భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం

ప్రజలు చర్చించేందుకు వీలుగా డీప్టెక్ స్టార్టప్ జాతీయ ముసాయిదా పత్రం విడుదల.

Posted On: 31 JUL 2023 5:39PM by PIB Hyderabad

 జాతీయ డీప్ టెక్ స్టార్టప్ విధాన కాన్సార్టియం, డీప్టెక్ జాతీయ ముసాయిదా పత్రాన్ని ప్రజలుచర్చించేందుకు వీలుగా విడుదల చేసింది . దీనిప్ర ప్రజలు తమ స్పందనలను 2023, సెప్టెంబర్ 15 వ తేదీలోగా పంపవలసి ఉంటుంది.
ప్రధానమంత్రి నేతృత్వంలోని శాస్త్ర , విజ్ఞాన, ఆవిష్కరణల సలహా మండలి (పిఎం–ఎస్టిఐఎసి), 2022 జూలై 7న నిర్వహించిన 21వ సమావేశంలో , భారత డీప్టెక్ స్టార్టప్ లకు సంబంధించి ఒక   సమగ్ర విధానపత్ర రూపకల్పనకు  నేషనల్ కాన్సార్టియం ఏర్పాటు చేయాలని తీర్మానించింది.

ఈ సమావేశానికి భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్, ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ అధ్యక్షత వహించారు. జాతీయస్థాయిలో నేషనల్ కాన్సార్టియంలో పలువురు భాగస్వాములు ఉన్నారు.
కాన్సార్టియంలో సభ్యులుగా పారిశ్రామిక ప్రోత్సాహకక, అంతర్గత వాణిజ్యం (డిపిఐఐటి), అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఎఐఎం), నీతి ఆయోగ్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, డిపార్టమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ,
ఇండియన్ స్పేస్ రిసెర్చ్  ఆర్గనైజేషన్ (ఇస్రొ), నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ (ఎన్ఎస్సిఎస్), రక్షణ  పరిశోధన, అభివృద్ది సంస్థ (డిఆర్డిఒ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్,
 సర్వీస్ కంపెనీలు (నాస్కామ్), భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), భారత వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య(ఫిక్కి) ఉన్నాయి.
భారతప్రభుత్వానికి ప్రధాన శాస్త్ర సలహాదారు కార్యాలయాన్ని, వివిధ స్టేక్ హోల్డర్లతో చర్చించి ముసాయిదా పత్రాన్ని రూపొందించే బాధ్యత అప్పగించారు. డీప్టెక్ రంగానికి సంబంధించి విధాన ప్రాథాన్యత విషయంలో
ఆయా భాగస్వాముల మధ్య ఏకరూపత తీసుకువచ్చేందుకు ఈ కార్యాలయం కృషి చేస్తుంది. నేషనల్ కాన్సార్టియం మార్గనిర్దేశకత్వం ప్రకారం, నిపుణుల వర్కింగ్ గ్రూప్ సూచనల మేరకు, నేషనల్ డీప్టెక్ స్టార్టప్ పాలసీని
బహుళపక్ష సంప్రదింపుల ద్వారా అభివృద్ధి చేశారు. ఇందుకు స్టార్టప్లు, ఇంక్యుబేషన్సెంటర్లు, పరిశ్రమల అసోసియేషన్లు, బోధనా సంస్థలు, సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో విస్తృతంగా చర్చించి రూపొందించడం జరిగింది.


ముసాయిదా రూపకల్పనలో సంప్రదింపులు కింది విధంగా ఉన్నాయి (ఎ) జాతీయ కన్సార్టియం, వర్కింగ్ గ్రూపుస్థాయిలో పలు ప్రాధాన్యతల నిర్ధారణ సమావేశాలు.
(బి) న్యూఢిల్లీ, ముంబాయి, హైదరాబాద్, బెంగళూరులోని అకడమిక్ ఇన్నొవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్లలో గల డీప్టెక్ స్టార్టప్ లతో సంప్రదింపుల సమావేశం.
 (సి)స్టేక్ హోల్డర్లతో రౌండ్టేబుల్ సమావేశాలు, చర్చలు.
(డి), నిపుణులతో సాంకేతిక విధాన పరిశోధకులతో  ప్రత్యేక గ్రూప్ చర్చలు.
(ఇ) వ్యక్తిగత ఆలోచనాపరులు, ఈ రంగంలోని వారితో ఇంటర్వ్యూలు,  ఇలాంటి చర్చించలు,  సంప్రదింపులు ముసాయిదా విధాన రూపకల్పనలో కీలకపాత్ర  వహించాయి.  డీప్ టెక్ రంగానికి సంబంధించిన అవసరాలు,  ఆకాంక్షలకు అనుగుణంగా దీని రూపకల్పన జరిగింది.
ముసాయిదా విధానాన్ని సుమారు200 మందికి పైగా స్టేక్ హోల్డర్లు, బయటి వ్యక్తుల నుంచి సమాచారం సేకరించి రూపొందించడం జరిగింది. ఈ విధానం ప్రస్తుతం ఉన్న స్టార్టప్ ఇండియా విధానాలు, కార్యక్రమాలకు అదనంగా ఉంటుంది.
ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు ఇది ఉపకరిస్తుంది. ముసాయిదా  ఎన్.డిటిఎస్పి వివిధ విధాన పరమైన అంశాలపై  దృష్టిపెట్టింది. అలాగే కింది అంశాలలో అవసరమైన విధాన మార్పుల గురించి
తగిన సూచనలు చేసింది. అవి,
1.పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రోత్సాహం
2. మేథో సంపత్తి హక్కుల ను బలోపేతం చేయడం.
3. ఫండింగ్ అందుబాటులో ఉండేట్టు చూడడం.
4. మౌలిక సదుపాయాలు, వనరుల ఉమ్మడి వినియోగం
5. అనువైన నియంత్రణలు, ప్రమాణాలు, సర్టిఫికేషన్
6. మానవ వనరుల ఆకర్షణ, సామర్ధ్యాల పెంపు
7. ప్రొక్యూర్మెంట్కు ప్రోత్సాహం
8. విధానాలు,కార్యక్రమాలల అంతర్  అనుసంధానత
9.డీప్టెక్ సాంకేతికతలు నిలదొక్కుకునేట్టు చూడడం.
 జాతీయ కన్సార్టియం 2023 జూలై  24న సమావేశమై ముసాయిదా విధాన పత్రంపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ విధాన పత్రంపై ప్రజలు  చర్చించి తగిన సూచనలు చేసేందుకు వీలుగా దీనిని విడుదల చేయాలని నిర్ణయించింది.
ఈ విధానంపై సమీక్షించి , చేర్చిన మరిన్ని సూచనలతో సవరించిన  ముసాయిదాను 2023 జూలై 31న ప్రజల సంప్రదింపుల కోసం విడుదల చేయడం జరిగింది. దీనిపై 2023 సప్టెంబర్ 15 వరకు సలహాలు, సూచనలు స్వీకరిస్తారు.
ఈ డాక్యుమెంట్ ను   www.psa.gov.in/deep-tech-policy వెబ్సైట్ లో చూడవచ్చు.

 

****



(Release ID: 1944531) Visitor Counter : 144


Read this release in: English , Urdu , Marathi