నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సాగరమాల ప్రాజెక్ట్

Posted On: 01 AUG 2023 2:55PM by PIB Hyderabad

దేశంలో ఓడరేవు ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ  ప్రధాన పథకం సాగరమాల.  సవరించిన సాగరమాల నిధుల మార్గదర్శకాలను మంత్రిత్వ శాఖ 5.4.2023న జారీ చేసింది. సవరించిన నిధుల మార్గదర్శకాల ప్రకారం, ఏదైనా ప్రాజెక్ట్‌లో సాగరమాల ప్రోగ్రామ్ (పోర్ట్‌లు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ బడ్జెట్ నుండి) నిధుల సహకారం  అంచనా వేసిన ప్రాజెక్ట్ వ్యయంలో 50 శాతానికి పరిమితం చేయబడుతూ డీ పీ ఆర్ లేదా టెండర్ చేసిన వ్యయం ప్రకారం, ఏది తక్కువైతే ఆ మొత్తం అందించబడుతుంది. అయితే, ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ, షిప్పింగ్ మరియు జలమార్గాలు ఓడరేవుల మంత్రిత్వ శాఖకు బాధ్యత వహించే మంత్రి ఆమోదానికి లోబడి, ప్రత్యేకత, వ్యూహాత్మక స్వభావం, ఆవశ్యకత, మెరిట్‌లు, ప్రధాన ఓడరేవు ఆర్థిక స్థితి మొదలైన వాటి ఆధారంగా ఏదైనా ప్రాజెక్ట్‌కి 100% ఆర్థిక సహాయం అందించవచ్చు. 

 

ఈ విషయాన్ని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***


(Release ID: 1944765) Visitor Counter : 199
Read this release in: English , Urdu