హోం మంత్రిత్వ శాఖ

ఎన్ డిఎంఏ పాత్ర

Posted On: 26 JUL 2023 5:06PM by PIB Hyderabad

వైపరీత్యాలు ఏర్పడిన సమయంలో సత్వర సహాయ చర్యలు చేపట్టడం సహా సకాలంలో నిర్వహణ కార్యకలాపాలు చేపట్టేందుకు వీలుగా విధానాలు, ప్రణాళికలు, మార్గదర్శకాలు రూపొందించాల్సిన బాధ్యత వైపరీత్యాల నిర్వహణ చట్టం 2005 (డిఎం చట్టం 2005) కింద గౌరవ ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పాటైన జాతీయ వైపరీత్య నిర్వహణ  సంస్థపై  (ఎన్ డిఎంఏ) ఉంది.

జాతీయ వైపరీత్య నిర్వహణ ప్రణాళికను (ఎన్ డిఎంపి) ఆమోదించడం సహా వివిధ రాష్ర్టాలకు చెందిన రాష్ర్ట వైపరీత్య నిర్వహణ సంస్థలు వైపరీత్య నిర్వహణ ప్రణాళికలు రూపొందించడానికి మార్గదర్శకాలు రూపొందిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్  మెంట్లు ప్రతిపాదించే ప్రణాళికలు కూడా ఆమోదిస్తుంది. ఎన్ డిఎంఏ వైపరీత్య నిర్వహణ విధానాలు, ప్రణాళికల అమలును కూడా ఎన్ డిఎంఏ సమన్వయపరుస్తుంది.

2023 - 24 సంవత్సరానికి ఎన్  డిఎంఏ నిర్వహించే వైపరీత్య పథకాలకు బడ్జెట్లో కేటాయించిన నిధులు :  రూ.277.47 కోట్లు.

ఎన్ డిఎంఏ ఒక ప్రాజెక్టు కాదు. డిఎం చట్టం 2005 నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఒక  సంస్థ. డిఎం చట్టం 2005 రాష్ర్ట స్థాయి వైపరీత్య నిర్వహణ  సంస్థలు, జిల్లా స్థాయి వైపరీత్య నిర్వహణ సంస్థల ఏర్పాటుకు కూడా అవకాశం కల్పిస్తుంది.

ప్ర‌కృతి వైపరీత్యాలు ఏర్పడిన సమయంలో సమర్థవంతమైన సత్వర స్పందన, సహాయ చర్యలు చేపట్టడానికి జాతీయ, రాష్ర్ట, జిల్లా స్థాయిల్లో పటిష్ఠమైన సంస్థాగత యంత్రాంగాలున్నాయి.  

వైపరీత్య నిర్వహణకు అతీతంగా పలు రకాల చర్యలకు విధానాలు, మార్గదర్శకాలు రూపొందించడం  సహా ఎన్  డిఎంఏ పలు  కార్యక్రమాలు చేపట్టింది. గత రెండేళ్ల కాలంలో ఎడిఎంఏ నిర్వహించిన వివిధ ప్రధాన కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.

                         i.         విభిన్న అంశాలను అధిగమిస్తూ ఎన్ డిఎంఏ మార్గదర్శకాలు జారీ చేసింది.

a.     కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన -  గాలివానలు, ఉరుములు, కుంభవృష్టి, ధూళి తుపానులు, వడగండ్ల వానలు, బలమైన ఈదురు గాలులు వచ్చిన సమయంలో నివారణ, నిర్వహణ చర్యలు

b.     కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన – శీతల గాలులు, మంచుపాతం సమయంలో నివారణ, నిర్వహణ చర్యలు  

                       ii.         సంసిద్ధత,  నివారణ,  సామర్థ్యాల నిర్మాణం కోసం ఎన్  డిఎంఏ ఈ దిగువ పథకాలు/ప్రాజెక్టులు నిర్వహించింది.

a.     ఆపద మిత్ర స్థాయి పెంపు - కొండచరియలు విరిగి పడడం, తుపానులు, భూకంపాలు, వరదలు సంభవించే ప్రమాదం ఉన్న 350 జిల్లాల్లో  1,00,000 వలంటీర్లకు శిక్షణ

b.     ఉమ్మడి హెచ్చరిక ప్రొటోకాల్ -  రాబోయే వైపరీత్యాలపై బహుళ మీడియా వ్యవస్థల ద్వారా జియో టాగింగ్  తో కూడిన హెచ్చరికలు జారీ చేయడానికి సమగ్ర వ్యవస్థ ఏర్పాటు.

c.     వైపరీత్యాల సమయంలో మద్దతుకు అత్యవసర స్పందన వ్యవస్థ విస్తరణ -  అత్యవసర  స్పందన కోసం దేశవ్యాప్తంగా ఒక నంబర్  (112) కేటాయించడం ఎమర్జెన్సీ సమయాల్లో పౌరులు ఉపయోగకరంగా ఉంది.

d.     మాక్ ఎక్సర్  సైజులు -  వరదలు, కొండచరియలు విరిగి పడడం, రసాయనిక వైపరీత్యాల సందర్భంలో రాష్ర్ట, జిల్లా స్థాయిల్లో సంసిద్ధతను మెరుగుపరిచేందుకు రాష్ట్ర స్థాయి, బహుళ రాష్ర్ట స్థాయి మాక్  ఎక్సర్  సైజులు నిర్వహించింది.  

e.     జాతీయ తుపాను ప్రమాద నివారణ ప్రాజెక్టు (ఎన్ సిఆర్ఎంపి) రెండో దశ ప్రాజెక్టు 6 కోస్తా రాష్ర్టాల్లో (గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ర్ట, పశ్చిమ బెంగాల్  లలో అమలు

    iii.         ఎన్ డిఎంఏ రుతుపవనాల ముందు సమావేశాలు, సంక్షిప్త వివరణ సెషన్లు నిర్వహించి సంబంధిత వర్గాలన్నింటికీ ఆదేశాలు/సలహాలు జారీ చేసింది.

    iv.         ఉత్తరాఖండ్  లోని జోషిమఠ్  లో క్షేత్రస్థాయి పరిస్థితులు, సంబంధిత అంశాలపై సమగ్ర అధ్యయనానికి బహుళ విభాగాలతో కూడిన నిపుణుల గ్రూప్  ను ఎన్ డిఎంఏ ఏర్పాటు చేసింది.

     v.         టెలివిజన్,  రేడియో. సోషల్  మీడియా ద్వారా ఎన్  డిఎంఏ వివిధ వైపరీత్యాలపై చైతన్య ప్రచారాలు నిర్వహించింది.

    vi.         జి-20కి భారత్  అధ్యక్షత వహిస్తున్న కాలంలో వైపరీత్యాల రిస్క్  నివారణపై (డిఆర్ఆర్) జి-20 వర్కింగ్ గ్రూప్  కు ఎన్ డిఎంఏ సారథ్యం వహిస్తోంది.

   vii.         ఎన్ డిఎంఏ వెబ్ ఆధారిత డైనమిక్  కాంపోజిట్  రిస్క్  అట్లాస్, నిర్ణయాల మద్దతు వ్యవస్థ (వెబ్ డిసిఆర్ఏ, డిఎస్ఎస్) పరికరాన్ని కోస్తా ప్రాంతంలోని మొత్తం 13 జిల్లాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది.

కేంద్ర హోం శాఖ సహాయమంత్రి శ్రీ నిత్యానంద్  రాయ్  రాజ్యసభకు ఒక లిఖితపూర్వక సమావేశంలో ఈ విషయం తెలియచేశారు. 

***



(Release ID: 1943616) Visitor Counter : 112


Read this release in: English , Urdu , Tamil