గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
నిర్మాణ రంగంలో స్థిరమైన పద్ధతులు మరియు సాంకేతికతల స్వీకరణ
प्रविष्टि तिथि:
27 JUL 2023 4:05PM by PIB Hyderabad
నిర్మాణ రంగంలో కొత్త మరియు అభివృద్ధి చెందుతున్న నిర్మాణ వస్తువులు, సాంకేతికతలను స్వీకరించడానికి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ - ఇండియా (జీహెచ్టీసీ-ఇండియా)ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఈ సాంకేతికతలను విస్తృతంగా స్వీకరించడానికి వీలుగా ఆరు లైట్ హౌస్ ప్రాజెక్ట్‌ల కోసం ఆరు విభిన్న నిర్మాణ సాంకేతికతను చేపట్టింది. పీఎంఏవై (అర్బన్) పథకం కింద దాదాపు 17 లక్షల ఇళ్లు కొత్త టెక్నాలజీల ఆధారంగా నిర్మాణంలో ఉన్నాయి. ఈ సాంకేతికతలు వనరుల-సమర్థవంతమైనవి, వాతావరణ-ప్రతిస్పందించేవి, విపత్తు-తట్టుకునేవి, పర్యావరణ అనుకూలమైనవి మరియు శక్తి-సమర్థవంతమైనవిగా వేగవంతమైన నిర్మాణం మరియు స్థిరమైన అభివృద్ధికి దారితీస్తాయని నిరూపించబడింది. జీహచ్టీసీ -ఇండియా ప్రక్రియలో, ఎంఓహెచ్యుఏ టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీ (టీఈసీ) దేశంలోని వివిధ భౌగోళిక-వాతావరణ ప్రాంతాలలో నిర్మాణం యొక్క అనుకూలతను బట్టి షార్ట్లిస్ట్ చేయబడిన 54 ఇన్నోవేటివ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీలను గుర్తించింది. దేశంలోని వివిధ భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎమర్జింగ్ టెక్నాలజీల గుర్తింపు, మూల్యాంకనం మరియు సర్టిఫికేషన్, పనితీరు అంచనా సర్టిఫికేషన్ స్కీమ్ (పీఏసీఎస్సీ) నిర్వహించబడుతోంది. దీని కింద, ఇప్పటివరకు 82 వినూత్న ఉత్పత్తులు మరియు వ్యవస్థలు ధృవీకరించబడ్డాయి. హౌసింగ్ & పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ ఈరోజు లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
*****
(रिलीज़ आईडी: 1943874)
आगंतुक पटल : 126