వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సర్వీసు చార్జీలకు సంబంధించి తన ఆదేశాలను అమలు చేయని రెస్టరెంట్, హోటల్ అసోసియేషన్ ల కు లక్షరూపాయల పెనాల్టి విధించిన ఢిల్లీ హైకోర్టు


ఈ ఖర్చులు భారతప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల విభాగానికి చెల్లించాల్సిందిగా ఆదేశం

....సిసిపిఎ మార్గదర్శకాలు విడుదలైన తర్వాత సర్ఈసు చార్జీలపై ఎన్సిహెచ్ వద్ద నమోదైన 4 వేల ఫిర్యాదులు

Posted On: 27 JUL 2023 3:28PM by PIB Hyderabad

2023 ఏప్రిల్ 12న తాను జారీ చేసిన ఆదేశాలను పాటించనందుకు ఒక్కొక్కరు లక్ష రూపాయల వంతున , భారత ప్రభుత్వానికి చెందిన వినియోగదారుల విభాగానికి చెల్లించాల్సిందిగా
నేషనల్ రెస్టరెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.ఆర్.ఎ.ఐ), ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టరెంట్  అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.హెచ్.ఆర్.ఎ.ఐ) లను ఢిల్లీ హైకోర్టు   ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు 2023 జూలై 24న ఉత్తర్వులు జారీచేసింది.

2023 ఏప్రిల్ 12న హైకోర్టు జారీచేసిన ఆదేశాలలో కింది అంశాలు ఉన్నాయి. అవి ,
1) ప్రస్తుత రిట్ పిటిషన్లకు మద్దతు తెలుపుతున్న  సభ్యుల పూర్తి జాబితాను రెండు అసోసియేషన్లు సమర్పించాలి.
2)రెండు అసోసియేషన్లు ఈ కింది అంశాలపై తమ వైఖరి తెలపడంతో పాటు స్పష్టమైన అఫిడవిట్ దాఖలు చేయాలి.
. ఎ) సర్వీసు చార్జీని తప్పనిసరి నిబంధనగా తమ బిల్లులలో చేర్చే సభ్యుల శాతం
.బి)వినియోగదారుల మనసులో గందరగోళం లేకుండా ఉండేందుకు, సర్వీసు చార్జి పేరుకు బదులుగా, ఇది ప్రభుత్వం విధిస్తున్నది కాదు కనుక  సిబ్బంది
సంక్షేమ ఫండ్, సిబ్బంది సంక్షేమ వితరణ, సిబ్బంది చార్జీలు, సిబ్బంది సంక్షేమ చార్జీలు తదితరాలుగా ప్రత్యామ్నాయ పదం వాడడానికి ఈ అసోసియేషన్లకు ఏమైనా అభ్యంతరం ఉందా;
.సి) సర్వీసు చార్జిని ఐచ్ఛికంగా పరిగణించడానికి సిద్ధంగా ఉన్నవారి శాతం. అలాగే  చార్జి చేయడానికి వీలున్నదానిలో గరిష్ఠ శాతానికి లోబడి, వినియోగదారులు స్వచ్ఛందంగా చెల్లించడానికి వీలున్నంతవరకు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించడం.

పైన పేర్కొన్న ఆదేశాలకు అనుగుణంగా రెస్టరెంట్ల అసోసియేషన్లు కోర్టుకు తగిన వివరాలు సమర్పించవలసి ఉంది. అయితే అసోసియేషన్లు ఏవీ పై ఆదేశాలకు అనుగుణంగా అఫిడవిట్లను సమర్పించలేదు.
దీనిని బట్టి 2023 ఏప్రిల్ 12 నాటి ఆదేశాలను రెస్టరెంట్ల అసోసియేషన్లు పూర్తిగా పాటించలేదని కోర్టు గుర్తించింది.
అలాగే ప్రతివాదులకు సక్రమంగా పంపకుండా అఫిడవిట్లు దాఖలు చేశాయని, తద్వారా కోర్టులో కేసు ముందుకు సాగకుండా ఉండేలా వ్యవహరించాయనికోర్టు అభిప్రాయపడింది.
హైకోర్టు గతంలో సూచించిన రీతిలో అఫిడవిట్లు దాఖలు చేసేందుకు చివరి అవకాశంగా కోర్టు నాలుగు రోజుల సమయం ఇచ్చింది.  అలాగే కోర్టు ఖర్చుల కింద లక్షరూపాయలను పే అండ్ అకౌంట్స్ ఆఫీస్, డిపార్టమెంట్ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్,
న్యూఢిల్లీ పేరుమీద డిమాండ్ డ్రాఫ్ట్ తీసి చెల్లించాల్సిందిగా కూడా ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించని అఫిడవిట్లను రికార్డులలోకి పరిగణించరని పేర్కొనింది. ఈ అంశాన్ని 2023 సెప్టెంబర్ 5  వతేదీ విచారణకు ఆదేశించింది.

రెస్టరెంట్లలో వినియోగదారుల నుంచి బలవంతంగా సర్వీసు చార్జీలు వసూలు  చేయడంపై జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ (ఎన్.సి.హెచ్)కు ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి.
సిసిపిఎ 2022 జూలైలో విడుదల చేసిన మార్గదర్శకాల అనంతరం ఈ అంశంపై సుమారు 4,000 ఫిర్యాదులు ఎన్.సి.హెచ్కు అందాయి.
అందులో ప్రధానంగా,
ఎ) రెస్టరెంట్, హోటల్ లో సేవలు సంతృప్తి కరంగా లేకపోయినప్పటికీ బలవంతంగా సర్వీసు చార్జీలు చెల్లించాల్సిందిగా వినియోగదారులపై ఒత్తిడి తీసుకురావడం.
బి) సర్వీసు చార్జీ చెల్లింపును తప్పని సరి చేయడం
సి) సర్వీసు చార్జి అనేది ఒక చార్జి అని , దీనికి ప్రభుత్వ అనుమతి ఉన్నట్టు చిత్రించడం
డి) సర్వీసు చార్జీలు చెల్లించని వారిని వేధించడం, వారిని ఇబ్బందులకు గురిచేయడం, కొన్ని సార్లు బౌన్సర్లను ఉపయోగించడం.
ఇ) సర్వీసు చార్జి పేరుతో 15  శాతం, 14 శాతం ఇలా ఇష్టం వచ్చినట్టు వినియోగదారుల నుంచి వసూలు చేయడం
ఎఫ్) సర్వీసు చార్జీలను ఇతర పేర్లతో అంటే ఎస్.సి, ఎససి, ఎస్.సి.ఆర్, లేదా ఎస్.చార్జీల వంటి రకరకాల పేర్లతో వసూలుచేస్తుండడం పై ఫిర్యాదులు అందాయి.

***


(Release ID: 1943614) Visitor Counter : 98


Read this release in: English , Urdu , Hindi