గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఆహార వైవిధ్యం, జీవనోపాధిని మెరుగుపరచేందుకు వ్యవసాయ- పోషకాహార తోటలు, పశువుల పెంపకంపై జాతీయ స్థాయి సంప్రదింపులను నిర్వహించిన దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్
Posted On:
29 JUL 2023 12:02PM by PIB Hyderabad
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంఒఆర్‌డి) పరిధిలోని దీన్ దయాల్ అంత్యోదయ యోజన- జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్ (డిఎవై- ఎన్ఆర్ఎల్ఎం) కమ్యూనిటీ ఆధారిత సంస్థ ద్వారా స్థిరమైన వ్యవసాయ పోషకాహార తోటలను, పశువుల పెంపకం పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా పోషకాహార భద్రతను అభివృద్ధి చేయడంపై ఆన్‌లైన్ సంప్రదింపులను నిర్వహించింది. ఈ సంప్రదింపులను నిర్వహించడంలో సాంకేతిక భాగస్వాములైన రోషిణి సెంటర్, ఎన్ఆర్ఎల్ఎం (పిసిఐ) టిఎ తోడ్పడ్డాయి.
గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి శ్రీ చరణజీత్ సింగ్ కీలకోపన్యాసం చేస్తూ భూమిలేని స్వయం సహాయక బృందాల కుటుంబాల కోసం సేంద్రియ వ్యవసాయ పోషకాహార తోటలను, పశువుల పెంపకం ప్రోత్సాహించే దృక్పధాన్ని కలిగి ఉండాలని అన్నారు. సూక్ష్మపోషకాల లేమి, దాగి ఉన్న ఆకలిని పంటల బయోఫోర్టిఫికేషన్ ద్వారా పరిష్కరించవచ్చు కానీ దానిపై పని చేయవలసిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. అగ్రి న్యూట్రిషన్ (వ్యవసాయ పోషకాహార) తోట, పశువుల పెంపకం వంటివి కుటుంబాలకు అందుబాటులో పౌష్టికాహారాన్ని ఇవ్వగలిగే సంభావ్యతను కలిగి ఉన్నాయనే విషయాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ గుర్తించిందని, సంయుక్త కార్యదర్శి శ్రీమతి స్మృతి శరణ్ అన్నారు.
ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ), ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (అంతర్జాతీయ జనాభాశాస్త్ర సంస్థ), ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, హర్ష ట్రస్ట్, సెంటర్ ఫర్ ఇండియన్ నాలెడ్జ్ వ్యవస్థలు, పిఆర్ఎడిఎఎన్, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గోట్ మేనేజ్‌మెంట్, రీవైటలైజింగ్ రెయిన్‌ఫెడ్ అగ్రికల్చర్ నెట్‌వర్క అండ్ వాటర్‌షెడ్ సపోర్ట్ సర్వీసెస్ అండ్ ఆక్టివిటీస్ నెట్‌వర్క్ (డబ్ల్యుఎఎస్ఎస్ఎఎన్), ట్రాన్సఫార్మ్ రూరల్ ఇండియా, గ్రామ్యరీసోర్స్ సెంటర్ ఫర్ వుమెన్, ప్రాజెక్ట్ కన్సర్న్ ఇంటర్నేషనల్, యునిసెఫ్, అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ నుంచచి నిపుణులతో పాటుగా, బీహార్ జార్ఖండ్ రాష్ట్ర నాయకులు తమ అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్రగ్రామీణ ఉపాధి మిషన్లు, ఇతర భాగస్వామ్య ఏజెన్సీలు, సంస్థలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి.
ఈ సంప్రదింపుల నుంచి ఉద్భవించిన కీలక అంశాలలో, సామర్ధ్య నిర్మాణం ద్వారా కమ్యూనిటీని బలోపేతం చేయడం, దేశీయ రకాల పంటలను ప్రోత్సహించడం, విత్తనాల నిర్వహణ, కమ్యూనిటీ పెరటి తోటలు, జంతువుల ఆరోగ్య సమస్యలు తగ్గించే వ్యూహాలు ముఖ్యంగా ఉన్నాయి. అంతేకాకుండా, పశువుల ఆరోగ్య సంరక్షణకు విస్తరణ సేవలు, సుస్థిరతకు భరోసా, ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు మారిన సామాజిక, ప్రవర్తనాపరమైన కమ్యూనికేషన్ పద్ధతుల ద్వారా సామాజిక, సాంస్కృతిక కట్టుబాట్లను తెంచివేయడంతో పాటుగా పౌష్టికాహార విజ్ఞానం వంటివాటిపై కీలకంగా దృష్టి పెట్టవలసి ఉంది.
మహిళల ఆదాయాన్ని, పోషకాహార ఫలితాలను మెరుగుపరిచేందుకు వివిధ విభాగాలు, కార్యక్రమాల కలయిక అన్నది ఒక పరిష్కారంగా భావించవచ్చు. మహిళలలో పౌష్టికతను మెరుగుపరచడానికి అందుబాటులో ఉండే, స్థిరమైన నమూనాల అవసరం.
***
(Release ID: 1944097)
Visitor Counter : 119