సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు-2023కు పార్లమెంట్ ఆమోదం
పైరసీని అరికట్టేందుకు, సినీ పరిశ్రమను మరింత ప్రోత్సహించేందుకు ఈ బిల్లును తీసుకు వచ్చాం: కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్
సినీ పరిశ్రమకు రూ.20 వేల కోట్ల నష్టం కలిగిస్తున్న 'పైరసీ' బెడదను సమగ్రంగా అరికట్టేందుకు సవరణలు: ఠాకూర్
ప్రతి పదేళ్లకోసారి సినిమా లైసెన్స్ ను రెన్యువల్ చేసుకోవాలన్న నిబంధనను ప్రభుత్వం తొలగించి జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా చేసింది: ఠాకూర్
40 ఏళ్ల తర్వాత సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు చేస్తూ పార్లమెంట్
ఈ చారిత్రాత్మక బిల్లు ఆమోదించింది
క్యామ్-కార్డింగ్ తో పాటు, అసలు ముప్పు అయిన ఆన్ లైన్ పైరసీ ఇక శిక్షార్హం
కనీసం 3 నెలల జైలు , రూ.3 లక్షల జరిమానాతో కఠినశిక్ష ; జైలు శిక్షను 3 సంవత్సరాల వరకు, జరిమానాను ఆడిటెడ్ స్థూల ఉత్పత్తి వ్యయంలో 5% వరకు పొడిగించే వీలు
సుప్రీంకోర్టు తీర్పులను పొందుపరుస్తూ చిత్రాల సర్టిఫికేషన్ ప్రక్రియలో సమగ్ర మెరుగుదల
Posted On:
31 JUL 2023 7:23PM by PIB Hyderabad
సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు-2023కు లోక్ సభ సోమవారం నాడు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును 2023 జూలై 20 న రాజ్యసభలో ప్రవేశ పెట్టి 2023 జూలై 27 న చర్చ తర్వాత ఆమోదించారు. రెండు సభలు ఆమోదంతో బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర పడింది. సినిమాటోగ్రఫీ చట్టం 1952లో చివరిసారిగా ముఖ్యమైన సవరణలు జరిగిన 1984 తరువాత మళ్ళీ 40 ఏళ్ల కు ఇప్పుడు సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరిస్తూ ఈ చారిత్రాత్మక బిల్లును పార్లమెంటు ఆమోదించింది.
కొన్ని అంచనాల ఆధారంగా సినీ పరిశ్రమకు రూ.20,000 కోట్ల నష్టం కలిగిస్తున్న 'పైరసీ' బెడదను సమగ్రంగా అరికట్టడమే ఈ మైలు రాయి (ల్యాండ్ మార్క్ ) బిల్లు లక్ష్యం. ఈ నేరానికి కనీసం 3 నెలల జైలు, రూ.3 లక్షల జరిమానాతో కఠినశిక్ష విధించడం తో పాటు జైలు శిక్షను 3 సంవత్సరాల వరకు, జరిమానాను ఆడిటెడ్ స్థూల ఉత్పత్తి వ్యయంలో 5% వరకు పొడిగించే నిబంధన ను బిల్లు లో చేర్చారు.
గొప్ప వారసత్వం, సాంస్కృతిక వైవిధ్యం బలాలుగా ప్రపంచ కంటెంట్ హబ్ గా మారడానికి భారతదేశం నిజంగా అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భావిస్తున్నారు. ప్రధాన మంత్రి దార్శనికతను ముందుకు తీసుకువెళుతూ భారతీయ సంస్కృతి, సమాజం , విలువలను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడంలో భారతీయ సినిమా భారతదేశ సాఫ్ట్ పవర్ కు గణనీయమైన దోహదం చేస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి కూడా గుర్తించారు.
"ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో భారతీయ చలనచిత్ర పరిశ్రమ సాధికారత, చౌర్యం ముప్పు నుండి దాని రక్షణ భారతదేశంలో కంటెంట్ క్రియేషన్ ఎకోసిస్టమ్ వృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని, ఈ రంగంలో పనిచేసే కళాకారులు , పని వారందరి ప్రయోజనాలను కాపాడటానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.
సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు, 2023 లోక్ సభ లో పరిశీలనకు వచ్చి, ఆమోదం పొందడం గురించి కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, "భారతదేశం మన గొప్ప సంస్కృతి, వారసత్వం, వైవిధ్యాన్ని చూపించే కథల దేశంగా ప్రసిద్ధి చెందింది.
రాబోయే మూడేళ్లలో మన చిత్ర పరిశ్రమ 100 బిలియన్ డాలర్లకు ఎదుగుతుంది, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పైరసీని అరికట్టేందుకు, సినీ పరిశ్రమను మరింత ప్రోత్సహించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చాం. సినీ పరిశ్రమకు రూ.20 వేల కోట్ల నష్టం కలిగిస్తున్న 'పైరసీ' బెడదను ఈ సవరణలు సమగ్రంగా అరికట్టగలవు”
అని చెప్పారు.
ప్రతి పదేళ్లకోసారి సినిమా లైసెన్స్ ను రెన్యువల్ చేసుకోవాలన్న నిబంధనను ప్రభుత్వం తొలగించి జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా చేసిందని ఠాకూర్ తెలిపారు. ‘‘ఇప్పుడు రెన్యువల్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కె.ఎం.శంకరప్ప వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పును అనుసరించి, ప్రభుత్వం దానిని సవరణ అధికారానికి దూరంగా ఉంచింది. ఇప్పుడు సిబిఎఫ్ సి స్వయంప్రతిపత్తి సంస్థకు దానిని చూసుకునే పూర్తి అధికారం ఉంటుంది" అని తెలిపారు.
సినిమాటోగ్రఫీ చట్ట సవరణ:
మొదటిది, అనధికారిక రికార్డింగ్, చిత్రాల ప్రదర్శన సమస్యను పరిష్కరించడానికి, ఇంటర్నెట్ లో అనధికారిక కాపీలను ప్రసారం చేయడం ద్వారా సినిమా పైరసీ ప్రమాదాన్ని అరికట్టడానికి ఈ బిల్లు ప్రయత్నిస్తుంది.
రెండవది, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా బహిరంగ ప్రదర్శన కోసం చిత్రాల సర్టిఫికేషన్ ప్రక్రియను మెరుగుపరచడానికి, అలాగే చిత్రాల సర్టిఫికేషన్ ల వర్గీకరణలను మెరుగుపరచడానికి ఈ బిల్లు ప్రయత్నిస్తుంది.
మూడవది, ప్రస్తుత కార్యనిర్వాహక ఉత్తర్వులు, సుప్రీంకోర్టు తీర్పులు , ఇతర సంబంధిత చట్టాలతో చట్టాన్ని సమన్వయం చేయడానికి ఈ బిల్లు ప్రయత్నిస్తుంది.
ఎ) పైరసీకి గురైన సినిమాల అనధికారిక రికార్డింగ్, ఎగ్జిబిషన్ ను అరికట్టేందుకు నిబంధనలు: థియేటర్లలో క్యామ్ కార్డింగ్ ద్వారా సినిమా పైరసీని అరికట్టడానికి; అన్నింటికంటే ముఖ్యంగా ఏదైనా చిత్రం అనధికార కాపీయింగ్ , ఆన్ లైన్ ప్రసారం, ప్రదర్శనను నిషేధించడానికి కఠినమైన శిక్ష విధించే నిబంధనలు చేర్చారు
బి) వయస్సు-ఆధారిత ధృవీకరణ: ప్రస్తుతం ఉన్న యుఎ కేటగిరీని పన్నెండు సంవత్సరాలకు బదులుగా ఏడు సంవత్సరాలు (యుఎ 7+), పదమూడు సంవత్సరాలు (యుఎ 13+), పదహారు సంవత్సరాలు (యుఎ 16+) అనే మూడు వయస్సు-ఆధారిత కేటగిరీలుగా విభజించడం ద్వారా వయస్సు-ఆధారిత సర్టిఫికేషన్ కేటగిరీలను ప్రవేశ పెట్టారు. ఈ వయస్సు-ఆధారిత గుర్తులను తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ పిల్లలు అటువంటి చిత్రాన్ని చూడాలా వద్దా అని ఆలోచించడానికి
ఉద్దేశించారు.
సి) సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా: కె.ఎం.శంకరప్ప వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2000) కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కేంద్ర ప్రభుత్వ సవరణ అధికారాలను తొలగించారు.
డి) సర్టిఫికెట్ల శాశ్వత చెల్లుబాటు: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సి వి ఎఫ్ సి) సర్టిఫికెట్లపై చట్టంలో కేవలం పదేళ్లు మాత్రమే ఉన్న పరిమితిని తొలగించారు
ఇ) టెలివిజన్ కోసం చలనచిత్ర కేటగిరీ మార్పు: టెలివిజన్ ప్రసారం కోసం ఎడిట్ చేసిన చలనచిత్రాన్ని తిరిగి ధృవీకరించడం, ఎందుకంటే
అన్ రిస్ట్రిక్టేడ్ పబ్లిక్ ఎగ్జిబిషన్ కేటగిరీ చిత్రాలను మాత్రమే టెలివిజన్ లో ప్రదర్శించవచ్చు.
ఎఫ్) జమ్ముకశ్మీర్ ప్రస్తావన: జమ్ముకశ్మీర్ పునర్విభజన చట్టం-2019కు అనుగుణంగా పూర్వపు జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన ప్రస్తావనల తొలగింపు
భారతీయ చలన చిత్ర పరిశ్రమ ప్రపంచంలోని అతిపెద్ద , అత్యంత ప్రపంచీకరణ పరిశ్రమలలో ఒకటి, ఇది 40 కి పైగా భాషలలో సంవత్సరానికి 3,000 కంటే ఎక్కువ చిత్రాలను నిర్మిస్తోంది.
సినిమా మాధ్యమం, దానికి సంబంధించిన సాధనాలు, సాంకేతిక పరిజ్ఞానం ఈ కాలంలో కీలక మార్పులకు లోనయ్యాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా రాకతో పైరసీ బెడద కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు పార్లమెంటు ఆమోదించిన సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు, 2023 పైరసీ బెడదను అరికట్టడానికి , సులభ వ్యాపారంతో భారతీయ చలన చిత్ర పరిశ్రమ సాధికారతకు ఎంతగానో దోహదపడుతుంది.
*****
(Release ID: 1944620)
Visitor Counter : 209