సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, జిల్లా లైబ్రరీకి ఆర్థిక సహాయం..


- నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్ స్కీమ్ కింద ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాలలోని గ్రంథాలయాలకు సాయం

Posted On: 31 JUL 2023 4:36PM by PIB Hyderabad

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తన నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్ (ఎన్ఎంఎల్) పథకం కింద ప్రతి రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రాంతంలోని రాష్ట్ర సెంట్రల్ లైబ్రరీ, జిల్లా లైబ్రరీలకు ఆర్థిక సాయం అందించనుంది. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎన్.ఎ.పి.ఎల్.ఐ.ఎస్) పై నేషనల్ పాలసీ ఆన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎన్.ఎ.ఎల్.పి.ఐ.ఎస్) యొక్క లక్ష్యం, 1985లో ప్రొఫెసర్ డి. పి. చటోపాధ్యాయ అధ్యక్షతన ఏర్పడిన సంస్థలను ప్రోత్సహించడానికి, మరియు నిలబెట్టడానికి, సమాచార లభ్యత, వినియోగంనకు తగిన చర్యలు తీసుకోవడానికి రూపొందించబడింది. ప్రస్తుతం ఉన్న లైబ్రరీ,ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మరియు సేవలను సమీకరించడం, అప్‌గ్రేడ్ చేయడం, సాంకేతికత యొక్క తాజా పురోగతుల ప్రయోజనాన్ని పొందడం; లైబ్రరీ & సమాచార సిబ్బందికి శిక్షణ, నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్ (ఎన్ఎంఎల్) అమలుతో నెరవేరింది, ప్రత్యేకించి నేషనల్ వర్చువల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (ఎన్.వి.ఎల్.ఐ) భాగం ద్వారా ఇండియన్ కల్చర్ పోర్టల్ (ఐసీపీ) అభివృద్ధి చేసి మరియు ప్రారంభించబడింది. ఐసీపీ పబ్లిక్ డొమైన్‌లో https://indianculture.gov.in/లో అందుబాటులో ఉంది. దేశంలో గ్రంథాలయ రంగం అభివృద్ధి కోసం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తన నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్ (ఎన్ఎంఎల్) పథకం ద్వారా, 'ఎన్ఎంఎల్ మోడల్ లైబ్రరీని ఏర్పాటు చేయడం' భాగం కింద, ప్రతి రాష్ట్రంలో ఒక స్టేట్ సెంట్రల్ లైబ్రరీ మరియు ఒక జిల్లా లైబ్రరీకి ఆర్థిక సహాయం అందిస్తుంది. కేంద్రపాలిత ప్రాంతం, సంబంధిత రాష్ట్ర అథారిటీ సిఫార్సు మేరకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గుర్తించిన 6 లైబ్రరీల.ఆధునీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయబడుతాయి. అంతేకాకుండా, రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ (ఆర్ఆర్ఆర్ఎల్ఎఫ్), సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ. దాని మ్యాచింగ్ మరియు నాన్-మ్యాచింగ్ పథకాల ద్వారా వివిధ ప్రయోజనాల కోసం పబ్లిక్ లైబ్రరీలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఉదా. గ్రంథాలయ భవనాల నిర్మాణం / పునరుద్ధరణ, ఫర్నిచర్, పరికరాలతో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆధునికీకరణ, పుస్తకాలు మరియు పఠన వనరుల సేకరణ, సదస్సు నిర్వహణ, శిక్షణ మరియు లైబ్రరీ నిపుణుల సామర్థ్యాన్ని పెంపొందించడం, వర్క్‌షాప్, ఔట్రీచ్ ప్రోగ్రామ్‌లు, చిల్డ్రన్ కార్నర్ ఏర్పాటు, ప్రారంభోత్సవం వివిధ విభాగాలు, ప్రత్యేక వికలాంగులకు సౌకర్యాలను సృష్టించడం, బ్రెయిల్ కార్నర్ మొదలైనవి. ఈ రోజు లోక్‌సభలో సాంస్కృతిక, పర్యాటక, మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారం అందించారు.

*****

 



(Release ID: 1944524) Visitor Counter : 95


Read this release in: English , Urdu , Tamil