గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

అమృత్ 2.0 కింద ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి

Posted On: 27 JUL 2023 4:04PM by PIB Hyderabad

భారతదేశంలోని 500 నగరాల నుండి 4,902  పట్టణాలకు నీటి సరఫరా కవరేజీని ముందుకు తీసుకెళ్లడానికి,  అక్టోబర్ 1, 2021న అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) 2.0  ప్రారంభించబడింది.  నగరాలను ‘స్వావలంబన’ మరియు ‘సురక్షిత నీటి’ నగరాలుగా తీర్చిదిద్దడంపై అమృత్2.0 దృష్టిసారించింది. దేశవ్యాప్తంగా 500 అమృత్ నగరాల్లో మురుగునీటి పారుదల & సెప్టేజీ నిర్వహణ యొక్క సార్వత్రిక కవరేజీని అందించడంపైనా అమృత్ 2.0 ప్రధానంగా దృష్టిసారించింది. ఉద్దేశించిన ఫలితాలను సాధించేందుకు 2.68 కోట్ల కుళాయి కనెక్షన్లు ,  2.64 కోట్ల మురుగునీటి కనెక్షన్లు అందించాలని మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమర్పించిన రాష్ట్ర నీటి కార్యాచరణ ప్రణాళికల కింద ఇప్పటివరకు, ₹91,557 కోట్ల విలువైన 3,126 నీటి సరఫరా ప్రాజెక్టులు (ఆపరేషన్ & మెయింటెనెన్స్ ఖర్చుతో సహా) & ₹44,788 కోట్ల (ఆపరేషన్ & మెయింటెనెన్స్ ఖర్చుతో సహా) విలువైన 501 సీవరేజ్ / సెప్టేజీ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్‌లకు గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదించింది.

ఈ ప్రాజెక్టుల ద్వారా, 3.46 కోట్ల కొత్త కుళాయి కనెక్షన్‌లతో సహా సేవలు అందించబడతాయి. 89 లక్షల కొత్త మురుగు కాల్వ కనెక్షన్‌లు, సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 9,107 ఎంఎల్డీ నీటి శుద్ధి సామర్థ్యం, 3,591 ఎంఎల్డీ మురుగునీటి శుద్ధి సామర్థ్యం, 89,594 కిలోమీటర్ల నీటి పంపిణీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం/భర్తీ చేయడం, 16,010 కిలోమీటర్ల నీటి పంపిణీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం/ భర్తీ చేయడం; 24,824 కిలోమీటర్ల  మురుగునీటి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం / భర్తీ చేయడం & 1,616 ఎంఎల్డీ రీసైకిల్ / పునర్వినియోగ సామర్థ్యం అభివృద్ధి చేయడానికి ప్రణాళిక చేయబడింది. ప్రణాళికాబద్ధమైన అవుట్‌పుట్‌లను సాధించడం వల్ల మెరుగైన సర్వీస్ డెలివరీ మరియు పౌరుల జీవన సౌలభ్యం ఏర్పడుతుంది.

బ్రహ్మపురం వద్ద 1 ఎంఎల్డీ మల బురద ట్రీట్‌మెంట్ ప్లాంట్ కోసం ప్రతిపాదన రాష్ట్ర సమీక్షలో ఉంది, తుది ఆమోదం కోసం రాష్ట్రం ఇంకా ప్రాజెక్ట్‌ను గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క అపెక్స్ కమిటీకి సమర్పించాల్సి ఉంది.

నగరాల్లో పురోగతిని ర్యాంక్ చేయడానికి అమృత్ 2.0 కోసం ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ రూపొందించబడుతోంది.

హౌసింగ్ & పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ గురువారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***

 



(Release ID: 1943612) Visitor Counter : 81


Read this release in: English , Urdu , Tamil