ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
'అంధత్వం & దృష్టి లోపం నియంత్రణ కోసం జాతీయ కార్యక్రమం'పై (ఎన్‌పీసీబీవీఐ) తాజా సమాచారం
ఎన్‌పీసీబీవీఐ కింద మిషన్ మోడ్ క్యాటరాక్ట్ సర్జరీ కార్యక్రమం (నేత్ర జ్యోతి అభియాన్) ప్రారంభం
2022-23 ఆర్థిక సంవత్సరంలో 75,00,000 కంటి శుక్లం శస్త్రచికిత్సలను లక్ష్యంగా పెట్టుకుంటే 83,44,824 కంటి శుక్లం శస్త్రచికిత్సలు జరిగాయి
Posted On:
01 AUG 2023 2:20PM by PIB Hyderabad
'అంధత్వం & దృష్టి లోపం నియంత్రణ కోసం జాతీయ కార్యక్రమం' (ఎన్‌పీసీబీవీఐ) కింద, పేరుకుపోయిన అర్హులైన కంటి శుక్లం కేసుల్లో శస్త్రచికిత్సలు పూర్తి చేయడానికి మిషన్ మోడ్ క్యాటరాక్ట్ సర్జరీ ప్రచారం (నేత్ర జ్యోతి అభియాన్) (2022-2025) ప్రారంభమైంది. ఇందుకోసం ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాలకు వార్షిక లక్ష్యాలను కేటాయించడం జరిగింది. ఎఫ్‌వై 2022-23లో 75,00,000 కంటి శుక్లం శస్త్రచికిత్సలను లక్ష్యంగా పెట్టుకుంటే 83,44,824 కంటి శుక్లం శస్త్రచికిత్సలు పూర్తి చేశారు. 2025 నాటికి అంధత్వం కేసులను 0.25%కి తగ్గించడానికి తీసుకున్న ఒక ప్రధాన చర్య ఇది.
ఎఫ్‌వై 2015 -16 నుంచి 2022-23 వరకు, ఎన్‌పీసీబీవీఐ కింద స్టేట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ (ఎస్‌పీఐపీ) కోసం తెలంగాణ రాష్ట్రానికి ఆమోదించిన నిధుల వివరాలు అనుబంధం-Iలో ఉన్నాయి.
ఎప్పటికప్పుడు ఐఈసీ కార్యకలాపాలు/అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ఎన్‌పీసీబీవీఐ కార్యక్రమంలో భాగం. దీంతోపాటు, 'ప్రపంచ గ్లకోమా వారం' 'నేత్ర దాన పక్షోత్సవం', 'ప్రపంచ దృష్టి దినోత్సవం' సందర్భంగా ఏటా పెద్ద ఎత్తున ఐఈసీ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. అంధత్వ నివారణ కోసం ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంత అవసరమో ఈ కార్యక్రమాలు చాటి చెబుతాయి.
అనుబంధం-1
2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు తెలంగాణ రాష్ట్రానికి ఎన్‌పీసీబీవీఐ కోసం ఎస్‌పీఐపీ ఆమోదాలు
(రూ. లక్షల్లో)
ఆర్థిక సంవత్సరం
|
మొత్తం
|
2015-16
|
1,520.00
|
2016-17
|
770.01
|
2017-18
|
1,447.45
|
2018-19
|
5,258.50
|
2019-20
|
1347.00
|
2020-21
|
1,757.64
|
2021-22
|
1,125.70
|
2022-23
|
1,993.50
|
- గమనిక: రాష్ట్రం సమర్పించిన ఎఫ్‌ఎంఆర్ ప్రకారం పైన పేర్కొన్న సమాచారం అందించడం జరిగింది, ఇది తాత్కాలిక సమాచారం.
కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బఘేల్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ విషయం వెల్లడించారు.
****
(Release ID: 1944769)
Visitor Counter : 141