హోం మంత్రిత్వ శాఖ
తీవ్రవాద హింస, చొరబాట్లు
Posted On:
01 AUG 2023 4:59PM by PIB Hyderabad
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లో గత రెండేళ్లుగా తీవ్రవాద హింస, చొరబాటు ఘటనలు తగ్గుముఖం పట్టాయి. వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
సంవత్సరం
|
2021
|
2022
|
2023 ( జూన్ 30 వరకు)
|
తీవ్రవాద సంబంధిత సంఘటనలు
|
129
|
125
|
26
|
నికర చొరబాట్లు
|
34
|
14
|
0
|
తీవ్రవాద చర్యలు అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న రాజీ లేని విధానం వల్ల జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. తిరుగుబాటు కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపడం, ఉగ్రవాదులకు సహకరిస్తున్న వ్యక్తులను గుర్తించి అరెస్టు చేయడం, పోలీసులు, సైన్యం, కేంద్ర సాయుధ పోలీసు బలగాలను రంగంలోకి దించడం, రాత్రి పెట్రోలింగ్, తీవ్రవాదుల ఆధిపత్యాన్ని తగ్గించడం లాంటి చర్యలను చర్యలను ప్రభుత్వం అమలు చేస్తోంది. తీవ్రవాదులు, తీవ్రవాదులకు సహకరిస్తున్న వారి ఆస్తులను చట్ట నిబంధనల ప్రకారం జప్తు చేయడం జరుగుతోంది. జమ్మూ ,కాశ్మీర్‌లో ఉగ్రవాద సంఘటనలను అడ్డుకోవడానికి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రభుత్వం చర్యలు అమలు చేస్తోంది. అన్ని భద్రతా దళాల మధ్య ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవడం,పటిష్ట కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది.
సరిహద్దు చొరబాట్లను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల మధ్య సమన్వయం సాధించి పటిష్టమైన బహుముఖ వ్యూహాన్ని అవలంబించింది. దీనిలో భాగంగా అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ)/నియంత్రణ రేఖ ( ఎల్ఓసీ) వద్ద బలగాలను వ్యూహాత్మకంగా మోహరించడం, నిఘా కెమెరాలు, నైట్ విజన్ కెమెరాలు, హీట్ సెన్సింగ్ గాడ్జెట్‌లు మొదలైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం లాంటి చర్యలు అమలు జరుగుతున్నాయి. ఎల్ఓసీ వెంబడి బహుళ-స్థాయి విస్తరణ, సరిహద్దు ఫెన్సింగ్, ఆర్మీ/సరిహద్దు భద్రతా దళాలను మోహరించి, సరిహద్దు పోలీసు పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. చొరబాట్లు, ఆకస్మిక దాడులకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరించడానికి ఇంటెలిజెన్స్ సిబ్బందిని నియమించడం, స్థానిక వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రణాళిక అమలు జరుగుతోంది.
లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ ఈ వివరాలు తెలిపారు.
***
(Release ID: 1944852)