పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

వలస పక్షుల సంరక్షణ

Posted On: 31 JUL 2023 5:39PM by PIB Hyderabad

“మధ్యాసియా గగన మార్గం వెంబడి వలస పక్షుల సంరక్షణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక”కు కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ 2018 నవంబరులో శ్రీకారం చుట్టింది. దీనికింద వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాలు, రక్షిత ప్రాంతాల నిర్వాహక సంస్థలు, స్థానిక సమాజాల, పౌర సంఘాలు, ప్రైవేటు రంగం వగైరాల మధ్య సమన్వయం, సహకారానికి ఈ ప్రణాళిక ప్రాధాన్యమిస్తుంది.

   ఉత్తరప్రదేశ్‌లో వలస పక్షుల సంఖ్య క్షీణతను సూచించే నివేదిక మంత్రిత్వశాఖ వద్ద లేదు... ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వలస పక్షులపై వాతావరణ మార్పు ప్రభావం, వాటి జీవితచక్రంలో మార్పులపైనా మంత్రిత్వ శాఖ అధ్యయనమేదీ నిర్వహించలేదు. వన్యప్రాణుల రక్షణ-సంరక్షణ,  వాటి ఆవాసాల బాధ్యత ప్రధానంగా రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలపైనే ఉంటుంది. కాబట్టి ఆయా ప్రభుత్వాలు సమర్పించే ప్రతిపాదనల ప్రాతిపదికన కేంద్ర మంత్రిత్వ శాఖ సాంకేతిక-ఆర్థిక సహాయం అందిస్తుంది.

   ఈ మేరకు కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు  శాఖ సహాయమంత్రి శ్రీ అశ్వనీ కుమార్‌ చౌబే ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

 

*****



(Release ID: 1944617) Visitor Counter : 104


Read this release in: English , Urdu