1200  పాఠశాలల్లో పిల్లలకు విపత్తు ప్రతిస్పందన పై శిక్షణ ఇవ్వడానికి  జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి   కార్యక్రమాలు అమలు చేస్తోంది.
viii. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లా స్థాయిలలో స్వచ్చంధ సేవా సంస్థల సహకారంతో సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి చర్యలు అమలు చేస్తోంది. 
ix . ఎనిమిది తీర రాష్ట్రాల్లో తీర ప్రాంతాలు తరచుగా తుఫానులను ఎదుర్కొంటాయి. ఈ ప్రాంతాల్లో  ప్రాణనష్టం, ఆస్తి నష్టం తగ్గించడానికి  సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి  నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ (NCRMP) కింద కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. 
x.  2021-22 నుంచి 2025-26 వరకు నేషనల్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్‌మెంట్ ఫండ్ (NDRMF) మరియు స్టేట్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్‌మెంట్ ఫండ్ (SDRMF)ని రూపొందించాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. NDRMF కోసం  ప్రభుత్వం   రూ. 68,463 కోట్లు  . SDRMF కోసం రూ.  1,60,153 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. . ఈ కేటాయింపులు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రతిస్పందన నిధి, ఉపశమన నిధులుగా విభజించబడ్డాయి.  సంసిద్ధత, ప్రతిస్పందన, పునరుద్ధరణ, పునర్నిర్మాణం, నష్టాలు  తగ్గించడం కోసం నిధులు వినియోగం అవుతాయి.  

     లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన  సమాధానంలో హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ ఈ వివరాలు తెలిపారు.

 

***



(Release ID: 1944856) Visitor Counter : 103


Read this release in: English , Urdu