రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

వృద్ధులకు ప్రత్యేక అవసరాల పింఛనుకు సంబంధించి 2019లో ఉపసంహరించుకున్న కేసులను తిరిగి తెరవడం లేదు: రక్షణ మంత్రిత్వ శాఖ

Posted On: 28 JUL 2023 4:30PM by PIB Hyderabad

రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంవోడీ), తాను ఉపసంహరించుకున్న పాత కేసులను తిరిగి తెరిచిందంటూ వచ్చిన వార్తలో వాస్తవం లేదు, అది తప్పుదారి పట్టించేలా ఉంది. 2019 ప్రారంభంలో ఉపసంహరించుకున్న ప్రత్యేక అవసరాల పింఛను కేసుల్లో ఎంవోడీ ఎలాంటి వ్యాజ్యం దాఖలు చేయలేదు. ప్రభుత్వ విధానం, సుప్రీంకోర్టు ఆదేశాల ద్వారా పరిష్కారమైన సమస్యల ఆధారంగా దిగువ కోర్టులు/ట్రైబ్యునళ్లు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వ లిటిగేషన్ పాలసీ ప్రకారం ఎంవోడీ అంగీకరిస్తుంది. చాలా కాలం క్రితం నాటి కేసుల్లో ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేయడం కూడా జరిగింది.

సర్వోన్నత న్యాయస్థానం తాజా తీర్పుల ప్రకారం, సైనిక విధుల్లో అయిన గాయం/వైకల్యం 'ఆపాదించకూడదు లేదా తీవ్రతరం కాదు' (నానా) అని వైద్య బోర్డులు స్పష్టంగా చెప్పిన సందర్భాల్లో మాత్రమే, ప్రభుత్వ సీనియర్ న్యాయ అధికారుల సలహా తీసుకుని ఎంవోడీ అప్పీల్‌ చేసింది. సైనిక విధుల్లో కలిగే గాయం/వైకల్యం విషయంలో ఎంవోడీ సున్నితంగా ఉంటుంది, వీర సైనికులకు అండగా నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం వారికి ఉత్తమ ఫలితం అందజేయడానికి ప్రయత్నిస్తుంది.

 

***



(Release ID: 1943867) Visitor Counter : 138


Read this release in: English , Urdu , Hindi