మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మత్స్య రంగానికి సంబంధించి ఐరోపా సమాజం ప్రతినిధి బృందంతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తమ్ రూపాల

Posted On: 28 JUL 2023 12:07PM by PIB Hyderabad

పర్యావరణంమహాసముద్రం & మత్స్య సంపదకు సంబంధించి యూరోపియన్ కమీషనర్ మిస్టర్వర్జీనిజస్ సింకెవిసియస్ నేతృత్వంలోని యూరోపియన్ యూనియన్ నుండి ప్రతినిధి బృందం న్యూఢిల్లీలో భారత ప్రభుత్వ మత్స్యపశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ పర్షోత్తమ్ రూపాలాను కలుసుకుందిచేపల పెంపకంఆక్వాకల్చర్ తదితర అంశాలపై వివిధ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈయు అభ్యర్థన మేరకు, పోర్ట్ స్టేట్ మెజర్ అగ్రిమెంట్, డబ్ల్యుటీఓలోని ఫిషరీస్ సబ్సిడీ సమస్యలు, ఇండియన్ ఓషన్ ట్యూనా కమిషన్ (ఐఓటీసీ), 'ఓషన్ అండ్ ఫిషరీస్ డైలాగ్', ఐయుయు ఫిషింగ్ మరియు మార్కెట్ యాక్సెస్ వంటి ముఖ్యమైన విషయాలపై ద్వైపాక్షికంగా చర్చలు జరపడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఫిషరీస్‌పై ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించబడిన జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఫ్రేమ్‌వర్క్‌లోని సమస్యలపై చర్చించేందుకు అంగీకరించారు. ఈయు సరిహద్దు తనిఖీ పోస్ట్‌లో భారతీయలు పండించిన రొయ్యల తనిఖీ కోసం నమూనా ఫ్రీక్వెన్సీని తగ్గించడానికి సంబంధించిన విషయాలపై భారతదేశం యూరోపియన్ యూనియన్ దృష్టిని ఆకర్షించింది, ప్రస్తుత స్థాయి 50 శాతం నుండి మునుపటి స్థాయి 10 శాతం వరకు, జాబితా నుండి తొలగించబడిన వాటిని మళ్లీ జాబితా చేసింది. ఫిషరీ స్థాపనలు మరియు భారతదేశం నుండి ఈయుకి ఆక్వాకల్చర్ రొయ్యల ఎగుమతి కోసం కొత్తగా జాబితా చేయబడిన మత్స్య సంస్థలకు అనుమతి మంజూరు చేయడం గురించి కూడా చర్చించారు. దీనికి తోడు మే 2021లో ఇండియా-ఈయూ లీడర్స్ సమ్మిట్ సందర్భంగా ఈయు మరియు దాని సభ్య దేశాలకు చేసిన ఆహ్వానానికి అనుగుణంగా ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ (ఐపీఓఐ) యొక్క ఏదైనా మూల స్తంభంలో చేరాలని EU పక్షాన్ని అభ్యర్థించారు. ఫిషరీస్, పశుసంవర్ధక & పాడి పరిశ్రమ, సమాచార మరియు ప్రసారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్. ఎల్. మురుగన్, కార్యదర్శి డాక్టర్. అభిలాక్ష్ లిఖి, మత్స్య శాఖ, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు, మంత్రిత్వ శాఖ ప్రతినిధులు భారత విదేశీ వ్యవహారాలు మరియు ఎగుమతి తనిఖీ మండలి సభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

*****


(Release ID: 1943869) Visitor Counter : 154