సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎంఎస్‌ఎంఈ క్రెడిట్ కార్డు
प्रविष्टि तिथि:
31 JUL 2023 4:03PM by PIB Hyderabad
కేంద్ర సూక్ష్మ, చిన్న & మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) శాఖ, 'నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (ఎన్‌పీసీఐ) సహకారంతో ఎంఎస్‌ఎంఈ రూపే క్రెడిట్ కార్డును ప్రారంభించింది. ఉద్యమ్ నమోదిత ఎంఎస్‌ఎంఈల కోసం, దేశవ్యాప్తంగా, పైలెట్ నమూనా ప్రాతిపదికన ఈ కార్డును తీసుకొచ్చింది.
ఎంఎస్‌ఎంఈ రూపే క్రెడిట్ కార్డుల ద్వారా డిజిటల్ చెల్లింపులు, బిల్లుల చెల్లింపులు, పన్ను/చట్టబద్ధమైన చెల్లింపులు చేయవచ్చు. దీని ద్వారా, వాటి వ్యాపార సంబంధిత ఖర్చుల కోసం ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. బ్యాంక్ విధానం ప్రకారం, వ్యాపార సంబంధిత వ్యయాలపై ఎంఎస్‌ఎంఈ క్రెడిట్ కార్డుదార్లకు వడ్డీ రహిత రుణ చెల్లింపు వ్యవధి కూడా లభిస్తుంది.
కేంద్ర సూక్ష్మ, చిన్న & మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం అందించారు.
*****
(रिलीज़ आईडी: 1944494)
आगंतुक पटल : 138