పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
బీసీఏఎస్ ఆధ్వర్యంలో ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్
భద్రతా సంస్కృతి వారపు థీమ్ - " చూడండి, చెప్పండి, భద్రపరచండి" ఇతివృత్తంతో వారోత్సవాల నిర్వహణ
భారతదేశంలో విమానాశ్రయాల ద్వారా రోజుకు సగటున 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు
భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత -బీసీఏఎస్, డీజీ జుల్ఫికర్ హసన్
Posted On:
31 JUL 2023 4:32PM by PIB Hyderabad
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) వారం రోజుల పాటు ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్‌ను నిర్వహించనుంది. న్యూఢిల్లీలోని బీసీఏఎస్ ప్రధాన కార్యాలయంలో 'ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్'కార్యక్రమం ప్రారంభమైంది. 2023 ఆగస్టు 5 వరకు కార్యక్రమం అమలు జరుగుతుంది. థీమ్ ' అనేది "చూడండి, చెప్పండి, భద్రపరచండి" ఇతివృత్తంతో 'ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్' ని నిర్వహిస్తుంది.
కార్యక్రమం వివరాలను బీసీఏఎస్, డీజీ జుల్ఫికర్ హసన్ మీడియాకు వివరించారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులు తమతో తీసుకు వెళ్ళకుండా నిషేధించిన వస్తువులపై ప్రయాణికులకు అవగాహన కల్పించడానికి కార్యక్రమం నిర్వహిస్తున్నామని జుల్ఫికర్ హసన్ తెలిపారు.
రానున్న 18 నెలల కాలంలో దేశంలో అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో దశల వారీగా బాడీ స్కానర్‌లను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జుల్ఫికర్ హసన్ తెలిపారు.భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. విమానాశ్రయాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ బాధ్యత ఉంటుందన్నారు. స్క్రీనర్ల నుండి క్లీనర్ల వరకు, పరిశ్రమల ప్రముఖుల నుండి ఫ్రంట్‌లైన్ కార్మికుల వరకు, టాక్సీ డ్రైవర్ల నుండి విమానాశ్రయ రిటైల్ అవుట్‌లెట్‌లలో పనిచేసే వారి వరకుప్రతి ఒక్కరిపై భద్రత బాధ్యత ఉంటుందన్నారు. వివిధ విమానాశ్రయాల్లో భద్రతా సామర్థ్యాన్ని పెంపొందించడంతో రానున్న పండుగల సీజన్‌లో ప్రయాణికులు సాఫీగా ప్రయాణం సాగిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
భారతదేశంలోని 131 విమానాశ్రయాలప్రతిరోజూ రోజువారీ సగటున సుమారు.10 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. తనిఖీల కోసం సెక్యూరిటీ చెక్ పాయింట్‌ల వద్ద దాదాపు 11,000 మంది స్క్రీన్లర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతిరోజూ 5 లక్షల మంది ప్రయాణికులను , 9 లక్షల హ్యాండ్‌బ్యాగ్‌లను స్క్రీన్లర్లు తనిఖీ చేస్తున్నారు.
దేశంలో విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేయడానికి దాదాపు 600 సామాను ఎక్స్-రే యంత్రాలు, 1000 డిఎఫ్ఎండీ లు ఏర్పాటయ్యాయి. భారతీయ గగనతల భద్రత కోసం, బలమైన , సమర్థవంతమైన విమానయాన భద్రత వ్యవస్థను అభివృద్ధి చేయడానికి బీసీఏఎస్ కృషి చేస్తోంది.
'ఏవియేషన్ సెక్యూరిటీ వీక్' సందర్భంగా,విమానాశ్రయాల్లో బీసీఏఎస్ ఆధ్వర్యంలో కింది కార్యక్రమాలు అమలు జరుగుతాయి:-
i. కార్గో టెర్మినల్స్‌తో సహా ఫోర్‌కోర్ట్ ప్రాంతం, టెర్మినల్ భవనాల్లో సమాచార కేంద్రాలు, కియోస్క్‌ల ఏర్పాటు
ii . విమానంలో ప్రకటనలు
iii.భద్రతా అవగాహన కల్పించే విధంగా విమానాశ్రయం వివిధ ప్రాంతాల్లో ప్రకటనలు ఏర్పాటు చేయడం
iv . విమాన సర్వీసుల నిర్వాహకులు జారీ చేసే టికెట్ సంబంధిత ఎస్ఎంఎస్ /మెయిల్‌లు/వాట్స్ యాప్ లో భద్రత అంశాలను ప్రచారం చేయడం
v. ఓటీఏ ద్వారా టికెట్‌లో ట్యాగ్‌లైన్ పంపడం
vi . నిష్క్రమణ హాల్‌లో లఘు చిత్రాలు ప్రదర్శించడం
vii. వెబ్‌సైట్‌లలో విమానయాన భద్రతా సంస్కృతి వారానికి సంబంధించి పాప్-అప్.
viii. ప్రయాణికులు పాల్గొనే విధంగా క్విజ్‌ని నిర్వహించడం,
ix. ప్రయాణీకుల సంతకాలు సేకరించడానికి బోర్డులు.ఏర్పాటు చేయడం
x. వారంలో ప్రతిరోజూ సిఐఎస్ఎఫ్ డాగ్ స్క్వాడ్ ప్రదర్శనలు.
వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో కెప్టెన్ శ్రీ దేవి శరణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
1999లో కాందహార్‌కు హైజాక్ అయిన IC-814 విమానం కెప్టెన్‌గా శ్రీ దేవి శరణ్ పనిచేశారు. క్యాబిన్ టీమ్ హెడ్ , IC-814 చీఫ్ పర్సర్ శ్రీ అనిల్ శర్మ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరయ్యారు.
ఇద్దరూ తమ IC-814 అనుభవాన్ని పంచుకున్నారు. అలాంటి సంఘటన మళ్లీ జరగకుండా చూడడానికి బీసీఏఎస్ చేస్తున్న నిరంతర కృషిని అభినందించారు.
విమానయాన పరిశ్రమ రంగానికి చెందిన సామూహిక నమ్మకాలు, వైఖరులు,ప్రవర్తనలను విమానయాన భద్రత సంస్కృతి సూచిస్తుంది. విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించే విమానాల నిర్వహణ, విమాన ప్రయాణికులకు సంబంధించి అంతర్గతంగా అమలు జరిగే భద్రతా పద్ధతులు, విధానాలకు సంబంధించిన అంశాలను బీసీఏఎస్ పర్యవేక్షిస్తుంది.
***
(Release ID: 1944480)
Visitor Counter : 109